TS SET 2026 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ స్కోర్లు, కట్ ఆఫ్ మరియు అర్హత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. గత సంవత్సరాల ట్రెండ్లు గురించి మొత్తం సమాచారం ఈ వ్యాసంలో వివరంగా అందించబడింది.

TS SET 2026 ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని అభ్యర్థులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆన్సర్ కీ విడుదలై, అభ్యంతరాల ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యంలో, ఫలితాలు ఈ వారంలోనే లేదా లేటుగా అయితే వచ్చే వారం ప్రారంభంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ప్రశ్నపత్రం ఎక్కువగా మోడరేట్ స్థాయిలో ఉండడంతో చాలామంది భయపడకుండా ఎక్కువ ప్రశ్నలు ప్రయత్నించారు. మార్కులు పెద్దగా తగ్గేది లేకుండా ఉండటంతో ప్రయత్నాలు కూడా పెరిగాయి. అందుకే కొంతమంది అంచనా వేస్తున్నారు. కొన్ని సబ్జెక్టుల్లో కట్ ఆఫ్ కొంచెం పెరగొచ్చని. ఫలితాలు విడుదలైన వెంటనే రెండు పేపర్ల మార్కులు, అర్హత స్థితి ఏమిటో తెలిసుకోవడం ప్రతి అభ్యర్థికి చాలా ముఖ్యమైనది. మొత్తం మీద, TS SET రాసిన వారికి ఫలితాలు వచ్చేంతవరకు ఉన్న చిన్న టెన్షన్ సహజమే.
TS SET 2026 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? (How to check TS SET 2026 results?)
TS SET 2026 ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ క్రింది స్టెప్పుల ద్వారా తమ స్కోర్‌కార్డ్ చెక్ చేసుకోవచ్చు.
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ telanganaset.org ను ఓపెన్ చేయాలి
ఆ తరువాత హోమ్ పేజీలో కనిపించే “TS SET Results 2026” లింక్‌పై క్లిక్ చేయాలి
హాల్ టికెట్ నంబర్ లేదా పుట్టిన తేది నమోదు చేయాలి
పేపర్ 1 + పేపర్ 2 మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి
అర్హత స్థితి (అర్హత/అర్హత లేదు) అని చూపబడుతుంది
స్కోర్‌కార్డ్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
అవసరమైతే ఫలితాలను ప్రింట్ తీసుకుని భవిష్యత్తులో సేవ్ చేసుకోవచ్చు
TS SET 2026లో ఎంపిక విధానం (Selection Process in TS SET 2026)
TS SET 2026లో అర్హత నిర్ణయించేటప్పుడు అభ్యర్థుల మొత్తం పనితీరును శాతం ఆధారంగా ప్రత్యేక విధానంతో ఎంపిక చేస్తారు.
పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో కేవలం టాప్ 6% మందికే అర్హత కల్పిస్తారు
ఆ 6% ను ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా విభజించి మెరిట్ జాబితా సిద్ధం చేయబడుతుంది
వర్గాల (General, BC, SC, ST, PwD) వారీగా అర్హత శాతం పాటించబడుతుంది
పేపర్ 1 మరియు పేపర్ 2 మార్కులను కలిపిన మొత్తం స్కోరు ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది
ర్యాంక్ సిస్టమ్ లేదు, కేవలం “Eligible / Not Eligible” స్థితి మాత్రమే చూపబడుతుంది
TS SET 2025 అంచనా ఫలితాలు: గత సంవత్సరాల ట్రెండ్‌లు (Expected TS SET Results 2025: Previous Years Trends)
TS SET ఫలితాలు 2025 కోసం అంచనా వేసిన తేదీని అంచనా వేయడంలో సహాయపడటానికి, గత సంవత్సరం TS SET ఫలితాల విడుదల ట్రెండ్‌లు, గ్యాప్ పీరియడ్‌తో పాటు ఇక్కడ ఉన్నాయి.
సంవత్సరం | పరీక్ష తేదీ | ఫలితాల విడుదల తేదీ | గ్యాప్ కాలం |
|---|---|---|---|
TS SET ఆన్సర్ కీ 2024 | సెప్టెంబర్ 10 నుండి 13, 2024 వరకు | నవంబర్ 16, 2024 | 64 రోజులు |
TS SET ఆన్సర్ కీ 2023 | అక్టోబర్ 28 నుండి 30, 2023 వరకు | డిసెంబర్ 6, 2023 | 36 రోజులు |
TS SET 2026 కటాఫ్‌ని ఎలా నిర్ణయిస్తారు? (How is the TS SET 2026 cut off determined?)
TS SET 2026 కట్ ఆఫ్‌ని ప్రతి సబ్జెక్టుకు వేర్వేరు అంశాలు పరిశీలించి నిర్ణయిస్తారు.
ఆ సబ్జెక్టులో పరీక్ష రాసిన అభ్యర్థుల మొత్తం సంఖ్య
పేపర్ కఠినత్వం
టాప్ స్కోర్లు ఎంత ఉన్నాయో
గత సంవత్సరాల కట్ ఆఫ్ ట్రెండ్స్
వర్గాల వారీ అర్హత శాతం పంపిణీ
మొత్తం అర్హత పొందే 6% అభ్యర్థుల ఎంపిక నిష్పత్తి
TS SET గత 5 సంవత్సరాల కటాఫ్ ట్రెండ్ (TS SET Cut-off trend of the last 5 years)
ఈ ట్రెండ్ ద్వారా ప్రతి ఏడాది కట్ ఆఫ్ ఎలా మారిందో చూసి 2026లో ఎలాంటి మార్పులుంటాయో అంచనా వేయవచ్చు.
సంవత్సరం | జనరల్ (General) | BC | SC | ST |
|---|---|---|---|---|
2023 | 48% – 54% | 45% – 50% | 40% – 45% | 38% – 42% |
2022 | 47% –- 53% | 44% – 49% | 39% – 44% | 37% – 41% |
2021 | 46% — 52% | 43% – 48% | 38% – 43% | 36% – 40% |
2019 | 45% — 51% | 42% – 47% | 37% – 42% | 35% – 39% |
2018 | 44% —50% | 41% – 46% | 36% – 41% | 34% – 38% |
TS SET 2026 ఫలితాల తర్వాత ఏం చేయాలి? (What to do after TS SET 2026 results?)
TS SET ఫలితాలు ప్రకటించబడిన వెంటనే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన దశలు పూర్తి చేసుకోవాలి.
స్కోర్‌కార్డ్‌ను PDFగా డౌన్‌లోడ్ చేసుకోండి
పేపర్ 1 మరియు పేపర్ 2 మార్కులు చెక్ చేయండి
అర్హత స్థితి (అర్హత/అర్హత లేదు) నిర్ధారించుకోండి
పేరులో, కేటగిరీ, సబ్జెక్ట్ వంటి వివరాల్లో ఏదైనా తప్పుడు ఉందో చూడండి
అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోండి (Caste, PwD, PG మార్క్స్ మెమో, Bonafide)
తర్వాత ప్రకటించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను గమనిస్తూ ఉండాలి.
TS SET 2026 ఫలితాలు త్వరలో విడుదల కావడంతో అభ్యర్థుల్లో కాస్తా టెన్షన్ పెరిగింది. ఫలితాలు వచ్చాక స్కోర్లు చెక్ చేసి అర్హత స్థితిని నిర్ధారించుకోవడమే చేయాల్సిన పని. ఈ పరీక్షలో అర్హత పొందడం విద్యా రంగంలో ముందుకు వెళ్లేందుకు కీలకమైన దశగా ఉన్నందున ఇది ప్రతి అభ్యర్థికి ఒక ముఖ్యమైన అవకాశం.














సిమిలర్ ఆర్టికల్స్
త్వరలో TG TET ఫలితాలు 2026 విడుదల, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి
TG Inter 2026 హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి?
TG TET 2026 ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్ ఈ వారంలోనే విడుదల
వివాదంలో UGC ACT 2026, కొత్త నిబంధనలపై నిరసలు
రిపబ్లిక్ డే స్పీచ్ తెలుగులో (Republic Day Speech in Telugu)
విద్యార్థుల కోసం తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu)