ఫ్రెండ్‌షిప్ డే, ఓ చిన్న బంధం, గొప్ప అనుబంధం

manohar

Updated On: August 01, 2025 12:07 PM

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్నేహితుల మధ్య బంధం ఎంత ముఖ్యమో ఈ వ్యాసంలో వివరించాం. విద్యార్థులకు స్నేహం ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చెప్పడం ఈ వ్యాస లక్ష్యం.ఈ వ్యాసం విద్యార్థుల్లో స్నేహం పట్ల గౌరవం పెంపొందించేందుకు స్పష్టంగా CollegeDekho ఇక్కడ అందిస్తుంది.

ఫ్రెండ్‌షిప్ డే, ఓ చిన్న బంధం, గొప్ప అనుబంధం(Friendship Day, a small bond, a great connection)

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డేను జరుపుకుంటారు. ఈ రోజు మన జీవితంలో భాగమైన స్నేహితులను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భం.స్నేహితుడు అనేది జీవిత పాఠాన్ని నేర్పే ఓ పుస్తకం లాంటివాడు. ప్రతి రోజూ అతడి నుంచి మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. సంతోషంగా ఉండాలంటే స్నేహితుల ప్రేమ కావాలి. మంచి స్నేహం మన మనసును మారుస్తుంది, మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

స్నేహం అంటే ఏమిటి?  ఒక చిరునవ్వుతో కలిసే బంధం(What is friendship? A bond that connects with a smile)

స్నేహం అనే పదం మనలో ఎంతో ప్రత్యేకమైన భావాలను కలిగిస్తుంది. ఇది ఒక చిన్న పదం అయినా, దానిలో దాగి ఉన్న భావోద్వేగాలు అపారమైనవి. స్నేహం అనేది శరీరానికి ఊపిరిలా, మనసుకు ఓ చిరునవ్వులా ఉంటుంది. ఇది ఎప్పటికీ చెరిగిపోని బంధం. కుటుంబ సభ్యులు మనకు పుట్టుకతో వస్తారు కానీ స్నేహితులు మనమే ఎన్నుకుంటాం. అది వారి లక్షణాలను బట్టి, మన హృదయాన్ని తాకే మాటల బట్టి, కలిసిన క్షణాల్లో నిండిపోయే అనుభూతుల బట్టి నిర్ణయించబడుతుంది. విద్యార్థి జీవితంలో స్నేహితులు అనేది మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దశలో మనం మన లక్ష్యాలను, కలలను, బాధలను, ఆనందాలను ఒకరి దగ్గరికి వెళ్లి చెప్పగలిగే వాళ్లే స్నేహితులు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మనం ఒకసారి మన జీవితంలో ఉన్న స్నేహాన్ని గమనిస్తే అది మన జీవితానికి ఎంత విలువైనదో తెలుస్తుంది. మన కష్టసుఖాలలో తోడుగా ఉండే స్నేహితుడు, మన జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు పట్టే చేయి, మనం చిరునవ్వు మరిచిపోయినప్పుడు నవ్వించే ముఖం. ఇవన్నీ నిజమైన స్నేహానికి లక్షణాలు. అలాంటి బంధం మనకి దొరికితే అదృష్టంగా భావించాలి.

చదువులో పోటీ కాదు ,స్నేహం శక్తిగా మారాలి(Friendship should become a strength, not competition in studies)

చదువు అనేది విద్యార్థుల జీవితానికి ఆధారం. కానీ చాలామంది చదువును పోటీగా చూస్తారు. ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చారు, ఎవరు ఫస్ట్ వచ్చారు అనే మాటలు తరచూ వినిపిస్తాయి. కానీ నిజమైన స్నేహం ఎప్పుడూ పోటీగా కాకుండా, ప్రోత్సాహంగా ఉంటుంది. ఒక స్నేహితుడు మరొకరిని ముందుకు నడిపించేలా ఉంటాడు. చదువు అర్థం కాకపోయినప్పుడు బోధించే మిత్రుడు, పరీక్షల సమయంలో గైడ్ ఇచ్చే స్నేహితుడు. ఇవే విద్యార్థి జీవితంలో విలువైన బంధాలు. మనం ఎదగాలంటే మన చుట్టూ మంచి స్నేహితులు ఉండాలి. ఒక్కోసారి మనకంటే తెలివిగా ఉన్న వారు మనకు బోధించగలరు. మన బలహీనతలు వాళ్లతో మాట్లాడితే మనం మెరుగవుతాం. ఈ విధంగా, స్నేహితులతో కలిసి చదివితే విజయం దగ్గరగా ఉంటుంది. నిజమైన స్నేహం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఒకరినొకరు పైకెత్తుకునే బంధం స్నేహం. మన చుట్టూ అటువంటి స్నేహితులు ఉంటే, మన చదువు ప్రయాణం ఒక చక్కటి అనుభవంగా మారుతుంది.

స్నేహం జీవితం మీద చూపే ప్రభావం(The impact of friendship on life)

మన జీవితంలో ఎవరిని కలుస్తామో, వాళ్ళతో ఎలా బంధం పెంచుకుంటామో మన అభిరుచి, మన విలువలను సూచిస్తుంది. విద్యార్థులుగా ఉన్నప్పుడు మన స్నేహితులు మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతారు. మంచి స్నేహితులు ఉంటే మనం మంచి దారిలో నడుస్తాం. ఉదాహరణకు, మన స్నేహితులు రోజూ సమయానికి చదువుకుంటే, మనమీద కూడా అలాంటి శ్రద్ధ వస్తుంది. అలాగే చెడు అలవాట్లలో ఉన్న వాళ్ళతో ఉంటే, మన జీవితానికి దారితప్పే ప్రమాదం ఉంటుంది. ఇది చిన్నగా కనిపించే విషయమై ఎందుకంత ప్రాముఖ్యత అంటే, మన వ్యక్తిత్వం నిర్మాణంలో స్నేహం కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికి స్ఫూర్తినిచ్చే మిత్రుడు ఉండటం అనేది ఓ వరం. మానసిక ఒత్తిడిని తగ్గించే శక్తి కూడా స్నేహంలో ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒంటరిగా అనిపించినప్పుడు, ఓ ఫోన్ కాల్‌లో మన మనసు హాయిగా మార్చగలిగే వ్యక్తి అంటే  ఆ స్నేహం గొప్పతనం చెప్పగలమా? అందుకే మనం ఎవరితో స్నేహం పెంచుకుంటున్నామో ఆలోచించి నిర్ణయించుకోవాలి.

నీ స్నేహం నా జీవితానికి విలువైన వరం లాంటిది. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే (Your friendship is like a precious gift to my life. Happy Friendship Day)

ఫ్రెండ్‌షిప్ డే అనే రోజు అంటే కేవలం గిఫ్ట్ ఇచ్చే రోజు కాదు. అది మనం మన బంధాన్ని మరలా గుర్తుచేసుకునే, మన జీవితంలో ఉన్న వారికి కృతజ్ఞత చెప్పే ప్రత్యేకమైన రోజు. చిన్న చిన్న విషయాల్లో కూడా మిత్రుల ప్రాముఖ్యత ఎంత ఉందో ఆ రోజు మనం గుర్తించాలి. ఓ మంచి మాట చెప్పడం, ఓ చిన్న మెసేజ్ పంపడం, ఓ చిరునవ్వుతో “నువ్వు నాకు ముఖ్యమైనవాడివి” అని చెప్పడం. జీవితంలో ఎన్నో బంధాలు వస్తుంటాయి కానీ, మన మనసు గట్టిగా పట్టుకునే బంధం స్నేహమే. కాలేజీ రోజుల్లో కలిసి తిన్న టీ, పాఠాలు చదివిన పేజీలు, సమయాన్ని మరిపించే స్మైల్స్ ఇవన్నీ ఫ్రెండ్‌షిప్ డే రోజున మన గుండెను తాకే జ్ఞాపకాలుగా మారుతాయి. అలాంటి ప్రత్యేకమైన బంధాన్ని కలిగి ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. ఈ రోజు మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తే చాలు . మన స్నేహాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

చిన్న చిన్న జ్ఞాపకాలే పెద్ద అనుబంధాలకు మూలం(Small memories are the source of big connections)

స్నేహం అనేది ఎప్పుడూ గొప్ప అనుభవాలతో కాక, చిన్న చిన్న మధుర క్షణాలతోనే పెరుగుతుంది. కలసి తిన్న టిఫిన్‌, పుస్తకాలను పంచుకుని చదువుకోవడం,  చికాకుగా నవ్వినప్పుడూ బాగా దూరమైనప్పుడూ మనసు తడిచే జ్ఞాపకాలే మిగిలిపోతాయి. కాలం గడిచిన తర్వాత కూడా, ఈ చిన్న చిన్న సంఘటనలు మన గుండెను తాకుతుంటాయి. ఫ్రెండ్‌షిప్ డే రోజున అలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మన బంధాన్ని మళ్లీ ఆనందాన్నిస్తుంది. ఈ చిన్న మధుర క్షణాలే జీవితాంతం గుర్తుండే గొప్ప అనుబంధాలకు మూలం అవుతాయి.

నిజమైన స్నేహం కాలంతో మారదు(True friendship does not change with time)

కాలం మారుతుంది, మన జీవితం మారుతుంది, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మారిపోతారు. కానీ నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, మన మిత్రుడిని చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. కొన్ని మాటలు పలకకుండా కూడా మన భావాలు అర్థం చేసుకునే బంధం స్నేహం మాత్రమే. అలాంటి బంధం జీవితంలో చాలా అరుదుగా దొరుకుతుంది. ఫ్రెండ్‌షిప్ డే అనేది అలాంటి నిజమైన బంధాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన  రోజు.

స్నేహం వయసు కాదు, మనసుల అనుబంధమే కీలకం(Friendship is not about age, it's about connection of minds that matters)

స్నేహం అంటే పిల్లలకే, యవతకే పరిమితం కాదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరిదైనా హృదయం స్వచ్ఛంగా ఉంటే, అక్కడ స్నేహం పుడుతుంది. టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దలతో కూడా మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. తమ అనుభవాలను మనతో పంచుకునే వారికి మనం స్నేహితులుగా ఉండగలిగితే, జీవితం ఇంకా స్పష్టంగా మారుతుంది. అందుకే మనం ఎవరి స్నేహాన్ని పొందుతున్నామో క్షణం ఆలోచించాలి. మనకంటే వయసులో ఎక్కువైనా, మన జీవితాన్ని ప్రభావితం చేసే వారు అయితే వాళ్లతో స్నేహం పెంచుకోవడం ఎంతో గొప్ప విషయం.

మనం కూడా ఒకరికి మంచి మిత్రులమవ్వాలి(We should also be good friends to each other)

స్నేహితులు మనకు ఎంత ప్రేమ చూపిస్తారో మనం ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లు మానసికంగా దిగజారినప్పుడు మనం చేయి అందించామా? నిజమైన స్నేహితులు కావాలంటే మనం కూడా నిజమైన మిత్రులుగా ఉండాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మన సహాయం చేయగలగాలి, వారి బాధను తక్కువ చేయగలగాలి. మంచి స్నేహితుడిగా ఉండాలంటే సర్దుబాటు, సహనం, విశ్వాసం ఇవన్నీ అవసరం. మనం మంచి మిత్రులమైతే, మన చుట్టూ కూడా మంచి బంధాలే ఏర్పడతాయి.

స్నేహితులు లేకపోతే జీవితం వెలితిగా మారుతుంది(Without friends, life becomes boring)

మన జీవితంలో స్నేహితులు లేని జీవితం ఊహించలేనిది. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా, వాటిని పంచుకునే స్నేహితులు లేకపోతే జీవితంలో ఆనందం ఉండదు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ మన పక్కన ఉంటారు. విజయం వచ్చినప్పుడు గొప్పగా పిలిచి, ఓటమి వచ్చినప్పుడు మౌనంగా గౌరవిస్తూ. అలాంటి మిత్రుల కోసం మనం ఏదైనా త్యాగం చేయగలిగితే అదే నిజమైన బంధం. ఈ ఫ్రెండ్‌షిప్ డే మనం ఒక చిన్న నిమిషం తీసుకుని, మన స్నేహితులను గుర్తు చేసుకుని, వారికి కృతజ్ఞతలు చెప్పుదాం. ఓ చిన్న మెసేజ్, ఓ చిన్న చిరునవ్వు, ఓ చిన్న మాట. ఇవి వారి జీవితంలో వెలుగుల్లా వెలుగుతాయి. ఎందుకంటే చివరికి మనం గుర్తుంచుకునేది విజయాలు కాదు, సంపదలు కాదు. మనతో పాటు నవ్విన, కన్నీళ్లు పంచుకున్న మిత్రులే.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/friendship-day-essay-in-telugu/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy