AP PGCET Special Category Physical Certificate Verification : AP PGCET 2023 ప్రత్యేక కేటగిరి ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పటినుంచంటే?ఏపీ పీజీసెట్ 2023 స్పెషల్ కేటగిరి ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు (AP PGCET Special Category Physical Certificate Verification) : ఆంధ్రా యూనివర్సిటీ ఫర్ AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తన అధికారిక వెబ్‌సైట్ అంటే pgcet-sche.aptonline.inలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (PH, NCC, CAP/Sports) ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను (AP PGCET Special Category Physical Certificate Verification) విడుదల చేసింది. అలాంటి అభ్యర్థులు 2023 సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 22 మధ్య విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో ఫిజికల్ సర్టిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకువెళ్లాలి. ఏ సమయంలోనైనా అభ్యర్థులు తీసుకెళ్లిన సర్టిఫికెట్లు తప్పు లేదా నకిలీవి అని తేలితే, వెంటనే కేటాయింపు రద్దు చేయబడుతుంది. అభ్యర్థి క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని దయచేసి గమనించాలి.
AP PGCET 2023 ప్రత్యేక కేటగిరీ ఫిజికల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ తేదీ, సమయం (AP PGCET 2023 Special Category Physical Certificate Verification Date and Time)
అభ్యర్థులు ఈ దిగువ పట్టికలో AP PGCET 2023 ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన ఫిజికల్ ధ్రువీకరణ తేదీ, సమయాన్ని గమనించాలి.యాక్టివిటీ | తేదీలు | సమయం |
|---|---|---|
| ఏపీ పీజీసెట్ 2023 స్పెషల్ కేటగిరి ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 21, 2023 | ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు |
| ఏపీ పీసెట్ 2023 స్పెషల్ కేటగిరి ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లాస్ట్‌డేట్ | సెప్టెంబర్ 22, 2023 | ఉదయం 9.00 గంటల నుంచి 5.00 గంటల వరకు |
AP PGCET 2023 ప్రత్యేక కేటగిరీ ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్: రిపోర్టింగ్ వేదిక (AP PGCET 2023 Special Category Physical Certificate Verification: Reporting Venue)
ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుదారులు ఈ కింది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ఇచ్చిన షెడ్యూల్‌ను అనుసరించాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా పేర్కొన్న రిపోర్టింగ్ వేదికకు రిపోర్ట్ చేయాలి.
రిపోర్టింగ్ వెన్యూ | డేట్ | సబ్జెక్ట్ వైజ్ రిపోర్టింగ్ షెడ్యూల్ |
|---|---|---|
| HLC, ఆంధ్రా లయోలా కాలేజ్, సెంటిని హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ-520008. సెప్టెంబర్ 21, 2023 | సెప్టెంబర్ 21, 2023 | బోటనీ, సెరికల్చర్, జువాలజీ, జియాలజీ, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ సైన్సెస్, పాలిమర్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్సెస్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, జియోగ్రఫీలో అన్ని ర్యాంక్ హోల్డర్లు |
సెప్టెంబర్ 22, 2023 | సెప్టెంబర్ 22, 2023 పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ & మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ, ఇంగ్లీష్, జనరల్, ఎకనామిక్స్, టూరిజం, హిందీ, ఉర్దూ, తమిళం, జానపదం, ఫైన్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు, లిటరేచర్, సంస్కృతం, రాజకీయ శాస్త్రం. |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















