AP LAWCET Counselling Date 2023: ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ ఎప్పటినుంచంటే?
AP LAWCET కౌన్సెలింగ్ తేదీ 2023 (AP LAWCET Counselling Date 2023):
గత సంవత్సరాల ట్రెండ్‌లను రిఫరెన్స్‌గా ఆధారంగా చూస్తే AP LAWCET కౌన్సెలింగ్ ఫలితం (AP LAWCET Counselling Date) 2023 జూలై, ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. AP LAWCET 2023 ఫలితాలు జూన్ 16, 2023న విడుదలయ్యాయి.దీంతో విద్యార్థులు AP LAWCET కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కౌన్సెలింగ్ తేదీలను అధికారికంగా వెల్లడి కాలేదు. AP LAWCET 2023 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు పిలవబడతారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా AP LAWCET 2023 ఆన్‌లైన్ ఎంపికల సమర్పణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు, సీటు అలాట్‌మెంట్ వంటి అనేక దశలు ఉంటాయి. మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా, షార్ట్‌లిస్ట్ చేయడంలో విజయం సాధించిన విద్యార్థులకు మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు ఉండే LL.B ప్రోగ్రామ్‌లను అందించే వివిధ AP LAWCET పార్టిసిపేటింగ్ కాలేజీలలో ప్రవేశం కల్పిస్తారు. కౌన్సెలింగ్ ర్యాంక్ క్రమంలో జరుగుతుంది మరియు మూడు సంవత్సరాల, ఐదు సంవత్సరాల LLB ప్రోగ్రామ్‌ల కోసం స్వతంత్రంగా నిర్వహించబడుతుంది.
ఇవి కూడ చదవండి:
ఏపీ లాసెట్ 2023 ఫలితాలు విడుదల
ఏపీ లాసెట్ 2023 ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇదే
AP LAWCET 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ (AP LAWCET 2023 Counseling Schedule)
AP LAWCET 2023 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను (అంచనా) ఇక్కడ తెలుసుకోండి.| ఈవెంట్ | తేదీలు |
|---|---|
| AP LAWCET 2023 ఫలితాల ప్రకటన | జూన్ 16, 2023 |
| AP LAWCET 2023 కౌన్సెలింగ్ ప్రారంభం | జూలై, ఆగస్ట్ 2023 (అంచనా) |
| AP LAWCET 2023 అధికారిక వెబ్‌సైట్ | cets.apsche.ap.gov.in |
AP LAWCET కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online for AP LAWCET Counselling?)
AP LAWCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు నోటిఫికేసన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పత్రికా ప్రకటన ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ, కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తారు. తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని ఈ దిగువున వివరంగా అందించడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గమనించవచ్చు.- ముందుగా అభ్యర్థులు AP LAWCET 2023 అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి
- హోంపేజీలో కౌన్సెలింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో డేటా ఫార్మ్‌ని మీ వివరాలతో పూరించాలి.
- ఇప్పుడు మీరు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
- మీరు భవిష్యత్తు కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















