త్వరలో AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Rudra Veni

Published On:

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు 2026 త్వరలో విడుదలకానున్నాయి. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక BIEAP వెబ్‌సైట్ నుంచి  AP ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం హాల్ టికెట్ల 2026ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
త్వరలో AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు AP ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు 2026 జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో రిలీజ్ కానున్నాయి. హాల్ టికెట్లు విడుదలైన తర్వాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక BIEAP వెబ్‌సైట్ నుంచి AP ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం హాల్ టికెట్ల 2026ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) అధికారికంగా AP ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 2026 ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10, 2026 వరకు ప్రతిరోజూ రెండు సెషన్‌లలో జరగనున్నాయి. ఉదయం సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు , మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది.

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ముఖ్యాంశాలు 2026 (AP Intermediate Hall Ticket Highlights 2026)

ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2026కి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను దిగువున ఇవ్వబడిన పట్టిక హైలైట్ చేస్తుంది.

విద్యా మండలి

ఇంటర్మీడియట్ విద్యా మండలి, ఆంధ్రప్రదేశ్ (BIE AP)

సంవత్సరం

2026

తరగతి పేరు

ఇంటర్మీడియట్/ 12వ తరగతి

AP ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష తేదీ 2026

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు

అధికారిక వెబ్‌సైట్

bie.ap.gov.in

ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2026 AP తేదీ & లింక్ 2026 (Intermediate Hall Ticket Download 2026 AP Date & Link 2026)

హాల్ టికెట్ విడుదలైన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2026 AP లింక్ అప్‌డేట్ చేయబడుతుంది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లతో ఏవైనా సమస్యలు లేదా వ్యత్యాసాలు ఎదుర్కొంటున్నట్లయితే BIEAP హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. లింక్ అధికారిక వెబ్‌సైట్ ప్రధాన పేజీకి రీ డైరక్ట్ అవుతుంది. అక్కడ వారు ఇంటర్ మొదటి సంవత్సరం హాల్ టికెట్ 2026, 2వ సంవత్సరం డౌన్‌లోడ్ ఆప్షన్‌ను కనుగొనవచ్చు.

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ లింక్ (అప్‌డేట్ చేయబడుతుంది)

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 ముఖ్యమైన తేదీలు (AP Intermediate Hall Ticket 2026 Important Dates)

ఈ దిగువున ఇవ్వబడిన టేబుల్లో AP ఇంటర్ మొదటి సంవత్సరం హాల్ టికెట్ 2026, రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి రాబోయే అన్ని ముఖ్యమైన ఈవెంట్‌లు, తేదీలు ఉన్నాయి:

వివరాలు

తేదీలు

AP హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2026 ఇంటర్మీడియట్ తేదీ

ఫిబ్రవరి 2026

AP ఇంటర్ 2వ సంవత్సరం హాల్ టికెట్ 2026 విడుదల తేదీ

ఫిబ్రవరి 2026

AP ఇంటర్ మొదటి సంవత్సరం థియరీ పరీక్ష 2026

ఫిబ్రవరి 23 నుండి మార్చి 24, 2026 వరకు

AP ఇంటర్ మొదటి సంవత్సరం ప్రాక్టికల్ పరీక్ష 2026

ఫిబ్రవరి 01 నుండి ఫిబ్రవరి 10, 2026 వరకు

AP ఇంటర్ సెకండ్ ఇయర్ థియరీ పరీక్ష 2026

ఫిబ్రవరి 23 నుండి మార్చి 24, 2026 వరకు

AP ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్ష 2026

ఫిబ్రవరి 01 నుండి ఫిబ్రవరి 10, 2026 వరకు

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download AP Intermediate Hall Ticket 2026?)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE AP) నిర్దేశించిన నిబంధనల ప్రకారం AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ మొదట పాఠశాల అధికారులకు పంపిణీ చేయబడుతుంది. ఆ తర్వాత అధికారులు హాల్ టికెట్ హార్డ్ కాపీని పాఠశాలలోని విద్యార్థులకు పంపిణీ చేస్తారు. AP బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలు, కాలేజీలు అధికారిక వెబ్‌సైట్ నుంచి 2026 ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కోసం ఈ దిగువున ఇచ్చిన స్టెప్స్‌ని అనుసరించాలి.

  • స్టెప్ 1: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in/Index.doని సందర్శించాలి.

  • స్టెప్ 2: ముఖ్యమైన నోటిఫికేషన్‌లు హోంపేజీలో పైన ప్రదర్శించబడతాయి.

  • స్టెప్ 3: డౌన్‌లోడ్ IPE హాల్ టికెట్లు మార్చి 2026 పై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 4: కొత్త పేజీలో, పాఠశాల అధికారులు వారి ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 5: ఇప్పుడు, 2026 ఏప్రిల్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం ఇంటర్ హాల్ టికెట్లను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు ప్రింట్ తీసుకోవాలి.

2026 ప్రాక్టికల్ పరీక్ష కోసం AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download the AP Intermediate Hall Ticket For Practical Exam 2026?)

ప్రాక్టికల్ పరీక్ష కోసం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్ హాల్ టికెట్ 2026లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశలవారీ విధానాన్ని ఈ దిగువున అందించాం.

  • స్టెప్ 1: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in/Index.do కి వెళ్లండి.

  • స్టెప్ 2: ఈ స్క్రీన్‌లో హోంపేజీ తెరుచుకుంటుంది. పేజీ పైకి స్క్రోల్ చేయండి.

  • స్టెప్ 3: డౌన్‌లోడ్ IPE జనరల్ ప్రాక్టికల్ హాల్ టికెట్లు మార్చి 2026 పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 4: ఆధారాలను నమోదు చేయండి.

  • స్టెప్ 5: అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది తదనుగుణంగా విద్యార్థులకు పంపిణీ చేయబడుతుంది.

వాట్సాప్ ద్వారా AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download AP Intermediate Hall Ticket 2026 via WhatsApp)

ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, BIEAP ఇప్పుడు విద్యార్థులు తమ AP ఇంటర్ 1వ , 2వ సంవత్సరం హాల్ టికెట్లను 2026 వాట్సాప్ ద్వారా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. మీ bieap.gov.in హాల్ టికెట్ 2026 ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి:

  • మీ మొబైల్‌లో అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను సేవ్ చేసుకోవాలి.

  • ఈ నెంబర్‌కు “Hi” అని మెసెజ్ పంపాలి.

  • అందించిన ఆప్షన్ల నుంచి 'సేవలు' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

  • 'హాల్ టికెట్ డౌన్‌లోడ్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • లాగిన్ అప్లికేషన్‌ను తెరవడానికి “ఇంటర్మీడియట్ పరీక్షలు” కేటగిరిని ఎంచుకోవాలి.

  • మీ AP ఇంటర్ హాల్ టికెట్ 2026 ని యాక్సెస్ చేయడానికి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

  • హాల్ టికెట్ కలర్ కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసి పరీక్ష రోజుల కోసం భద్రంగా ఉంచుకోవాలి.

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 లో పేర్కొన్న వివరాలు (Details Mentioned in AP Intermediate Hall Ticket 2026)

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 ప్రతి విద్యార్థికి వారి సంబంధిత పాఠశాలలు , కళాశాలలు అందజేస్తాయి. హాల్ టికెట్ విద్యార్థుల గుర్తింపును ప్రతిబింబిస్తుంది. దీనిలో పేరు, పుట్టిన తేదీ , పరీక్షకు సంబంధించిన సమాచారం ఉంటుంది. హాల్ టికెట్‌లో పేర్కొన్న వివరాలను తనిఖీ చేయడం విద్యార్థుల బాధ్యత. AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026లో పేర్కొన్న వివరాల జాబితా కింది విధంగా ఉంది.

  • విద్యార్థి పేరు

  • విద్యార్థుల రోల్ నెంబర్

  • బోర్డు పేరు

  • పరీక్ష పేరు

  • పరీక్షా కేంద్రం వివరాలు

  • పరీక్షా కేంద్రం కోడ్

  • డేట్ షీట్

  • రిపోర్టింగ్ సమయం

  • విద్యార్థి ఫోటో

  • విద్యార్థి సంతకం

  • ముఖ్యమైన సూచనలు

/articles/ap-intermediate-2026-hall-ticket-for-1st-and-2nd-year-exams-and-results-2026-pdf-download/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Recent Related News

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top