AP TET 2025లో 80 మార్కులు వస్తే..AP DSCకి వెయిటేజ్ ఎంత?
AP TET 2025 త్వరలో ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల కోసం ఇక్కడ AP TET 2025లో 80 మార్కులు పొందితే AP DSCకి వెయిటేజ్ ఎంత ఉంటుందనే అంశాన్ని వివరించడం జరిగింది.
AP TET 2025లో 80 మార్కులు వస్తే AP DSCకి వెయిటేజ్ ఎంత? (What is the weightage for AP DSC if get 80 marks in AP TET 2025?) :
AP TET 2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే తాము సాధించే మార్కులకు ఎంత AP DSC వెయిటేజ్ ఉంటుందనే విషయంపై అభ్యర్థుల్లో సందేహాలు ఉంటాయి. ఈ మేరకు అభ్యర్థుల కోసం ఇక్కడ AP TET 2025లో 80 మార్కులు పొందితే AP DSCకి వెయిటేజ్ ఎంత ఉంటుందనే అంశాన్ని వివరించడం జరిగింది. గత సంవత్సరం డేటాతో పాటు సమగ్రంగా ఉదాహరణతో అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ డేటా సాయంతో 80 మార్కులు పొందితే ఎంత వెయిటేజీ ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.
AP TET 2025లో 80 మార్కులు పొందితే SC, ST, BC, PwBD కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టే. కానీ జనరల్, OC కేటగిరీకి ఈ మార్కులు చాలా తక్కువని చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి 90 మార్కులు (60 శాతం) అవసరం. టీచర్ రిక్రూట్‌మెంట్ (AP DSC) కోసం, ఈ TET మార్కులకు 20 శాతం వెయిటేజ్ లభిస్తుంది, కాబట్టి 80 మార్కులు మీ DSC స్కోర్‌కు (80/150 * 20% = ~8) దాదాపు 8 పాయింట్లు జోడించబడతాయి. ఈ వెయిటేజీ అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి అర్హత సాధించడానికి సహాయపడుతుంది.
AP TET 2025లో 80 మార్కులు వస్తే AP DSCకి వెయిటేజ్ ఎంత?
AP TET కోసం 20 శాతం వెయిటేజీని, AP DSCకి 80 శాతం వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటే.. AP TET 2025లో 80 మార్కులు సాధించిన అభ్యర్థులకు AP DSCకి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఇక్కడ అందించాం.
AP TET 2025లో సాధించిన మార్కులు | మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ | AP DSC 2025లో సాధించిన మార్కులు | మెరిట్ జాబితాలో AP DSC స్కోర్ వెయిటేజీ | మెరిట్ జాబితాలో మొత్తం మార్కులు |
80 | 8 | 30 | 24 | 34.67 |
80 | 8 | 35 | 28 | 38.67 |
80 | 8 | 40 | 32 | 42.67 |
80 | 8 | 45 | 36 | 46.67 |
80 | 8 | 50 | 40 | 50.67 |
80 | 8 | 55 | 44 | 54.67 |
80 | 8 | 60 | 48 | 58.67 |
80 | 8 | 65 | 52 | 62.67 |
80 | 8 | 70 | 56 | 66.67 |
80 | 8 | 75 | 60 | 70.67 |
80 | 8 | 80 | 64 | 74.67 |
AP TET 2025 అర్హత మార్కులు (AP TET Qualifying Marks 2025)
AP TET కటాఫ్ 2025 అనేది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి పొందవలసిన కనీస అర్హత మార్కులు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు AP TET పాస్ మార్కులు 2025 పొందాలి. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అభ్యర్థులు కేటగిరీల వారీగా తమ అర్హత మార్కుల గురించి తెలుసుకోవచ్చు.
కేటగిరి | అర్హత శాతం (శాతంలో) | అర్హత మార్కులు (150 లో) |
|---|---|---|
జనరల్ | 60 | 90 |
BC | 50 | 75 |
SC/ST/ దివ్యాంగులు (PH) | 40 | 60 |
AP TET ఫలితాలు 2025 తర్వాత ఏంటి?
AP TET పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో 1వ తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. నియామక ప్రక్రియలో AP TET స్కోర్‌లకు 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) స్కోర్‌లకు 80 శాతం వెయిటేజీ ఇవ్వబడుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగానే ఎంపిక జాబితా తయారు చేయడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.AP TET 2025లో మార్కులు Vs వెయిటేజీల విశ్లేషణ
