
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలు విడుదల (AP Open School Results 2023):
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) పదో తరగతి, ఇంటర్ ఫలితాలను (AP Open School Results 2023) విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ భాషలకు నిర్వహించగా ఇంటర్మీడియట్ పరీక్షలు హిందీ, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు నిర్వహించబడ్డాయి. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది.
ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి ఫలితాలు- డైరక్ట్ లింక్ |
---|
ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ తరగతి ఫలితాలు- డైరక్ట్ లింక్ |
ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 31,623 మంది హాజరయ్యారు. 48.82 శాతం ఉత్తీర్ణతతో 15,437 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 69,617 మంది హాజరవగా 40,919 ఉత్తీర్ణత పొంది 58.78 శాతం మంది పాస్ అయ్యారు.
APOSS SSC, ఇంటర్ ఫలితాలు 2023 ఎలా చెక్ చేయాలి? (How to check APOSS SSC, Inter Results 2023)
ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందజేయడం జరిగింది.- దశ 1: అధికారిక వెబ్‌సైట్‌ను apopenschool.ap.gov.in సందర్శించండి
- దశ 2: హోమ్‌పేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
- దశ 3: అవసరమైన ఆధారాలను నమోదు చేయండి
- దశ 4: ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి 'Submit'పై క్లిక్ చేయండి.
బాలికలదే పై చేయి...
ఈ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లోనూ బాలికలదే పై చేయిగా ఉంది. బాలుర కంటే బాలికలే ఎక్కువమంది పాస్ అయ్యారు. పదో తరగతి పరీక్షల్లో 51.43 శాతం మంది, బాలురు 46.30 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్మీడియట్‌లో బాలికలు 60.59 శాతంతో ముందంజలో ఉండగా బాలురు 57.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఓపెన్ స్కూల్‌లో తూర్పు గోదావరిలో 88.38 శాతం పాస్ అయ్యారు. అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 02.00 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్మీడియట్‌లో అత్యధిక శాతం తిరుపతి జిల్లాలో 86.70 ఉత్తీర్ణులు అయ్యారు. అత్యల్పంగా పల్నాడులో 11.26శాతం పాస్ అయ్యారు.రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఎప్పుటి నుంచంటే? (Re-verification and Recounting from May 22nd)
ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం మే 22 నుంచి మే 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. పేమంట్ ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ. 200 చొప్పున, రీ వెరిఫికేషన్, స్కాన్ కాపీ కోసం సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున ఫీజు కట్టాల్సి ఉంటుంది.Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



