AP PGCET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫీజు, డాక్యుమెంట్లు, ముఖ్యమైన సూచనలు పూర్తి వివరాలు
AP PGCET 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 09,2026 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి వివరాలు కోసం ఈ క్రింది ఆర్టికల్ కధనాన్ని చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కోరుకునే అభ్యర్థుల కోసం AP PGCET 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 09,2026 నుంచి ప్రారంభమైంది.ఈ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో సంబంధిత విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చేసుకోవాలి.
అప్లై చేసే ముందు అర్హత ప్రమాణాలు , అవసరమైన సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు ఒకసారి బాగా చూసుకుని సిద్ధంగా ఉంచుకుంటే తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండదు.గడువులు, సూచనలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది.
AP PGCET 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు (What will be the registration process for AP PGCET 2026? Full details)
మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Online Application”పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ప్రాథమిక వివరాలు నమోదు చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయ్యాకే పూర్తి అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
ఆ ఫారంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారం జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. పరీక్ష రాయాలనుకునే కేంద్రాన్ని కూడా ఎంపిక చేయాలి. చివరగా ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని ఫారం సబ్మిట్ చేయాలి.
ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులు చేయడం కష్టమవుతుందనే విషయం గుర్తించుకుని ప్రతి వివరాన్ని స్పష్టంగా నమోదు చేయడం మంచిది.
AP PGCET 2026 ఫీజు నిర్మాణం? కేటగిరీ వారీగా పూర్తి వివరాలు (AP PGCET 2026 Fee Structure? Complete Details Category-wise)
- OC (ఓపెన్ క్యాటగిరీ )అభ్యర్థులకు సాధారణంగా ఎక్కువ ఫీజు ఉంటుంది.
- BC (వెనుకబడిన తరగతులు)అభ్యర్థులకు OCతో పోలిస్తే కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది.
- SC/ST మరియు దివ్యాంగులుకనిష్ట అప్లికేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP PGCET 2026 అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే ట్రాన్సాక్షన్ ఐడి మరియు రిఫరెన్స్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వీటిని తప్పనిసరిగా గమనించి సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ వివరాలు అవసరం అవుతాయి.
AP PGCET 2026 డాక్యుమెంట్ల అప్‌లోడ్ విధానం ఎలా చేయాలి? కంపాటిబిలిటీపై ముఖ్యమైన సూచనలు (How to upload documents for AP PGCET 2026? Important instructions on compatibility)
AP PGCET అప్లికేషన్‌లో డాక్యుమెంట్ల అప్‌లోడ్ చాలా ముఖ్యమైన దశ. అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, అవసరమైతే విద్యార్హత సర్టిఫికెట్లు వంటి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా ఫోటో మరియు సంతకంJPG/JPEG ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ సైజ్ అధికారికంగా సూచించిన పరిమితిలోనే ఉండాలి (ఉదాహరణకి 50KB నుంచి 200KB వరకు). సైజ్ ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే ఫైల్ అప్‌లోడ్ కాకపోవచ్చు.
స్కాన్ చేసిన డాక్యుమెంట్లు క్లియర్‌గా ఉండాలి. బ్లర్ లేదా షాడో ఉన్న ఫోటోలు తిరస్కరించబడే అవకాశమే ఎక్కువ. మొబైల్‌తో ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే రిజల్యూషన్ సరైనదో లేదో ముందే చెక్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ సాదా రంగులో ఉండటం మంచిది.
టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండాలంటే తాజా వెర్షన్Google ChromeలేదాMozilla Firefoxబ్రౌజర్ ఉపయోగించడం ఉత్తమం. పాత బ్రౌజర్లు వాడితే పేజీలు సరిగా లోడ్ కాకపోవచ్చు. అలాగే ఫైల్ నేమ్‌లో #, %, &, @ వంటి ప్రత్యేక గుర్తులు లేకుండా సింపుల్ పేరుని ఉపయోగించండి.
అప్‌లోడ్ చేసే ముందు డాక్యుమెంట్లను సరిగా స్కాన్ చేసి అవసరమైతే ఇమేజ్ కంప్రెషన్ టూల్స్ ద్వారా సైజ్ తగ్గించుకోండి. చివరగా అప్‌లోడ్ చేసిన ఫైల్ ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ ద్వారా ఒకసారి పరిశీలించటం మంచిది. ఇలా జాగ్రత్తగా చేస్తే అప్లికేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
AP PGCET 2026 ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే ఏమి చేయాలి? (What to do if you face problems during AP PGCET 2026 fee payment?)
AP PGCET 2026 అప్లికేషన్ ఫీజు చెల్లింపు సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ ఐతే వెంటనే మరో పేమెంట్ చేయడానికి తొందరపడకండి. ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ నుండి మొత్తం డెబిట్ అయిందో లేదో చెక్ చేయండి. డెబిట్ అయి ఉండి అప్లికేషన్‌లో పేమెంట్ స్టేటస్ అప్డేట్ కాకపోతే కనీసం 24 గంటలు వేచి చూడడం మంచిది, ఎందుకంటే సర్వర్ ఆలస్యం వల్ల అప్డేట్ లేట్ అవుతుంది.
ఇంకా సమస్య ఆలాగే కొనసాగితే అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ లేదా ఇమెయిల్ ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఆ సమయంలో ట్రాన్సాక్షన్ ఐడి, రిఫరెన్స్ నంబర్, స్క్రీన్‌షాట్ వంటి వివరాలు మీ వద్ద ఉండడం చాలా ముఖ్యం. ఇవి సమస్యను త్వరగా పరిష్కరించడానికి సహాయపడతాయి.
AP PGCET 2026 అప్లికేషన్ ఫారం సమర్పించిన తర్వాత తప్పులు చేస్తే ఏమి చేయాలి? (What to do if mistakes are made after submitting AP PGCET 2026 application form?)
AP PGCET 2026 అప్లికేషన్ సమర్పించిన తర్వాత ఏదైనా తప్పు గుర్తించినా ఆందోళన అవసరం లేదు. సాధారణంగా పరీక్ష నిర్వహణ సంస్థ “Correction Window” ద్వారా కొన్ని వివరాలను సవరించుకునే అవకాశం ఇస్తుంది. ఆ సమయంలో మాత్రమే కొన్ని వివరాలను సవరించుకోవచ్చు. అయితే పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ వంటి ముఖ్యమైన వివరాలను మార్చుకోవడానికి ప్రత్యేక అనుమతి కావచ్చు లేదా కొన్ని పరిమితులు ఉండవచ్చు.
కాబట్టి ఫారం సబ్మిట్ చేసే ముందు ప్రతి వివరాన్ని రెండు సార్లు కచ్చితంగా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఫోటో, సంతకం, విద్యార్హత వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోవాలి. మొత్తంగా చూస్తే , AP PGCET 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేసి, అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న సూచనలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గడువులోపు దరఖాస్తు చేయడం ప్రతి అభ్యర్థి బాధ్యత.