
తెలుగులో సంక్రాంతి పండుగ విశిష్టత (Snkranti Festival in Telugu) :
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను (Snkranti Festival in Telugu) ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను 4 రోజులు అంటే బోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఈ నాలుగు రోజులను ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, బోగి మంటలు, గాలిపటాలు, కోడి పందాలు, కొత్త బట్టలు, చుట్టాలు, పిండివంటలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. అందుకే సంక్రాంతి కోసం ఏడాదంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది 2026లో కూడా సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ పండుగ కోసం ఇళ్లు, ఊళ్లు కూడా సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
సంక్రాంతి సందడి.. (Snkranti Festival in Telugu)
నిజానికి జనవరి నెలలో ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి నెలకొంటుంది. పిండి వంటలు వండడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆఫీసులకు, స్కూళ్లకి సెలవులు తీసుకోవడం, బస్సు, ట్రైన్ టికెట్లను తీసుకోవడం.. వంటి పనులు అన్ని పండుగకు రెండు నెలల ముందే మొదలవుతుంది. ఏపీ ప్రజలకు ఈ పండుగ అంత ప్రత్యేకమైనది. సంక్రాంతికి శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు 27 ఉంటాయి.ఇక సంక్రాంతి శాస్త్రపరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా డివైడ్ చేశారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు.అలాగే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల బాధలు అంటవని ఓ నమ్మకం.
భోగి పండుగ... (Snkranti Festival in Telugu)
పెద్ద పండుగగా భావించే ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామునే అందరూ నిద్రలేస్తారు. అభ్యంగన స్నానం చేస్తారు. పిల్లలు, పెద్దలు, యువతీ, యువకులు, ఆడవాళ్లు, మగవాళ్లు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద భోగి మంటలను వేస్తారు. ఉదయపు చలిలో వెచ్చని మంటలతో సేద తీరుతారు. అంతేకాదు పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని వస్తువులను, పిడకలను వేస్తారు. చెడు లక్షణాలని భోగి మంటల్లో దగ్ధం చేసి.. కొత్త లక్షణాలను, కొత్త సంతోషాలను ఆహ్వానించేందుకు చిహ్నంగా భోగి మంటల్లో పాత వస్తువులను వేసి దగ్ధం చేస్తారు. అలా భోగి పండుగతో ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి పండుగ రోజు ఇంట్లో అందరూ ప్రత్యేకమైన, సంప్రదాయమైన వంటలను చేసుకుంటారు.సంక్రాంతి పండుగ... (Snkranti Festival in Telugu)
భోగి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ రోజున ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతులతో అలంకరించి వాటి చుట్టూ డ్యాన్స్‌లు చేస్తారు.రంగు రంగుల ముగ్గులతో ప్రతి ఇల్లు ఎంతో అద్బుతంగా మారుతుంది. హరిదాసులు హరినామ సంకీర్తనలు ఆలపిస్తారు. గంగిరెద్దులవారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తుంటారు. పవిత్రంగా సాన్నం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. సంక్రాంతి రోజున ఇళ్లలో చనిపోయిన పెద్దలకు పూజలు ప్రత్యేక పూజలు చేస్తారు. పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు చేస్తారు. తల్లిదండ్రులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత,ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ రోజున ఆ కాలంలో పండే కూరగాయలన్నింటితో కలిపి దప్పలం అనే కూరను చేసుకుంటారు. పిండి వంటలతో ఇంటిల్లిపాది భోజనాలు చేస్తారు.పండుగ సందర్భంగా బంధువులు, చుట్టాలు, స్నేహితులతో అందరి ఇళ్లు కోలాహాలంగా, సందడిగా ఉంటాయి.కనుమ పండుగ... (Snkranti Festival in Telugu)
సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు పాడి పశువులను శుభ్రపరుచుకుంటారు. అనంతరం వాటిని అందంగా అలంకరిస్తారు. కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటికి ప్రత్యేకమైన దాణాను అందిస్తారు. గోపూజ చేస్తారు. పంట చేల దగ్గర రైతులు ఇంట్లో వండి పులగాన్ని జల్లుతారు. అంతేకాదు ఆరోజు పూల తోరణాలు, మామిడి తోరణాలతో ఇళ్లను అందంగా మార్చుకుంటారు.ముక్కనుమ పండుగ... (Snkranti Festival in Telugu)
సంక్రాంతి పండుగలో నాలుగో రోజున ముక్కనుమ అంటారు. ఈ పండుగ రోజున కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు.ఈ దేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు. తొమ్మిది పిండి వంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున ఇళ్లలో బొమ్మల కొలువు పెడతారు.అదేవిధంగా ముక్కనుమ మాంసాహార ప్రియులు ఇష్టపడే పండుగ కూడా. ఎందుకంటే ముక్కనుమ రోజున రకరకాల మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి ఆరగిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాఖహారమే భుజిస్తారు.ఇది ఎన్నో ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా వస్తుంది.గాలి పటాల సంబరం , యువత ఉత్సాహంతో నిండే సంక్రాంతి (A festival of kites, a Sankranti filled with youth enthusiasm)
సంక్రాంతి రాగానే గ్రామాల్లో రంగు రంగుల గాలి పటాలు ముందుగా కనిపిస్తాయి. ఉదయం చల్లని గాలిలో పటాలు ఎగరేయాలనే ఉత్సాహం యువతలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటి పైకప్పులు, పొలాల్లో, ఆ చిన్న చిన్న స్థలాల్లో కూర్చుని గాలి పటాలు ఎగురవేయడంలోనే పండుగ మజా ఉంటుంది. పటాలు ఎగురవేస్తూ “గాలిపటం పడ్డది… లేపు” అంటూ సందడి చేస్తారు. గాలిపటాలు నెమ్మదిగా ఎగిరి ఆకాశంలో కలిసిపోతున్న పటాలను చూసే ఆ క్షణం సంక్రాంతికి గ్రామాల్లో ఉండే సింపుల్ ఆనందాన్ని గుర్తుచేస్తుంది.
సంక్రాంతి సందడి మాత్రమే కాదు, బాధ్యతతో జరుపుకోవాల్సిన పండుగ (Sankranti is not just a festival of fun, but a festival that should be celebrated responsibly.)
సంక్రాంతి రోజున మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా బాధ్యత ఉంటుంది. పటాలు ఎగరేయడమే కాదు, పక్షులకు హాని జరుగకుండా జాగ్రత్త పడటం, ప్రమాదకరమైన మాంజా తాడు వాడకపోవడం మన బాధ్యతే. పండుగ రోజులలో వచ్చే ప్లాస్టిక్ చెత్తను తగ్గించడం, శబ్దాన్ని తగ్గించి పెద్దలు చిన్నవారందరికి సంతోషంగా గడపడానికి అవకాశం కల్పించడం కూడా అంతే ముఖ్యం. పండుగను ఆనందంగా జరుపుకుంటూ ప్రకృతి, మనశ్శాంతి, జంతు భద్రత అంత జాగ్రతగా ఉండేలా చూసుకుంటేనే అసలు పండుగ అర్థం నిలుస్తుంది. సంప్రదాయాల అందాన్ని కాపాడుతూ, కొత్త తరం బాధ్యతలను కూడా కలుపుకుంటూ జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?


















సిమిలర్ ఆర్టికల్స్
AP NMMS ఆన్సర్ కీ 2025-26 విడుదల తేదీ, PDF డౌన్లోడ్ లింక్స్
TG TET హాల్ టికెట్ 2026 డౌన్లోడ్ లింక్, సబ్జెక్టుల వైజుగా పరీక్ష షెడ్యూల్
రిపబ్లిక్ డే స్పీచ్ తెలుగులో (Republic Day Speech in Telugu)
SWAYAM పరీక్ష 2026కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
TG SET ST కేటగిరీ కటాఫ్ మార్కులు 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌ను తనిఖీ చేయండి
TG SET SC కేటగిరీ కటాఫ్ మార్కులు 2025 సబ్జెక్ట్ వారీగా, అంచనా & మునుపటి సంవత్సరాల కటాఫ్‌ను తనిఖీ చేయండి