APPSC Post-wise Vacancies: ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వారీగా ఉన్న ఖాళీలు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Updated On: January 10, 2024 01:40 PM

ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వారీగా (APPSC Post-wise Vacancies) ఉన్న ఖాళీల వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. ఆసక్తి  ఉన్న అభ్యర్థులు పోస్టులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. 
logo
APPSC Post-wise Vacancies: ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల వారీగా ఉన్న ఖాళీలు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

ఏపీపీఎస్సీ పోస్ట్ వైజ్ ఖాళీలు (APPSC Post-wise Vacancies): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023న ఉత్తర్వులు జారీ చేసినది. ఈ ఉత్తర్వుల ప్రకారం APPSC గ్రూప్ 1లో 89 పోస్టులకు, గ్రూప్ 2లో 508 పోస్టుల  (APPSC Post-wise Vacancies) భర్తీ చేయనున్నారు. ఈ గ్రూప్ 1 , గ్రూప్ 2 పరీక్షలను APPSC నిర్వహించనుంది.  పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఇది కూడా చదవండి: APPSC గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?

APPSC గ్రూప్ 1, 2 హైలెట్స్ (APPSC Group 1, 2 2023 Exam-Highlights)

APPSC గ్రూప్ 1, 2 రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా 597 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. APPSC గ్రూప్ పరీక్షలకు సంబంధించిన  2023 వివరాలు దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది.
కండక్టింగ్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఎగ్జామ్ పేరు APPSC గ్రూప్ 1, 2  ఎగ్జామ్
ఎగ్జామ్ లెవల్ రాష్ట్రస్థాయి (ఆంధ్రప్రదేశ్)
ఖాళీలు గ్రూప్  1-89, గ్రూప్ -2 - 508   (అంచనా)
ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ సంవత్సరానికి ఒకసారి
కేటగిరి ప్రభుత్వ ఉద్యోగాలు
ఎగ్జామ్ స్టేజ్‌లు మూడు (ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ఫ్రొఫిషియన్సీ టెస్ట్)
భాషలు ఇంగ్లీష్, తెలుగు
జాబ్ లోకేషన్ ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఖాళీల వివరాలు 2023 (APPSC Group 2 Vacancy 2023)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల వివరాలను అంచనాగా ఈ దిగువున టేబుల్లో అందజేశాం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.
డిపార్ట్‌మెంట్ పేరు హెచ్‌వోడీ పోస్టుల పేరు సంఖ్య
ఫైనాన్స్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23
జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) 161
లా సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) 12
లెజిస్లేటర్  సెక్రటేరియట్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేటర్) 10
ఎంఏ, యూడీ కమిషనర్, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరక్టర్ మున్సిపల్ కమిషన్ (జీఆర్ 111) 04
రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్  చీఫ్ కమిషనర్
ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్
ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్
డిప్యూటీ తహసీల్దార్ (జీఆర్ 11)
సబ్ రిజిస్ట్రార్ జీ II
ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
114
16
16
ఎల్ఎఫ్‌బీ, ఐఎంఎస్ ఎల్ఎఫ్‌బీ అండ్ ఐఎమ్ ఎస్ లేబర్ కమిషనర్ అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ 18
మొత్తం ఖాళీలు 508

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 పోస్టుల వారీగా ఖాళీలు (APPSC Group 1 Vacancies 2023 Posts Wise Vacancies)

Add CollegeDekho as a Trusted Source

google

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 89 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన వివరాలను అంచనా ఈ దిగువ పట్టికలో అందజేయడం జరిగింది.
క్రమ సంఖ్య శాఖ పోస్ట్ ఖాళీల సంఖ్య
1 A & C కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ 05
2 బీసీ సంక్షేమం జిల్లా A.P. B. C లో B.C. సంక్షేమ అధికారి 01
3 ఎడీ అండ్ టీ జిల్లా ఉపాధి అధికారి 04
4 ఆర్థిక శాఖ A.P స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
అసి. ట్రెజరీ అధికారి/అసిస్ట్. A.P. ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అకౌంట్స్ ఆఫీసర్
02
06
5 హోమ్ ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సప్‌డిట్ ఆఫ్ పోలీస్ (సివిల్) క్యాట్-2
ఏపీ జైల్ సర్వీస్‌లో డిప్యూటీ సూప్డ్ ఆఫ్ జైల్స్ (MEN)
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల్లో డివిజనల్/జిల్లా అగ్నిమాపక అధికారులు
25
01
01
6 ఎంఏ, యూడీ A.P. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II 01
7 రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లు
డిప్యూటీ రిజిస్ట్రార్
ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్‌లో స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
12
03
18
01
8 సోషల్ వెల్ఫేర్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 03
9 టీఆర్ అండ్ బీ ప్రాంతీయ రవాణ అధికారి 06


ఏపీపీఎస్సీ గ్రూప్ పోస్టులకు సెలక్షన్ విధానం (APPSC Group Selection Process 2023)

ఏపీపీఎస్సీ గ్రూప్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది.
  • ప్రిలిమినరీ ఎగ్జామ్
  • మెయిన్స్ ఎగ్జామ్
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి దశలు (Steps to Apply for APPSC Group 2 Recruitment 2023)

  • APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులు  APPSC అధికారిక వెబ్‌సైట్‌ను https://psc.ap.gov.inని సందర్శించాలి.
  • హోంపేజీలో “డైరెక్ట్ రిక్రూట్‌మెంట్” “కొత్త నోటిఫికేషన్” లింక్‌పై క్లిక్ చేయాలి.
  • "కొత్త రిజిస్ట్రేషన్"పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఇచ్చి పూరించాలి.
  • రిజిస్ట్రేషన్ పేజీలోని వివరాలలో ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీలని ఇచ్చిన ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, విద్యార్హత వివరాలు మొదలైనవి ఉంటాయి.
  • పేర్కొన్న ఫార్మాట్‌లో ఫోటోగ్రాఫ్ (JPG/JPEG ఫార్మాట్, 50 kb, 3.5 cm x 4.5 cm) మరియు సంతకాన్ని (JPG/JPEG ఫార్మాట్, 30 kb, 3.5 cm x 1.5 cm) అప్‌లోడ్ చేయాలి.

అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టెప్ 2 (Step 2- Submit Application Form)

  • అభ్యర్థి క్రియేట్ చేసిన ID,  పాస్‌వర్డ్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి
  • తర్వాత అభ్యర్థి అప్లికేషన్ Submitపై క్లిక్ చేసి, అధికారిక ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి మిగిలిన వివరాలను జాగ్రత్తగా పూరించాలి.
  • దీని తర్వాత అభ్యర్థి అవసరమైన దరఖాస్తు ఫీజును చెల్లించాలి. నిర్ధారణ తర్వాత సమర్పించుపై క్లిక్ చేయాలి.
  • APPSC గ్రూప్ 2 దరఖాస్తు ఫార్మ్ విజయవంతంగా సబ్మిట్ చేసి భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్‌ని  డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ సమాచారం గురించి మరిన్ని అప్‌డేట్స్ గురించి College Dekhoని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/appsc-post-wise-vacancies/
View All Questions

Related Questions

About admission of BBA : When the BBA admission' s start..????

-AdminUpdated on December 22, 2025 01:13 AM
  • 124 Answers
Anmol Sharma, Student / Alumni

For the most accurate and current admission schedules, phases, and deadlines, always consult Lovely Professional University’s official portal. Applicants should rely exclusively on the university's website to ensure they receive reliable, up-to-date information regarding the 2026 intake and specific program requirements.

READ MORE...

Distance Centre : Is there any Study Centre in Haryana State

-SEKHARUpdated on December 22, 2025 01:14 AM
  • 44 Answers
Anmol Sharma, Student / Alumni

LPU facilitates distance learning through its LPU e-Connect platform, allowing students in Haryana to enroll and attend classes remotely. This technology-driven approach provides flexible access to study materials and online mentorship, eliminating the need for physical study centers while ensuring a high-quality, supportive, and accessible academic experience for all learners.

READ MORE...

Is LPUNEST compulsory for B.Tech? Can I get direct admission?

-AshwiniUpdated on December 22, 2025 01:13 AM
  • 44 Answers
Anmol Sharma, Student / Alumni

LPUNEST is generally compulsory for B.Tech admission at LPU as it serves as the primary eligibility and scholarship test. however, you can gain direct admission without appearing for LPUNEST if you have a valid JEE Main score (typically 80 percentile or above) or a qualifying CUET score.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy