AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 పరీక్షకు విద్యార్థుల కోసం ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నల జాబితాను ఈ ఆర్టికల్ లో చూడండి. ఈ ప్రశ్నలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టాలో తెలుసుకుని విద్యార్థులు ముందుగానే సిద్ధం కావడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది.

AP ఇంటర్ 1వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో మీరు చాలా మంది విద్యార్థులు “ఏం చదవాలి?” “ఎలాంటి ప్రశ్నలు ముఖ్యమైనవి?” అని ఆలోచిస్తున్నారని మాకు తెలుసు. ముఖ్యంగా కెమిస్ట్రీ (Chemistry ) లో 8 మార్కుల ప్రశ్నలు మీ మొత్తం స్కోర్‌పై నిర్ణయించే కీలక భాగం. అందుకే, మొదట ఈ క్రింద ఇచ్చిన కీలక ప్రశ్నల జాబితాను చూడండి. వాటిలోని కాన్సెప్ట్‌లు బాగా అర్థం చేసుకోండి. కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం కాకుండా, ప్రతి ప్రశ్న వెనుక ఉన్న థియరీ, సూత్రాలు, ఉదాహరణలు తెలుసుకుని ఆలోచిస్తే మాత్రమే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రోజూ కొంత సమయం కేటాయించి ఈ 8 మార్కుల ప్రశ్నలను పరీక్షలో రాస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేయండి. అణు నిర్మాణం, కెమికల్ బాండింగ్, రెడాక్స్ వంటి ముఖ్యమైన చాప్టర్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఇలానే ప్లాన్ చేసుకుని , క్రమంగా సిద్ధం అయితే పరీక్షరోజు టెన్షన్ లేకుండా ధైర్యంగా పేపర్ ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధిస్తారు.
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 : ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నలు (AP Inter 1st Year Chemistry 2026: Important 8 Marks Questions)
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 పరీక్షలో ఎక్కువగా వచ్చే అవకాశము ఉన్న కీలక 8 మార్కుల ప్రశ్నల జాబితా విద్యార్థుల కోసం ఈ క్రింద టేబుల్ పట్టికలో ఇవ్వడం జరిగింది.
క్రమ సంఖ్య | 8 మార్కుల ముఖ్యమైన ప్రశ్నలు |
|---|---|
1 | బోర్ పరమాణు సిద్ధాంతములోని ముఖ్యాంశాలను వ్రాయండి. హైడ్రోజన్ వర్ణపట రేఖల శ్రేణుల విభజనను ఈ సిద్ధాంతము ఎలా వివరించినదో చర్చించుము. |
2 | బెంజిన్ ను తయారు చేయు రెండు పద్ధతులను వివరింపుము. బెంజిన్ యొక్క 'హాలోజనేషన్' మరియు 'ఆల్కైలేషన్' చర్యలను వివరింపుము. |
3 | IE1, IE2 లను నిర్వచించండి. ఏదైనా పరమాణువుకు IE2>IE1 గా ఎందుకు ఉంటుంది? ఒక మూలకపు IE ని ప్రభావితం చేసే అంశాలను చర్చించండి. |
4 | ఎసిటిలీన్ తయారు చేయడానికి రెండు పద్ధతులను తెలపండి. ఎసిటిలీన్ నీటితో, ఓజోన్ తో జరుపు చర్యలు రాయండి. |
5 | S,p,s,f బ్లాక్ మూలకాలపై వ్యాసాన్ని రాయండి |
6 | ఆవర్తన ధర్మం అనగా నేమి ? క్రింది ధర్మాలు గ్రూపులోను, మరియు పీరియడ్ లోను ఏ విధంగా మారను? వివరింపుము (a) అయనీకరణ శక్మము (b) ఋణ విద్యుదాత్మకత (c) లోహ స్వభావము |
7 | (a) SF అణువు ఏర్పడటంలో సంకరీకరణంను వివరించండి. (b) ఫాజన్ నియమాలు వ్రాసి, సరి అయిన ఉదాహరణలు ఇవ్వండి. |
8 | ఎటలీన్ నుండి బెంజీన్ తయారీని నమీకరణంతో రాయండి. బెంజీన్ యొక్క ఫ్రీడల్-- క్రాఫ్ట్ ఆల్కైలీకరణం, ఫ్రీడల్-క్రాఫ్ట్ ఎసైలీకరణం మరియు నల్ఫోనేషన్ చర్యలను వివరించండి. |
AP ఇంటర్ కెమిస్ట్రీ 8 మార్కుల ప్రశ్నలపై విద్యార్థులలో పెరుగుతున్న ఆసక్తి ? (Is there a growing interest among students in AP Inter Chemistry 8 marks questions?)
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 8 మార్కుల ముఖ్య ప్రశ్నల జాబితా చూసిన తరువాత చాలా మంది విద్యార్థుల మనసులో సహజమైన కొన్ని సందేహాలు వస్తాయి. “ఈ ప్రశ్నలే నిజంగా పరీక్షలో వస్తాయా?”, “గత సంవత్సరాల పేపర్లలో కూడా ఇవే ఉన్నాయా?”, “ప్రతి ప్రశ్నను ఎంత లోతుగా సిద్ధం కావాలి?”, “డయాగ్రామ్‌లు తప్పనిసరిగా ప్రయత్నించాలా?”, “ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది?” వంటి సందేహాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొంత మంది విద్యార్థులు , “కేవలం ఈ ప్రశ్నలు చదివితే సరిపోతుందా లేక మొత్తం సిలబస్ చదవాలా?” అని కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా పరీక్ష సమయం దగ్గరపడుతున్న కొద్దీ , ఏ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ చేస్తే పూర్తి మార్కులు వచ్చేలా తయారవుతా అనుకునే ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల ఈ తరహా ముఖ్య ప్రశ్నల జాబితా విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండటంతో పాటు, వారి ప్రిపరేషన్‌ను సరైన దిశలో తీసుకువెళ్లే కీలక సహాయం అవుతుంది.
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 2026: విద్యార్థులకు ముఖ్య సూచనలు (AP Inter 1st Year Chemistry 2026: Important Instructions for Students)
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీ 2026 విద్యార్థులకు 8 మార్కుల ప్రశ్నలకు పూర్తి మార్కులు పొందాలంటే ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి.
- ప్రతి ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్నను కనీసం 2–3 సార్లు చదివి బాగా అర్థం చేసుకోండి.
- కేవలం జ్ఞాపకం పెట్టుకోవడం కాకుండా, కాన్సెప్ట్స్ ను క్లియర్‌గా తెలుసుకోండి.
- సమాధానాలను పాయింట్స్ రూపంలో రాయడం ప్రాక్టీస్ చేయండి.
- అవసరమైన చోట డయాగ్రామ్‌లు స్పష్టంగా గీయండి.
- సూత్రాలు మరియు నిర్వచనలను పాఠ్యపుస్తక ప్రకారం ఖచ్చితంగా గుర్తుంచుకోండి.
- గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను తప్పకుండా ప్రాక్టీస్ చేయండి.
- రోజూ కనీసం 2 దీర్ఘ ప్రశ్నలు రాసి చూసే అలవాటు చేసుకోండి.
- సమీకరణాలను సరిగ్గా బ్యాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి.
- ముఖ్యమైన చాప్టర్లపై ఎక్కువ దృష్టి పెట్టండి.
- పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపండి.
AP ఇంటర్ 1వ సంవత్సరం కెమిస్ట్రీలో 8 మార్కుల ప్రశ్నలు మంచి స్కోరుకు చాల ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన ప్రశ్నలను ముందుగానే సిద్ధం చేసుకుని, రోజూ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో మీరు ధైర్యంగా రాయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని, రెగ్యులర్ గా చదివితే మంచి ఫలితాలు మీవే.














సిమిలర్ ఆర్టికల్స్
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
వాట్సాప్ ద్వారా AP ఇంటర్ హాల్ టికెట్ 2026ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
విద్యార్థుల కోసం తెలుగులో ఫేర్వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu)
AP SSC కాంపోజిట్ తెలుగు ఛాప్టర్ వైజ్ వెయిటేజీ మార్కులు 2026, బ్లూప్రింట్
మహిళా దినోత్సవం చరిత్ర, గొప్పతనంపై ఆర్టికల్ (women's day speech in telugu)
హోలీ పండుగ ప్రాముఖ్యత వివరాలు