APPSC GROUP 2 Notification 2023: త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, సిలబస్‌లో మార్పులు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 (APPSC GROUP 2 Notification 2023):
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ APPSC త్వరలో విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదల చేయడానికి సంబంధిత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు 10వ తేదీలోపు APPSC GROUP 2 నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాత పరీక్షలకు కొత్త సిలబస్‌ను (APPSC Group 2 Syllabus 2023) కూడా రిలీజ్ చేసింది. APPSC గ్రూప్ 2023 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొత్తం 450 మార్కులకు రెండు దశల్లో రాత పరీక్షలు జరగనున్నాయి.
మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష (APPSC Group 2 Exam 2023) ఉంటుంది. రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులవుతారు.
APPSC గ్రూప్ 2 సిలబస్ 2023 (APPSC Group 2 Syllabus 2023)
తాజా సిలబస్ ప్రకారం.. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. రివైజ్ చేసి సిలబస్, పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. APPSC మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు (మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది.ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నమూనా 2023 (APPSC Group 2 Mains Exam Pattern 2023)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
|---|---|---|
| భారత దేశ హిస్టరీ | 30 | 30 |
| ఎకనాకమిక్ జాగ్రఫీ, హ్యుమన్ జాగ్రఫీ | 30 | 30 |
| భారతీయ సమాజం | 30 | 30 |
| కరెంట్ అఫైర్స్ | 30 | 30 |
| మెంటల్ ఎబిలిటీ | 30 | 30 |
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నమూనా 2023 (APPSC Group 2 Prelims Exam Pattern 2023)
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నమూనా 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
|---|---|---|
| పేపర్ 1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) | 150 | 150 |
| పేపర్ 2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ) | 150 | 150 |
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ (APPSC Group 2 Selection Process)
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇక్కడ అందజేశాం. ముందుగా అభ్యర్థులు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాలి. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు APPSC గ్రూప్ మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు APPSC గ్రూప్ 2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు హాజరవుతారు.స్టెప్ 1- ప్రిలిమినరీ పరీక్ష
స్టెప్ 2- మెయిన్స్ పరీక్ష
స్టెప్ 3- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
స్టెప్ 4- డాక్యుమెంట్ వెరిఫికేషన్
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















