AP EAMCET 2025 మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 59980 సీట్లు భర్తీ

Rudra Veni

Updated On: July 24, 2025 02:41 PM

AP EAMCET 2025 మొదటి రౌం్డ్‌ కౌన్సెలింగ్‌లో  77,561 సీట్లు కేటాయించబడగా అందులో 59, 980 సీట్లు భర్తీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
AP EAMCET 2025 మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 59980 సీట్లు భర్తీAP EAMCET 2025 మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో 59980 సీట్లు భర్తీ

AP EAMCET 2025 మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్ ఫిల్ అయిన సీట్ల సంఖ్య  (AP EAMCET 2025 first Round Counselling-Admissions) : AP EAMCET 2025 మొదటి ఫేజ్‌ సీటు అలాట్‌మెంట్ విడుదలైన తర్వాత  59,980 ఇంజనీరింగ్ సీట్లు (AP EAMCET 2025 first Round Counselling-Admissions) ఫిల్ అయ్యాయి.  అంటే 59,980 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో, కాలేజీల్లో రిపోర్ట్ చేసి తమ సీట్లను నిర్ధారించుకున్నారు. మొదటి దశలో మొత్తం 77,561 సీట్లు కేటాయించబడ్డాయి. ఇందులో58, 980 మంది ఫీజు చెల్లించి, రిపోర్టింగ్ చేశారు. అంటే 77.34 శాతం మంది జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.  మిగతా 17,581 మందికి తాము  పొందిన సీట్లు కాలేజీలు లేదా బీటెక్ బ్రాంచీలు నచ్చలేదు. మిగిలిన సీట్లు రెండో దశ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంటాయి.

IIT, NIT, ట్రిపుల్ ITల్లో సీట్లు వస్తాయని అంచనా ఉన్న అభ్యర్థులు అసలు కౌన్సెలింగ్‌లో పాల్గొనలేనట్టు తెలుస్తుంది. అదేవిధంగా యాజమాన్య కోటాలో సీట్లు పొందేందుకు,  కొందరు ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో చేరాలనుకునే అభ్యర్థులు సీట్లు వదులుకుని ఉంటారని అంచనా. రెండో విడత కౌన్సెలింగ్‌కు 17,581 సీట్లు అందుబాటులో ఉన్నాయి.  జూలై 25వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 27 వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. ఈ దశలన్ని పూర్తైన తర్వాత రెండో విడదల సీట్లు కేటాయింపు ఉంటుంది.

AP EAMCET 2025 మొదటి ఫేజ్‌ సీటు అలాట్‌మెంట్-మెయిన్ బ్రాంచీల్లో సీట్ల భర్తీ  వివరాలు

AP EAMCET 2025 (AP EAMCET 2025 first Round Counselling-Admissions) మొదటి ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో బ్రాంచ్‌లు వారీగా భర్తీ అయిన సీట్ల వివరాలు ఈ దిగువున పట్టికలో అందించాం.

కోర్సు పేరు

మొత్తం సీట్లు

కేటాయింపు

చేరిన అభ్యర్థుల

CSE

28,246

27,657

21,286

IT

3,960

3,849

3,171

CSE (AI-ML)

13,540

13,093

10,733

CSE (డేటా సైన్స్)

7,600

7,295

5,677

CSE (సైబల్ టెక్నాలజీ)

1560

1,528

1,203

AI, డేటా సైన్స్

1301

1,276

947

ECE

10,967

10,099

7,714

EEE

4,695

3,519

2,526

సివిల్

3,376

2,756

1,976

మెకానికల్

3,230

2,401

1600

కాగా మొదటి దశ క్లాసులు ఆగస్టు 4, 2025 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఆరోజు నుంచి క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2025-first-round-counseling-59980-students-reported-to-their-respective-colleges-69077/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy