తెలంగాణలోని JEE మెయిన్ పరీక్షా కేంద్రాల జాబితా 2025 (List of JEE Main Exam Centres in Telangana 2025)
తెలంగాణలోని JEE మెయిన్ 2025 పరీక్షా కేంద్రాల పూర్తి జాబితాను (List of JEE Main Exam Centres in Telangana 2025) ఇక్కడ చూడండి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల్, కొత్తగూడెం మొదలైనవి ఉన్నాయి.
తెలంగాణ 2025లో JEE మెయిన్ పరీక్షా కేంద్రాల జాబితాలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం మొదలైనవి ఉన్నాయి . తెలంగాణ రాష్ట్రం నుంచి JEE మెయిన్ 2025కి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా JEE అడ్మిట్ కార్డును 2025 చెక్ చేసుకోవాలి. JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025, సిటీ స్లిప్‌ను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి JEE మెయిన్స్ కోసం రిజిస్టర్డ్ ఖాతాలకు లాగిన్ అవ్వాలి. JEE మెయిన్ 2025 సెషన్ 1 కోసం జనవరి 22 నుంచి 31, 2025 వరకు నిర్వహించబడుతోంది. దిగువ కథనంలో తెలంగాణలోని JEE మెయిన్ పరీక్షా కేంద్రాల పూర్తి జాబితాను చెక్ చేసుకోవాలి.
తెలంగాణలో JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు 2025 (JEE Main Exam Centres in Telangana 2025)
JEE మెయిన్ 2025 కోసం తెలంగాణలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ దిగువ టేబుల్లో తెలంగాణలోని JEE మెయిన్ 2025 పరీక్షా కేంద్రాల పూర్తి జాబితాను చెక్ చేయవచ్చు.
నగరం | కోడ్ |
కరీంనగర్ | TL02 |
ఖమ్మం | TL03 |
మహబూబ్ నగర్ | TL04 |
నల్గొండ | TL05 |
వరంగల్ | TL07 |
నిజామాబాద్ | TL08 |
సూర్యాపేట | TL09 |
సిద్దిపేట | TL11 |
జగిత్యాల | TL15 |
కొత్తగూడెం | TL17 |
హైదరాబాద్ | TL22 |
JEE మెయిన్ అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025 (JEE Main Advanced City Intimation Slip 2025)
JEE మెయిన్స్ సిటీ స్లిప్‌లో అభ్యర్థి JEE మెయిన్ 2025 పరీక్ష రాయాల్సిన పరీక్ష నగరం వివరాలు ఉంటాయి. JEE మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025ని యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని jeemain.nta.nic.in సందర్శించాలి.
- JEE మెయిన్ అడ్వాన్స్ సిటీ ఇన్టిమేషన్ స్లిప్ లింక్ 2025పై క్లిక్ చేయాలి.
- లాగిన్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి రిజిస్టర్డ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న భద్రతా పిన్‌ను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- JEE మెయిన్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- సిటీ ఇన్టిమేషన్ స్లిప్‌ని చెక్ చేసి, తర్వాత ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేసుకోవాలి.
JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 (JEE Main Admit Card 2025)
JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు మూడు రోజుల ముందు విడుదలవుతుంది. ఈ దిగువున ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి JEE మెయిన్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని jeemain.nta.nic.in సందర్శించాలి.
- JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి నమోదిత ఖాతాలకు లాగిన్ అవ్వాలి.
-
స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న సెక్యూరిటీ పిన్‌ని నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. - JEE మెయిన్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, తర్వాత ఉపయోగం కోసం సేవ్ చేసుకోవాలి.