AP Model School Results 2023: ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు 2023 విడుదల, ఇదే డైరక్ట్ లింక్
ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలు 2023 జూన్ 21, 2023న విడుదలయ్యాయి. ఫలితాల డైరక్ట్ లింక్‌ను అందజేయడం జరిగింది. ఆ లింక్ (AP Model School Results 2023) ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చరు.
ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలు 2023 (AP Model School Results 2023): ఏపీ రాష్ట్ర పాఠశాల విద్యావిభాగం, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి (ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు (AP Model School Results 2023) విడుదలయ్యాయి.ఈ పరీక్ష జూన్ 11న జరిగింది. అప్పటి నుంచి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రిజల్ట్స్ జూన్ 21న విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులకు సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలు 2023 వివరాలు (AP Model School Results 2023 Details)
ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలు 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువన టేబుల్లో అందజేయడం జరిగింది.| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| ఎగ్జామినేషన్ | APMS ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2023 |
| ఆర్గనైజేషన్ | డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
| పరీక్షా తేదీ | జూన్ 11, 2023 |
| ఫలితాల విడుదల తేదీ | జూన్ 21, 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | www.apms.apcfss.in |
APMS ఆరో తరగతి ఫలితం 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check the APMS 6th Class Result 2023?)
ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ఫలితాలు జూన్ 21, 2023న రిలీజ్ అయ్యాయి. ఫలితాలను ఈ పేజీలో ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌నుwww.apms.apcfss.inసందర్శించాలి
- హోంపేజీలో “ఫలితాలు” లేదా “పరీక్షా ఫలితాలు” విభాగం ఉంటుంది.
- పక్కనే Click Here అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో అభ్యర్థి ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- అనంతరం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి లేదా వీక్షించండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఫలితం PDFగా డౌన్‌లోడ్ చేయబడవచ్చు లేదా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- ఓపెన్ అయ్యే PDF పేపర్‌లో మీ పేరు లేదా రోల్ నెంబర్‌ను కనుగొనండి.
- తర్వాత ఫలితాలను సేవ్ చేయండి లేదా ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.