ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు (AP AHD Recruitment 2023) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోండి.
AP AHD Recruitment 2023: ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 పోస్టులు, జిల్లాల వారీగా ఖాళీలు, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?
AP AHD రిక్రూట్‌మెంట్ 2023 (AP AHD Recruitment 2023):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్థక శాఖలో 1896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 11, 2023 చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవాలి. దరకాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్ టికెట్లు జారీ చేస్తారు. ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు జారీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు (AP AHD Recruitment 2023) సంబంధించిన అర్హత, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను ఇక్కడ అందజేశాం.
ఏపీ ఏహెచ్‌డీ రిక్రూట్‌మెంట్ 2023 (AP AHD Recruitment 2023)
ఏపీ ఏహెచ్‌డీ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఆర్గనైజేషన్ పేరు
ఆంధ్రప్రదేశ్ యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ డిపార్ట్‌మెంట్
పోస్టు వివరాలు
యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్
మొత్తం పోస్టులు
1896
జీతం
రూ.22,460 నుంచి రూ.72,810
అప్లై మోడ్
ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్
ahd.aptonline.in
AP AHD జిల్లాల వారీగా ఖాళీల వివరాలు 2023 (AP AHD Vacancy Details 2023)
జిల్లాల వారీగా AP AHD పోస్టుల వివరాలను ఈ దిగువున టేబుల్లో తెలుసుకోవచ్చు.
అనంతపురం జిల్లా
473
కర్నూలు జిల్లా
252
చిత్తూరు జిల్లా
100
నెల్లూరు జిల్లా
143
వైఎస్‌ఆర్ కడప జిల్లా
210
ప్రకాశం జిల్లా
177
గుంటూరు జిల్లా
229
కృష్ణా జిల్లా
120
పశ్చిమ గోదావరి జిల్లా
102
తూర్పు గోదావరి జిల్లా
15
విశాఖపట్నం జిల్లా
28
విజయనగరం జిల్లా
13
శ్రీకాకుళం జిల్లా
34
AP AHD రిక్రూట్‌మెంట్ అవసరమైన అర్హత వివరాలు (AP AHD Recruitment Required Eligibility Details)
AP AHD రిక్రూట్‌మెంట్ అవసరమైన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
AP AHD రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు యానిమల్ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు చేసి ఉండాలి. అదే విధంగా డెయిరీ అండ్ పౌల్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు లేదా పౌల్ట్రీ విభాగంలో రెండేళ్ల డిప్లొమా లేదా డెయిరీ విభాగంలో రెండేళ్ల ఇంటర్మీడియల్ కోర్సు లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్), ఎంఎస్సీ (డెయిరీ సైన్స్), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), డిప్లొమా వెటర్నరీ సైన్స్, డెయిరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా , డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ తదితర కోర్సులు చేసి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థికి 01-07-2023 నాటికి 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ అభ్యర్థులు ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
AP AHD రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.500లు ఫీజు చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు రూ.1000లు చె ల్లించాలి.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే అందిస్తారు. ఆ తర్వాత రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ ఉంటుంది.