UCO బ్యాంక్‌లో 173 అధికారుల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
UCO బ్యాంక్ 2026-27 సంవత్సరానికి JMGS -I మరియు MMGS -II కేటగిరీలలో మొత్తం 173 జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2026లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
UCO బ్యాంక్ 173 పోస్టుల భారీ నోటిఫికేషన్ వివరాలు (UCO Bank 173 posts massive notification details):UCO బ్యాంక్ 2026-27 సంవత్సరానికి మొత్తం 173 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు JMGS-I & MMGS-II స్కేల్స్‌లో జరుగుతాయి. అర్హతగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో BE/B.Tech/CA/MBA/PG డిగ్రీతో పాటు అనుభవం అవసరం. వయోపరిమితి JMGS పోస్టులకు 20–30 ఏళ్లు, MMGS పోస్టులకు 22–35 ఏళ్లు గా నిర్ణయించారు. జీతం కూడా ఆకర్షణీయంగా ఉండి JMGS పోస్టులకు రూ.48,480–రూ.85,920 మరియు MMGS పోస్టులకు రూ.64,820–రూ.93,960 వరకు అందిస్తారు.
ఈ నియామక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 13, 2026 నుంచి ప్రారంభమయ్యాయి మరియు చివరి తేదీ ఫిబ్రవరి 2, 2026. దరఖాస్తు ఫీజు SC/ST/PwD అభ్యర్థులకు రూ.175, ఇతర కేటగిరీలకు రూ.800.
UCO బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (Online application procedure for UCO Bank Officer posts)
అభ్యర్థులు UCO బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ క్రింది విధముగా దరఖాస్తు చేయాలి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి రిక్రూట్‌మెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
- “UCO Bank Officers Recruitment 2026-27” లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా లాగిన్ అవ్వాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
UCO బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల వారీగా ఖాళీలు (UCO Bank Officer Post-wise Vacancies)
JMGS -I మరియు MMGS -II స్కేల్‌లలో మొత్తం 173 పోస్టుల విడుదలయ్యాయి.మొత్తం వివరాలు ఈ క్రింది టేబుల్ పట్టికలో చూడండి.
పోస్టు పేరు | స్కేల్ | ఖాళీలు |
ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ | JMGS -I | 30 |
చార్టర్డ్ అకౌంటెంట్ | JMGS -I | 50 |
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ | JMGS -I | 5 |
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ | JMGS -I | 3 |
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ | JMGS -I | 3 |
సాఫ్ట్‌వేర్ డెవలపర్ | JMGS -I | 15 |
మ్యూరెక్స్ డెవలపర్ | JMGS -I | 5 |
ఫినాకిల్ డెవలపర్ | JMGS -I | 5 |
క్లౌడ్ ఇంజనీర్ | JMGS -I | 3 |
AI/ML ఇంజనీర్ | JMGS -I | 2 |
డేటా అనలిస్ట్ | JMGS -I | 2 |
డేటా సైంటిస్ట్ | JMGS -I | 2 |
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ | JMGS -I | 3 |
డేటా ప్రైవసీ కంప్లయన్స్ ఆఫీసర్ | JMGS -I | 2 |
ట్రెజరీ ఆఫీసర్ | MMGS -II | 10 |
చార్టర్డ్ అకౌంటెంట్ | MMGS -II | 25 |
డేటా అనలిస్ట్ | MMGS -II | 3 |
డేటా సైంటిస్ట్ | MMGS -II | 3 |
డేటా ఇంజనీర్ | MMGS -II | 2 |
మొత్తం ఖాళీలు | —-- | 173 |
UCO బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించి చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.