AP POLYCET 2026 అప్లికేషన్ త్వరలో ప్రారంభం, నోటిఫికేషన్, తేదీలు, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి
AP POLYCET 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అప్లికేషన్ తేదీలు, గత సంవత్సరాల తేదీలు, AP POLYCET గురించి ముఖ్యమైన వివరాలు ఈ క్రింద ఉన్న ఆర్టికల్‌లో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. దీనివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా (ఇంజినీరింగ్ & నాన్‑ఇంజినీరింగ్) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 10వ తరగతి (SSC) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. తక్కువ ఫీజు లో టెక్నికల్ విద్య పొందాలనుకునే వారికి AP POLYCET మంచి అవకాశంగా ఉంటుంది. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలు, కోర్సులు కేటాయిస్తారు.
గత సంవత్సరాల ట్రెండ్ చూస్తే AP POLYCET నోటిఫికేషన్ సాధారణంగా మార్చి నెలలో విడుదలవుతుంది. అదే విధముగా AP POLYCET 2026 నోటిఫికేషన్ కూడా మార్చి 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చి వెంటనే అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్కడ అప్లికేషన్ తేదీలు, పరీక్ష తేదీ, అర్హతలు, ఫీజు వివరాలు స్పష్టంగా తెలియజేస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా చెక్ చేయడం మంచిది.
AP POLYCET 2026 ముఖ్యమైన తేదీలు (AP POLYCET 2026 Important Dates)
AP POLYCET 2026కు సంబంధించిన అప్లికేషన్, హాల్ టికెట్ మరియు పరీక్ష తేదీలను అర్థమయ్యేలా అంచనా తేదీలను ఈ క్రింది టేబుల్ పట్టికలో ఇవ్వడం జరిగింది.
వివరాలు | అంచనా తేదీలు |
AP POLYCET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | మార్చి 2026 మొదటి వారం |
రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ | ఏప్రిల్ చివరి వారం, 2026 |
అప్లికేషన్ దిద్దుబాటు విండో | మే మొదటి వారం, 2026 |
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | మే రెండవ వారం, 2026 |
AP POLYCET 2026 పరీక్ష | మే మూడవ వారం, 2026 |
AP POLYCET అప్లికేషన్‌లో తప్పులు జరిగితే ఏం చేయాలి? హాల్ టికెట్‌పై ప్రభావం ఉంటుందా? (What to do if there are errors in the AP POLYCET application? Will it affect the hall ticket?)
AP POLYCET అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు జరిగే తప్పులను సమయానికి సరిచేయకపోతే హాల్ టికెట్ మరియు పరీక్ష హాజరుపై ప్రభావం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం.
AP POLYCET అప్లికేషన్‌లో తప్పులు జరిగితే ఏం చేయాలి? (What to do if there are errors in the AP POLYCET application?)
పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోఉన్న Correction / Edit option ద్వారా సరిచేయాలి.
- అప్లికేషన్ చివరి తేదీ లోపలే మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యము.
- ఫోటో లేదా సంతకం తప్పుగా అప్లోడ్ అయితే సరైన ఫైల్‌తో మళ్లీ అప్డేట్ చేయాలి.
- మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ తప్పుగా ఉంటే నోటిఫికేషన్లు రాకపోవచ్చు, కనుక వెంటనే సరి చేయాలి.
- ఎడిట్ ఆప్షన్ అందుబాటులో లేకపోతే అధికారిక హెల్ప్‌డెస్క్ / సపోర్ట్ నంబర్‌ను సంప్రదించాలి.
ఈ తప్పుల వల్ల హాల్ టికెట్‌పై ప్రభావం ఉంటుందా? (Will these mistakes affect the hall ticket?)
అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాల ఆధారంగానే హాల్ టికెట్ జారీ అవుతుంది.
- పేరు, ఫోటో, పుట్టిన తేదీలో తప్పులు ఉంటే హాల్ టికెట్‌లో కూడా అదే తప్పు కనిపిస్తుంది.
- హాల్ టికెట్‌లో ఫోటో లేదా పేరు స్పష్టంగా లేకపోతే పరీక్ష కేంద్రంలో సమస్యలు రావచ్చు.
- పెద్ద తప్పులు ఉంటె కొన్ని సందర్భాల్లో పరీక్షకు అనుమతి నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే అన్ని వివరాలు జాగ్రత్తగా చెక్ చేయడం చాలా అవసరం.
AP POLYCET గత 3 సంవత్సరాల అప్లికేషన్ విడుదల తేదీలు (AP POLYCET Last 3 Years Application Release Dates)
గత సంవత్సరాల ట్రెండ్ ప్రకారం AP POLYCET అప్లికేషన్ ప్రక్రియ సాధారణంగా మార్చిలోనే ప్రారంభమవుతుంది.ఇది 2026 అభ్యర్థులకి ఒక స్పష్టమైన అంచనాను ఇస్తుంది.
సంవత్సరం | అప్లికేషన్ ప్రారంభ తేదీ | అప్లికేషన్ చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా ) |
AP POLYCET 2023 | ఫిబ్రవరి 16,2023 | ఏప్రిల్ 30,2023 |
2024 | ఫిబ్రవరి 20,2024 | ఏప్రిల్ 10,2024 |
2025 | మార్చి 12,2025 | ఏప్రిల్ 17,2025 |
AP POLYCET 2026 పరీక్ష తర్వాత జరిగే తదుపరి ప్రక్రియ (Next process after AP POLYCET 2026 exam)
AP POLYCET పరీక్ష పూర్తయ్యాక ఫలితాల నుంచి కాలేజీ అడ్మిషన్ వరకు అధికారులు ఒక క్రమబద్ధమైన ప్రక్రియను పాటిస్తారు.
- పరీక్ష పూర్తయిన తర్వాత ముందుగా రిస్పాన్స్ షీట్/ఆన్సర్ కీ విడుదల చేస్తారు.
- అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
- తర్వాత AP POLYCET ఫలితాలు (Results) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
- ఫలితంతో పాటుగా ప్రతి అభ్యర్థికి ర్యాంక్ కార్డు అందుబాటులో ఉంచుతారు.
- ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అవుతుంది.
- కౌన్సెలింగ్‌లో భాగంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయబడుతుంది.
- వెబ్ ఆప్షన్‌ల ద్వారా కాలేజీ మరియు కోర్సు ఎంపిక చేయాలి.
- ర్యాంక్, ఆప్షన్ల ఆధారంగా సీట్ ఆలాట్మెంట్ ప్రకటిస్తారు.
- సీట్ ఆలాట్ అయిన అభ్యర్థులు నిర్ణీత గడువులో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
- ఫీజు చెల్లించి అడ్మిషన్ పూర్తి చేసిన తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి.
AP POLYCET 2026 డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకి ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లికేషన్ జాగ్రత్తగా నింపి, పరీక్ష తర్వాత జరిగే ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తే అడ్మిషన్ పొందవచ్చు.