AP LAWCET 2023 Hall Ticket: ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్లు విడుదల, ఇదే డైరక్ట్ లింక్
ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్ (AP LAWCET 2023 Hall Ticket):
AP LAWCET 2023 అడ్మిట్ కార్డులు ఈరోజు (మే15, 2023) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను (AP LAWCET 2023 Hall Ticket) సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో డైరక్ట్ లింక్ అందజేయడం జరిగింది. దానిపై క్లిక్ చేసి తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET)ని APSCHE తరపున గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ రాష్ట్రస్థాయి పరీక్ష ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల LLB కోర్సుల్లో అభ్యర్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.
ఈ లాసెట్ 2023 పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఏపీలోని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. ఈ AP LAWCET 2023కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి. ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
| AP LAWCET 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ |
|---|
AP LAWCET 2023 ఓవర్ వ్యూ (AP LAWCET 2023 Overview)
AP LAWCET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.| AP LAWCET 2023 | వివరాలు |
|---|---|
| పరీక్ష పేరు | ఏపీ లాసెట్ |
| కండక్టింగ్ బాడీ | ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు |
| పరీక్షా విధానం | ఆన్‌లైన్ |
| AP LAWCET 2023 పరీక్షా తేదీ | 20 మే 2023 |
| ఆన్సర్ కీ విడుదల | 22 మే 2023 |
ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to download AP LAWCET 2023 Hall Ticket)
ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్‌ను అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే పైన ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను cets.apsche.ap.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో AP LAWCET అనే లింక్‌పై క్లిక్ చేయాలి
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
- తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను నమోదు చేయండి
- మీ AP LAWCET 2023 హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతంుది.
- భవిష్యత్ సూచనల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















