AP PGECET 2025 ఫలితాలను జూన్ 25, 2025న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు APSCHE ప్రకటించింది.AP PGECET ఫలితాల గురించి పూర్తి సమాచారం(AP PGCET 2025 Results Release Date)ఇక్కడ అందించాము.

AP PGCET 2025 ఫలితాలు విడుదల తేదీ(AP PGCET 2025 Results Release Date): ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్ (AP PGECET) 2025 ఫలితాలను APSCHE ద్వారా జూన్ 25, 2025 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు జూన్ 6 నుండి 8 వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన cets.apsche.ap.gov.in/PGECET ద్వారా హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
AP PGCET 2025 ఫలితాల తేదీలు(AP PGCET 2025 Result Dates)
AP PGCET 2025 ఫలితాల తేదీలు గురించి పూర్తి వివరాలు ఈ క్రింది టేబుల్ లో ఇచ్చాము
వివరాలు | తేదీలు | సమయం |
---|---|---|
AP PGCET 2025 ప్రాధమిక ఆన్సర్ కీ విడుదల తేదీ | జూన్ 11,2025 | సాయంత్రం 5 గంటలకు |
AP PGCET 2025 అభ్యంతర దాఖలుకు చివరి తేదీ | జూన్ 14,2025 | - |
AP PGCET 2025 ఫలితాలు విడుదల తేదీ | జూన్ 25,2025 | సాయంత్రం 5 గంటలకు |
AP PGCET 2025 ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి (How to check AP PGCET 2025 result)
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి cets.apsche.ap.gov.in/PGECET సందర్శించాలి
- ఆ తరువాత “Download Rank Card / Result” అనే లింక్‌ను క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
- Submit చేసిన తర్వాత మీ ఫలితాలు తెరపై ప్రదర్శించబడతాయి.
- మీరు ఫలితాన్ని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.
AP PGCET 2025 ఫలితంలో చూపబడే వివరాలు(Details that will be shown in AP PGCET 2025 result)
- అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు,
- హాల్‑టికెట్ నంబర్ .
- రిజిస్ట్రేషన్ నంబర్
- పుట్టిన తేదీ
- పరీక్షలో సాధించిన మొత్తం మార్కులు(Total Marks Out Of 120)
- శాతం(Percentage)
- అర్హత స్థితి (Qualified/Not Qualified)
- సాధించిన ర్యాంక్ (Rank)
- క్యాటగిరీ (OC/BC/SC/ST)
- అబ్యర్ధి లింగం, రాష్ర స్థాయి ర్యాంక్ (State-wise Rank )
AP PGCET 2025 ఫలితాల ఆధారంగా తదుపరి దశలు(Next steps based on AP PGCET 2025 results)
కౌన్సెలింగ్ ప్రక్రియ(Counseling process): ఫలితాల విడుదల అనంతరం APSCHE ఆధ్వర్యంలో AP PGECET 2025 కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్స్ & సీటు కేటాయింపు(Web Options & Seat Allocation): వెబ్ ఆప్షన్స్ ఎంపిక సమయంలో అభ్యర్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకోవాలి. ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది.
ఈ పరీక్షకు అదనంగా GATE లేదా GPAT క్వాలిఫై అయిన అభ్యర్థులకు కూడా ప్రవేశానికి అవకాశముంటుంది. వీరికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతాయి.ఫలితాన్ని చూసిన తర్వాత స్క్రీన్‌షాట్ లేదా ప్రింట్‌ఆయిల్ తీయడం మంచిది.కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ముందు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.అధికారిక నోటిఫికేషన్‌ల కోసం ఎప్పటికప్పుడు APSCHE వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



