AP DSC 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల, పరీక్ష తేదీ, దరఖాస్తు ఫారం, సిలబస్ పూర్తి వివరాలు

manohar

Published On:

AP DSC 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది . పరీక్ష తేదీ, అప్లికేషన్ ఫారం, అర్హతలు, సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో క్రింద చూడండి.

AP DSC 2026: Exam Date, Application Form, Syllabus

AP DSC అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో SGT, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, PET వంటి పోస్టుల భర్తీ జరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి కోరుకునేవారికి ఇది చాలా కీలక అవకాశం. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు, ఎందుకంటే ఇది స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగానికి దారితీసే ముఖ్య నియామక ప్రక్రియగా ఉపయోగపడుతుంది.

తాజా సమాచారం ప్రకారం AP DSC 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరాల ట్రెండ్స్ ను బట్టి చూస్తే, సాధారణంగా నోటిఫికేషన్ సంవత్సర ప్రారంభంలో లేదా మధ్యలో విడుదల అవుతుంది. అదే విధంగా, ఈసారి కూడా 2026 ప్రారంభం లేదా మొదటి అర్థభాగంలో నోటిఫికేషన్ వస్తుందని అంచనా. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్లికేషన్ ప్రక్రియ, పరీక్ష తేదీలు, సిలబస్ వంటి పూర్తి వివరాలు ప్రకటిస్తారు. కనుక అభ్యర్థులు ఇప్పుడే నుండే ప్రిపరేషన్ మొదలుపెట్టి, సిలబస్ ప్రకారం చదవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది.

AP DSC 2026 అప్లికేషన్ ఫారం పూర్తి వివరాలు (AP DSC 2026 Application Form Full Details)

AP DSC 2026 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ పూర్తి ప్రక్రియే అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్వహించబడుతుంది.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక AP DSC వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • కొత్త అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయాలి
  • వ్యక్తిగత వివరాలు (పేరు, పుట్టిన తేది, చిరునామా) నమోదు చేయాలి
  • విద్యార్హతల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి
  • సంబంధిత పోస్టును ఎంచుకోవాలి
  • ఫోటో, సంతకం మరియు అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి
  • అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి
  • ఫారం సబ్మిట్ చేసిన తర్వాత దాని ప్రింట్ తీసుకోవాలి

AP DSC 2026 అర్హతలు వివరాలు (AP DSC 2026 Eligibility Details)

AP DSC 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి అవసరమైన విద్యార్హతలు మరియు వయో పరిమితి ఈ క్రింది నిబంధనలు పాటించాలి.

పోస్ట్ వారీ అర్హతలు (Post-wise qualifications)

SGT (సెకండరీ గ్రేడ్ టీచర్)

  • D.El.Ed లేదా సమానమైన టీచర్ ట్రైనింగ్ అర్హత ఉండాలి

స్కూల్ అసిస్టెంట్ (School Assistant)

  • సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  • తప్పనిసరిగా B.Ed అర్హత కలిగి ఉండాలి

భాషా పండిట్ (Language Pandit)

  • సంబంధిత భాషలో డిగ్రీ ఉండాలి
  • B.Ed లేదా పండిట్ ట్రైనింగ్ అవసరం

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)

  • ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ -
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గుర్తింపు పొందిన అర్హత ఉండాలి

వయోపరిమితి మరియు ఇతర నిబంధనలు (Age limit and other regulations):

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు: ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది.
  • SC / ST / BC / PwBD అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది
  • అర్హతలు మరియు రిజర్వేషన్ నిబంధనలు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అమలు చేస్తారు

గమనిక: అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే ముందు, తమకు సంబంధించిన పోస్టుకు అర్హత ఉందో లేదో ఖచ్చితంగా పరిశీలించండి.

AP DSC 2026 పరీక్ష తేదీ (AP DSC 2026 Exam Date)

ప్రస్తుతం AP DSC 2026 పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల అవ్వలేదు. అయితే గత సంవత్సరాల ట్రెండ్స్ ను బట్టి చూస్తే , నోటిఫికేషన్ విడుదలైన తరువాత సుమారు 2 నుంచి 3 నెలలలో పరీక్ష నిర్వహించబడే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష సాధారణంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహిస్తారు. అందుకే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు కాకుండా, ఇప్పటి నుంచే సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది. అధికారిక పరీక్ష తేదీ, షెడ్యూల్ మరియు హాల్ టికెట్ వివరాలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

AP DSC 2026 సిలబస్ వివరాలు (AP DSC 2026 Syllabus Details)

AP DSC 2026 సిలబస్ పోస్టును బట్టి కొంత మారినప్పటికీ , కానీ ప్రధానంగా బోధనా నైపుణ్యాలు మరియు సంబంధిత సబ్జెక్ట్ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.

  • జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్
  • చైల్డ్ సైకాలజీ & బాలల అభివృద్ధి
  • టీచింగ్ మెథడాలజీ
  • సంబంధిత సబ్జెక్ట్ పరిజ్ఞానం (పోస్ట్‌ను బట్టి)
  • తెలుగు భాషా నైపుణ్యాలు
  • ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు
  • ఎడ్యుకేషన్ & విద్యా విధానాలు
  • తరగతి నిర్వహణ (Classroom Management)

AP DSC 2026 ఎంపిక విధానం (AP DSC 2026 Selection Process)

AP DSC 2026లో అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా వ్రాత పరీక్షలో సాధించిన మార్కులు మరియు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ఆధారంగా జరుగుతుంది.

  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష (CBT) నిర్వహిస్తారు
  • వ్రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
  • కొన్ని పోస్టులకు TET వెయిటేజ్ వర్తించవచ్చు
  • కేటగిరీ మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు
  • మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు
  • పత్రాల ధృవీకరణ (Certificate Verification) జరుగుతుంది
  • తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు

AP DSC 2026 ఉపాధ్యాయుల కోసం మంచి అవకాశంగా ఉంటుంది. నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నందున , అభ్యర్థులు ఇప్పుడే సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ మొదలు పెట్టితే మంచిది. సరైన ప్రణాళికతో మరియు క్రమంగా చదివితే ఈ పరీక్షలో విజయాన్ని సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరమైన భవిష్యత్తు పొందవచ్చు.

/articles/ap-dsc-2026-exam-date-application-form-syllabus/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

Recent Related News

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top