Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for setting the exam alert! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

త్వరలో AP TET నవంబర్ 2025 నోటిఫికేషన్ aptet.apcfss.inలో విడుదల, అంచనా తేదీలు, లైవ్ అప్‌డేట్‌లు

ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే శుభవార్త.  AP TET 2025 (AP TET November 2025 Notification) నోటిఫికేషన్ అతి త్వరలో విడుదలకానుంది. నవంబర్ చివరి వారంలో AP TET 2025 పరీక్ష జరగనుంది. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for setting the exam alert! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

AP TET 2025 నోటిఫికేషన్  (AP TET November 2025 Notification) : ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. త్వరలో AP TET 2025 నోటిఫికేషన్ త్వరలో విడుదలకానుంది.  రెండు వారాల్లో ఏ క్షణమైనా  అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో నోటిఫికేషన్ (AP TET November 2025 Notification) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ TET, DSC నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల అంటే నవంబర్ నెల చివరి వారంలో TET నిర్వహించాలని, వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు AP TET 2025 ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అధికారిక నోటిఫికేషన్‌తో పాటు AP TET దరఖాస్తు ప్రక్రియను 2025 కూడా ప్రారంభమవుతుంది. AP TET పరీక్ష ప్రతి పరీక్ష రోజున రెండు షిఫ్ట్‌లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలు, సిలబస్, పరీక్షా సరళిపై వివరాలను ఇక్కడ చూడవచ్చు.

లేటెస్ట్ న్యూస్: AP TET 2025 నవంబర్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?

18 ఏళ్ల నుంచి 40 ఏళ్లు వయస్సున్న అభ్యర్థులు AP TETకి దరఖాస్తు చేసుకోవచ్చు. AP TET పరీక్షలో పాసైన వారు భవిష్యత్తులో డీఎస్సీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. OC అభ్యర్థులు 60 శాతం, BC అభ్యర్థులు 50 శాతం, SC, ST అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

AP TET 2025 అంచనా తేదీలు (AP TET 2025 Expected Dates)

AP TET 2025 నోటిఫికేషన్‌కి సంబంధించిన అంచనా తేదీలను ఇక్కడ అందించాం. ఈ పట్టికలో తేదీలను మా దగ్గరున్న సమాచారం మేరకు కేవలం అంచనాగా మాత్రమే అందించాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.

AP TET నవంబర్ ఈవెంట్స్

AP TET 2025  అంచనా తేదీలు

AP TET నోటిఫికేషన్ 2025 విడుదల తేదీ

అక్టోబర్ రెండో వారం, 2025

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

అక్టోబర్ రెండో వారం, 2025

దరఖాస్తు సబ్మిషన్ చివరి తేదీ

అప్‌డేట్ చేయబడుతుంది

చెల్లింపు గేట్‌వే విండో తెరిచి ఉంది

అప్‌డేట్ చేయబడుతుంది

AP TET హాల్ టికెట్ 2025

అప్‌డేట్ చేయబడుతుంది

AP TET పరీక్ష తేదీ 2025

నవంబర్ చివరి వారంలో 2025

AP TET 2025 పరీక్షా సరళి (AP TET 2025 Exam Pattern)

అభ్యర్థులు AP TET 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్షా విధానం, పరీక్ష వ్యవధి, పరీక్ష భాష, మొత్తం ప్రశ్నలు, మొత్తం మార్కులు, మార్కింగ్ స్కీమ్, నెగటివ్ మార్కులకు సంబంధించిన వివరాలు ఇక్కడ అందించాం.
  • పరీక్ష సరళి : ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది.

  • పరీక్ష వ్యవధి : ప్రవేశ పరీక్ష 2 గంటలు 30 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించబడుతుంది.

  • మొత్తం ప్రశ్నల సంఖ్య : ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.

  • మొత్తం మార్కులు : ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో గరిష్టంగా 150 మార్కులు ఉంటాయి.

  • ప్రశ్నల రకం : దరఖాస్తుదారులు ప్రవేశ పరీక్షలో ఆబ్జెక్టివ్-టైప్ బహుళ-ఎంపిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

  • మార్కింగ్ స్కీమ్ : దరఖాస్తుదారునికి ఇచ్చిన ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది.

  • నెగెటివ్ మార్కులు : ప్రవేశ పరీక్షలో నెగెటివ్ మార్కులుండవు.

  • పేపర్లు : ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో రెండు పేపర్లు (పేపర్ I, పేపర్ II) ఉంటాయి.

AP TET నవంబర్ 2025 నోటిఫికేషన్ లైవ్ అప్‌డేట్లు

  • Oct 11, 2025 05:00 PM IST

    AP TET పేపర్ 1 & పేపర్2 కి ప్రాధాన్యత ఎలా నిర్ణయించాలి?

    AP TETలో పేపర్2 (తరగతులు 6–8) సబ్జెక్టులు కొద్దిగా సవాలుగా ఉన్నాయి, కాబట్టి పేపర్ 2 పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. పేపర్ 1 (తరగతులు 1–5) పోలిస్తే సులభమైనవిగా ఉంటుంది. ప్రిపరేషన్ లో భావన స్పష్టత, మునుపటి సంవత్సరం పేపర్ల అభ్యాసం, మరియు మాక్ పరీక్షలు పై ఏకాగ్రత చేయడం ప్రధానంగా అధిక స్కోరు సాధించడానికి ముఖ్యం.

  • Oct 11, 2025 04:30 PM IST

    AP TET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే చివరి గడువు ఎప్పటి వరకు ఉంటుంది?

    AP TET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ లో నిర్దిష్ట గడువు ఇవ్వబడుతుంది.అభ్యర్థులు పరీక్ష తేదీకు ముందే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని తీసుకెళ్ళాలి. గడువు తేదీ మించిపోతే, నకిలీ కాపీ పొందడానికి పరిమితులు ఉండవచ్చు, కాబట్టి తేదీలను తప్పక గమనించడం చాలా ముఖ్యం

  • Oct 11, 2025 04:00 PM IST

    AP TET హాల్ టికెట్ మిస్ అయితే పరీక్ష రోజుకి ప్రవేశం ఎలా సాధ్యం?

    AP TET హాల్ టికెట్ మిస్ అయినా, అధికారిక పోర్టల్ నుండి నకిలీ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా   ప్రింట్ తీసుకెళ్ళాలి. పరీక్ష హాలులో అసలు ఫోటో IDతో ధృవీకరణ చేయించాలి.హాల్ టికెట్ లేకపోతే ప్రవేశం నిరాకరించబడించడం అవుతుంది, కాబట్టి తప్పక నకిలీ కాపీ తీసుకెళ్ళడం అత్యవసరం.

  • Oct 11, 2025 03:30 PM IST

    AP TET పరీక్ష హాల్ ఎంట్రీ కోసం ఏ డాకుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి?

    అభ్యర్థులు AP TET పరీక్ష హాల్ లో ఎంట్రీ కోసం ఈ క్రింద ఇచ్చిన డాకుమెంట్స్ తప్పనిసరిగా తీసుకువెళ్లాలి

    • హాల్ టికెట్ ప్రింట్ కాపీ
    • ఒరిజినల్ ఫోటో ఐడి (ఆధార్ / పాన్ / ఓటరు ఐడి)
    • అదనపు ఫోటో కాపీ వెరిఫికేషన్ కోసం
    • ఈ డాకుమెంట్స్ లేకుండా పరీక్ష హాల్ లో ప్రవేశం ఉండదు.

  • Oct 11, 2025 03:00 PM IST

    AP TET ఆన్‌లైన్ అప్లికేషన్ లో తప్పు ఫీల్డ్ సబ్మిట్ అయితే ఎలా సరిచేయాలి?

    AP TET ఆన్‌లైన్ అప్లికేషన్ లో ఏ ఫీల్డ్ తప్పుగా సబ్మిట్ అయినట్లయితే, దిద్దుబాటు విండో ప్రారంభమైన తర్వాత మాత్రమే అధికారిక పోర్టల్ ద్వారా సరిచేయవచ్చు. గడువు తేదీ తర్వాత అధికారులు సరిచేసే అవకాశం ఉండదు, కాబట్టి అభ్యర్థుల నోటిఫికేషన్ లో చెప్పిన తేదీలను తప్పక గమనించాలి.

  • Oct 11, 2025 02:30 PM IST

    AP TET మార్కుల DSC ఎంపికలో ఎలాగా వెయిటేజీ కలిగి ఉంటాయి?

    AP TET మార్క్స్ DSC ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. TETలో ఎక్కువ మార్కులు సాధిస్తే, DSCలో వెయిటేజీ గరిష్టంగా ఉంటుంది.

    121–150 మార్క్స్ → 30 మార్క్స్ వెయిటేజీ 

    91–120 మార్క్స్ → 20 మార్క్స్ వెయిటేజీ 

    60–90 మార్క్స్ → 10 మార్క్స్ వెయిటేజీ 

    అత్యధిక వెయిటేజీ ఉండడం వల్ల మెరిట్ జాబితాలో ర్యాంక్ పెరుగుతుంది, మెరుగైన పాఠశాల ఎంపిక మరియు పోస్టింగ్ లో అడ్వాంటేజ్ లభిస్తుంది.

  • Oct 11, 2025 02:00 PM IST

    AP TETలో 150/150 మార్కులు సాధించడం సాధ్యమేనా?

    అవును.AP TETలో పూర్తి మార్కులు సాధించడం సాధ్యమే, కానీ అందుకు సరైన ప్రణాళిక చాలా ముఖ్యం. NCERT భావనలు స్పష్టంగా తెలుసుకోవడం, గత సంవత్సర ప్రశ్న పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, మరియుమాక్ టెస్టులు ద్వారా వేగం మరియు ఖచ్చితత్వం మెరుగుపడుతు చేసుకోవడం అవసరం. సమయ నిర్వహణ మరియు భావనలో స్పష్టత ఉంటే అధిక స్కోరు సాధించడం సులభం. అధిక స్కోరు పొందితే మెరిట్ జాబితాలో ఉన్నత స్థానాలు రావడంతో, DSC ఎంపికలో ముఖ్యమైన ప్రయోజనం లభిస్తుంది.

  • Oct 11, 2025 01:30 PM IST

    AP TET పరీక్ష తేదీ మారితే ఎలా తెలుసుకోవాలి?

    • అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో నోటిఫికేషన్ చూడండి.
    • SMS / ఇమెయిల్ నోటిఫికేషన్లు ద్వారా వెంటనే సమాచారం అందవచ్చు
    • విశ్వసనీయ విద్యా వెబ్‌సైట్లు కూడా తేదీ సవరించిన సమాచారం అందిస్తాయి.

  • Oct 11, 2025 01:00 PM IST

    AP TET స్కోర్‌కార్డ్ లాగ్ అయినప్పుడు లేదా మిస్ అయితే ఏమి చేయాలి?

    • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    • డిజిటల్ సర్టిఫికెట్ PDF సేవ్ & ప్రింట్ చేసుకోవడం ముఖ్యమే.

  • Oct 11, 2025 12:30 PM IST

    AP TETలో అధిక స్కోరు సాధించడానికి ఏ టిప్స్ ఉపయోగపడతాయి?

    • మునుపటి సంవత్సరం పేపర్లు & మాక్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి.
    • సమయ నిర్వహణ & ఖచ్చితత్వం పై దృష్టి పెట్టండి.
    • మాక్ టెస్టులు ద్వారా స్వీయ విశ్లేషణ చేయండి.
    • భావనా ​​స్పష్టత & NCERT పుస్తకాల అధ్యయనం ముఖ్యమే.

  • Oct 11, 2025 12:00 PM IST

    AP TET 2025 ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు?

    • అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే ఖరారు అవుతుంది.
    • సాధారణంగా నోటిఫికేషన్ విడుదలైన 2 నుండి 3 వారాల్లో  ఆన్‌లైన్ అప్లికేషన్ ముగుస్తుంది.
    • అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

  • Oct 11, 2025 11:30 AM IST

    AP TETలో స్కోర్‌కార్డ్ & సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

    • ముందుగా అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in సందర్శించండి
    • హోమ్ పేజీలో “ఫలితాల విభాగం” లో వెళ్ళండి.
    • ఆ తరువాత దరఖాస్తు ఐడి & పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
    • స్కోర్‌కార్డ్ & డిజిటల్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

  • Oct 11, 2025 11:00 AM IST

    AP TETలో అభ్యంతర విండో ఎంతకాలం ఉంటుంది?

    సాధారణంగా 3 నుండి 5 రోజులు ఉండే అవకాశం ఉంది .ఈ సమయంలో అభ్యర్థులు ప్రిలిమినరీ ఆన్సర్ కీలో తప్పులు లేదా సమస్యలు గుర్తించి అధికారులకు అభ్యంతరాలు సమర్పించవచ్చు.


     

  • Oct 11, 2025 10:30 AM IST

    AP TETలో 120+ మార్కులు సాధించడం ఎందుకు ముఖ్యం?

    AP TETలో 120+ మార్కులు సాధించడం AP DSC సెలక్షన్ లో గరిష్ట వెయిటేజీ (30 మార్కులు) పొందడానికి ముఖ్యంగా ఉంటుంది.

    అధిక స్కోరు → అధిక వెయిటేజీ → మెరుగైన మెరిట్ ర్యాంక్ → నియామక ఎంపికలో అడ్వాంటేజ్.

  • Oct 11, 2025 10:00 AM IST

    AP TET మార్కులు AP DSCలో వెయిటేజీ ఎలా లెక్కించబడతాయి?

    AP DSC ఉపాధ్యాయుల నియామకం లో AP TET స్కోరు వెయిటేజీ కింద ఉపయోగించబడుతుంది.

    AP TET మార్కులు

    DSC వెయిటేజీ

    60-90

    10 మార్కులు

    91-120

    20 మార్కులు

    121-150

    30 మార్కులు

    ఎక్కువ మార్కులు సాధించడం ద్వారా తుది మెరిట్ జాబితాలో అడ్వాంటేజ్ ఇస్తుంది.

  • Oct 11, 2025 09:30 AM IST

    AP TET 2025లో కొత్త సబ్జెక్టులు జోడించే అవకాశం ఉందా?

    అవును, విద్యాశాఖ పరిశీలనలో ఉంది. ఈసారి ప్రత్యేక విద్యా పత్రం లేదా భాషాపరమైన (Language-wise) మార్పులు జోడించే అవకాశం ఉందని సమాచారం. అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టత వస్తుంది.

  • Oct 11, 2025 09:00 AM IST

    AP TET పాస్ అయితే వెంటనే టీచర్ ఉద్యోగం వస్తుందా?

    లేదు . AP TET పాస్ కావడం కేవలం ఉపాధ్యాయ నియామకానికి అర్హత (eligibility) మాత్రమే. ఉద్యోగం పొందాలంటే తర్వాత DSC లేదా Teacher Recruitment Exam రాయాలి.

  • Oct 11, 2025 08:30 AM IST

    AP TET 2025 పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చా?

    పరీక్షా కేంద్రాలు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు వంటి నగరాల్లో ఉంటాయి. సాధారణంగా కేంద్రం మార్పు
    అనుమతించరు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే మార్పు చేసే అవకాశం ఉంటుంది.

  • Oct 11, 2025 08:00 AM IST

    AP TET ఫలితాలు & సర్టిఫికేట్ ఎలా పొందాలి?

    ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు aptet.apcfss.in వెబ్‌సైట్‌లోని స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే సైట్‌లో డిజిటల్ సర్టిఫికెట్ (TET Pass Certificate) కూడా అందుబాటులో ఉంటుంది.

  • Oct 11, 2025 07:30 AM IST

    AP TET గత సంవత్సరం ప్రశ్న పత్రాలు ఎక్కడ దొరుకుతాయి?

    గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో "Previous Papers" విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అభ్యర్థులకు పరీక్ష ప్యాటర్న్‌ను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తాయి.ఆలాగే కొన్ని ప్రైవేట్ పోర్టల్ లో PDF రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

  • Oct 11, 2025 07:00 AM IST

    AP TET 2025 పరీక్ష ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా?

    ఈసారి కూడా AP TET 2025 పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష - CBT) రూపంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.

  • Oct 11, 2025 06:30 AM IST

    AP TET ఫలితాలు 2025 ను సవాలు చేయవచ్చా?

    AP TET ఫలితాలు 2025 ను సవాలు చేయకపోవచ్చు, ఎందుకంటే ఫలితాలు తుది సమాధాన కీ ఆధారంగా తయారు చేయబడతాయి మరియు ఫలితాలు పాఠశాల విద్యా శాఖ అధిష్టానుసారం ఉంటాయి. అయితే, ఫలితాలను యాక్సెస్ చేయడంలో సంక్షోభం ఏర్పడితే లేదా ఫలితాలు ప్రదర్శించబడకపోతే లేదా డౌన్‌లోడ్ చేయలేకపోతే, అభ్యర్థులు అధికారులను ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

  • Oct 11, 2025 06:00 AM IST

    AP TET ఫలితాలు 2025, సర్టిఫికేషన్ చెల్లుబాటు

    AP TET ఫలితాలు 2025 ప్రకటించిన తర్వాత, విజయవంతమైన అభ్యర్థులకు జీవితాంతం చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లు జారీ చేయబడతాయి. అభ్యర్థులు వారు రాసిన పేపర్ల ప్రకారం ఉపాధ్యాయులుగా వివిధ పోస్టులకు నియమించబడతారు.

  • Oct 10, 2025 10:00 PM IST

    AP TET ఫలితాలు: అభ్యర్థి IDని ఎలా పునరుద్ధరించాలి?

    AP TET ఫలితాలు చేయడానికి, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో క్రియేట్ చేయబడిన వారి AP TET అభ్యర్థి ID అవసరమవుతుంది. అభ్యర్థి IDని మర్చిపోయిన వారు 'అభ్యర్థి IDని మర్చిపోయారా/తెలుసుకోండి/మునుపటి TET మార్కులు ' "Forgot/Know Candidate ID/Previous TET Marks" అనే ట్యాబ్ నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థి ID లేదా మునుపటి TET మార్కులను యాక్సెస్ చేయడానికి వారి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను అందించాలి.

  • Oct 10, 2025 09:30 PM IST

    AP TET ఫలితాలను ఎవరు చెక్ చేయవచ్చు?

    AP TET పరీక్షలకు పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మాత్రమే అధికారిక వెబ్‌సైట్ ద్వారా AP TET ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. పరీక్షలకు హాజరు కాని రిజిస్టర్డ్ అభ్యర్థులు లాగిన్ అవ్వలేరు లేదా ఫలితాలను యాక్సెస్ చేయలేరు.

  • Oct 10, 2025 08:30 PM IST

    AP TET ఫలితాలు 2025 చెక్ చేసుకునే విధానం

    • ముందుగా అభ్యర్థులు aptet.apcfss.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

    • AP TET ఫలితాల 2025ల లింక్‌పై క్లిక్ చేయాలి. 

    • ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థుల ID, పుట్టిన తేదీని నమోదు చేయాలి. 

  • Oct 10, 2025 08:00 PM IST

    AP TET ఫలితాలను ట్రాక్ చేయడానికి వెబ్‌సైట్‌లు

    AP TET ఫలితాలు అన్ని అభ్యర్థులకు రెండు పేపర్లకు సంబంధించిన ఆన్‌లైన్‌లో ఈ దిగువున తెలిపిన వెబ్‌సైట్‌లలో విడుదల చేయబడతాయి:

    • అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in
    • ఈనాడు
    • మనబడి
    • సాక్షి

  • Oct 10, 2025 07:30 PM IST

    AP TET ఫలితాలు 2025: SC/ST కేటగిరీ అర్హత మార్కులు

    AP TET 2025 ఫలితాల్లో క్వాలిఫై అవ్వడానికి SC, ST అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

  • Oct 10, 2025 07:00 PM IST

    AP TET ఫలితాలు 2025: BC కేటగిరీ అర్హత మార్కులు

    AP TET 2025లో అర్హత సాధించడానికి BC కేటగిరీకి చెందిన అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

  • Oct 10, 2025 06:30 PM IST

    AP TET ఫలితాలు 2025: జనరల్ కేటగిరీ అర్హత మార్కులు

    AP TET  2025 కోసం జనరల్ కేటగిరీ అభ్యర్థులు  150 కి 60% లేదా 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

  • Oct 10, 2025 06:00 PM IST

    నియామక ప్రక్రియలో AP TET 2025 స్కోర్‌లకు వెయిటేజీ

    నియామక సమయంలో జిల్లా ఎంపిక కమిటీ AP TET 2025 స్కోర్‌లలో 20 శాతం వెయిటేజీని కలిగి ఉంటుంది.  మిగిలిన 80 శాతం వెయిటేజీని టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT)కి ఇస్తారు. అయితే, ఎంపిక ప్రక్రియకు హాజరు కావడానికి అర్హత సాధించడానికి AP TET 2025 ప్రాథమిక దశ.

  • Oct 10, 2025 05:30 PM IST

    AP TET 2025 స్కోర్‌ల చెల్లుబాటు

    AP TET 2025 స్కోర్లు జీవితకాలం చెల్లుబాటు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం AP TET 2025 స్కోర్లు చెల్లుబాటవుతాయి. అభ్యర్థులు నియామకాల కోసం ఈ స్కోర్‌లను ఉపయోగించవచ్చు. అభ్యర్థులు తమ గ్రేడ్‌లను మెరుగుపరచుకోవాలనుకుంటే, వారు AP TET పరీక్షలకు హాజరు కావచ్చు.

  • Oct 10, 2025 05:00 PM IST

    AP TET 2025 సిలబస్

    AP TET 2025 అన్ని పేపర్లకు వేర్వేరు సిలబస్‌ ఉంటుంది. అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావడానికి సిలబస్ గురించి తెలుసుకోవాలి. ఇది దరఖాస్తుదారు పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి సహాయపడుతుంది.

  • Oct 10, 2025 04:30 PM IST

    AP TET 2025 దరఖాస్తు ఫీజు

    AP TET 2025 కోసం ఒక పేపర్‌కు దరఖాస్తు ఫీజు రూ. 500లు. కానీ ఒకటి కంటే ఎక్కువ పేపర్‌లకు, అభ్యర్థులు ప్రతి పేపర్‌కు అదనంగా రూ. 500/- చెల్లించాలి. ఎవరైనా అభ్యర్థులు రెండు పేపర్‌లకు దరఖాస్తు చేసుకుంటే, వారు రూ. 1000లు చెల్లించాలి. వారు మూడు పేపర్‌లకు దరఖాస్తు చేసుకుంటే వారు రూ.1500/- చెల్లించాలి. AP TET 2025 కోసం నాలుగు పేపర్‌లకు, అభ్యర్థులు రూ.2000లు చెల్లించాల్సి ఉంటుంది. 

  • Oct 10, 2025 04:00 PM IST

    AP TET 2025 కోసం సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడానికి స్పెసిఫికేషన్లు

    AP TET 2025 అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ ఫోటోలు, సంతకాలను అప్‌లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్ ఫోటో సైజు 3.5x3.5 సెం.మీ ఉండాలి. అభ్యర్థులు ఫోటోను తెల్లటి సాదా షీట్‌పై ఉంచాలి. ఫోటో కింద, నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్నుతో సంతకం చేయండి. ఫోటో స్కాన్ చేసి, 50kb కంటే ఎక్కువ లేని jpg ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి. ఫోటో మొత్తం సైజ్ 3.5 సెం.మీ x 4.5 సెం.మీ మాత్రమే ఉంటుంది.

  • Oct 10, 2025 03:30 PM IST

    AP TET 2025: పేపర్ 2 A సెక్షన్ 4 కోసం ప్రశ్నల విభజన

    AP TET 2025, సెక్షన్ 4, పేపర్ 2 A కోసం, అభ్యర్థులు గణితం & సైన్స్, సోషల్ స్టడీస్,  భాషలలో ఏదైనా ఒక సబ్జెక్టు నుంచి ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రశ్నల సంఖ్య ఇలా ఉంది:

    మ్యాథ్స్ & సైన్స్

    మ్యాథ్స్ - 30 ప్రశ్నలు (కంటెంట్ 24 MCQలు, బోధనా శాస్త్రం 6 MCQలు)

    సైన్సెస్- 30 ప్రశ్నలు [కంటెంట్ 24 (భౌతిక శాస్త్రం 12 MCQలు. కంటెంట్ –బయోలాజికల్ సైన్స్ 12 MCQలు), బోధనా శాస్త్రం 6 MCQలు]

    సోషల్ స్టడీస్

    60 ప్రశ్నలు (కంటెంట్ 48 MCQలు, బోధనా శాస్త్రం 12 MCQలు)

    లాంగ్వేజ్

    60 ప్రశ్నలు (కంటెంట్ 48 MCQలు, బోధనా శాస్త్రం 12 MCQలు)

  • Oct 10, 2025 03:00 PM IST

    AP TET 2025 కోసం లాంగ్వేజ్-Iని ఎలా ఎంచుకోవాలి? (పేపర్ 1 A & B, పేపర్ 2 A & B)

    AP TET 2025 దరఖాస్తుదారులకు లాంగ్వేజ్ -1 కోసం తమకు నచ్చిన భాషను ఎంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, ఒడియా సంస్కృతం నుంచి ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అయితే, షరతు ఏమిటంటే అభ్యర్థి విద్యా మాధ్యమంగా భాషను అభ్యసించి ఉండాలి లేదా కనీసం 10వ తరగతి వరకు ఉండాలి. ఈ షరతు రాష్ట్ర బోర్డు, CBSE లేదా ICSE బోర్డు నుండి దరఖాస్తుదారులకు వర్తిస్తుంది.

  • Oct 10, 2025 02:30 PM IST

    AP TET 2025: పేపర్ 2 B కోసం నిర్మాణం & నమూనా

    AP TET 2025 పేపర్ 2 B వివరణాత్మక నిర్మాణం, నమూనా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి:

    • 4 విభాగాల నుండి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.

    • పరీక్ష వ్యవధి 150 నిమిషాల పాటు అలాగే ఉంటుంది.

    • మొత్తం మార్కులు 150 మార్కులు.

    • చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి, లాంగ్వేజ్ I,  లాంగ్వేజ్ II (ఇంగ్లీష్) విభాగాల నుండి ఒక్కొక్కటి 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి.

    • వైకల్యం స్పెషలైజేషన్, బోధనా శాస్త్రం మొత్తం 60 మార్కులతో నాల్గవ విభాగంగా ఉంటుంది.

  • Oct 10, 2025 02:00 PM IST

    AP TET 2025: పేపర్ 2 A కోసం నిర్మాణం & నమూనా

    AP TET 2025 పేపర్ 2 A 6 నుంచి 8 తరగతులకు, నిర్దిష్ట సబ్జెక్టులకు నిర్మాణం, నమూనాను అనుసరించండి:

    • ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి.

    • అన్ని ప్రశ్నలు MCQ ఫార్మాట్‌లో ఉంటాయి.

    • మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి.

    • పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.

    • మొదటి మూడు విభాగాలు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోజీ, లాంగ్వేజ్ I, మరియు లాంగ్వేజ్ II (ఇంగ్లీష్) లలో ఒక్కొక్కటి 30 ప్రశ్నలు ఉంటాయి.

    • సెక్షన్ నాలుగోది మ్యాథ్స్ & సైన్స్ టీచర్లు/ సోషల్ స్టడీస్ టీచర్లు/ లాంగ్వేజ్ టీచర్లు (తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఒడియా, తమిళం, సంస్కృతం) సబ్జెక్టులకు 60 మార్కులను కలిగి ఉంటుంది. అభ్యర్థులు వారి ప్రాధాన్యతను బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

  • Oct 10, 2025 01:30 PM IST

    AP TET 2025: పేపర్ 1 B కోసం నిర్మాణం & నమూనా

    AP TET 2025 పేపర్ 1 Bని ఎంచుకునే అభ్యర్థులు ప్రశ్నపత్రం నమూనా, నిర్మాణం గురించి తెలుసుకోవాలి. వివరాలు ఇక్కడ ఉన్నాయి:

    • ప్రశ్నల సంఖ్య: 150 ప్రశ్నలు

    • మొత్తం మార్కులు: 150 మార్కులు

    • ప్రశ్న రకం: MCQలు

    • చేర్చబడిన అంశాలు: పిల్లల అభివృద్ధి, బోధన, లాంగ్వేజ్  I, లాంగ్వేజ్  II (ఇంగ్లీష్), మ్యాథ్స్, పర్యావరణ అధ్యయనాలు.

    • పరీక్ష వ్యవధి 150 నిమిషాలు (2 గంటల 30 నిమిషాలు).

  • Oct 10, 2025 01:00 PM IST

    AP TET 2025: పేపర్ 1 A కోసం నిర్మాణం & నమూనా

    1వ తరగతి నుంచి 5 తరగతి వరకు AP TET 2025 పేపర్ 1 A అనుసరించే నిర్మాణం, నమూనా ఇక్కడ అందించాం. 

    • అన్ని ప్రశ్నలు MCQగా ఉంటాయి.

    • మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.

    • AP TET 2025 పేపర్ 1 A లో ఉండే విభాగాలు చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగోగి, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్), మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్.

    • పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు లేదా 150 నిమిషాలు ఉంటుంది.

  • Oct 10, 2025 12:30 PM IST

    AP TET 2025 అప్లికేషన్ దిద్దుబాటు విండో

    AP TET 2025 నవంబర్ నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో ఏమైనా సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అప్లికేషన్ ఎడిటింగ్ విండో ఓపెన్ అవుతుంది. దాని ద్వారా అభ్యర్థులు దరఖాస్తులో తప్పులను సరిచేసుకోవచ్చు. 

  • Oct 10, 2025 12:00 PM IST

    AP TET 2025 అధికారిక వెబ్‌సైట్‌

    AP TET 2025 నవంబర్ అధికారిక నోటిఫికేషన్ https://aptet.apcfss.in/ లో విడుదలవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • Oct 10, 2025 11:30 AM IST

    AP TET 2025 అర్హత ప్రమాణాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, పేపర్ 1 A, పేపర్ 1 B, పేపర్ 2 A, పేపర్ 2 B లకు AP TET 2025 అర్హత ప్రమాణాలను నిర్దేశించింది. దరఖాస్తు చేసుకోవడానికి  అభ్యర్థులు ఈ అర్హత ప్రమాణాలను పాటించాలి. కనీస అర్హత 50 శాతం మార్కులతో 10+2, రెండేళ్ల డిప్లమా ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. 

  • Oct 10, 2025 11:00 AM IST

    AP TET 2025 ఉత్తీర్ణత మార్కులు ఎంత?

    AP TET 2025 ఉత్తీర్ణత మార్కులు వివిధ కేటగిరీలకు భిన్నంగా ఉంటాయి. ప్రతి కేటగిరీకి ఉత్తీర్ణత మార్కులు ఇక్కడ ఉన్నాయి:

    కేటగిరి

    ఉత్తీర్ణత మార్కులు

    జనరల్ కేటగిరీ

    60%

    BC

    50%

    ST/SC/PwD (మాజీ సైనికులు) కేటగిరి

    40%

  • Oct 10, 2025 10:16 AM IST

    AP TET 2025 పరీక్ష ఎప్పుడు?

    AP TET 2025 పరీక్ష నవంబర్ చివరి వారంలో జరగనుంది.  

  • Oct 10, 2025 10:14 AM IST

    AP TET నవంబర్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

     AP TET నవంబర్ 2025 నోటిఫికేషన్ వచ్చే వారంలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs