APPSC Website: అభ్యర్థులకు అలర్ట్, ఆ రెండు రోజులు APPSC వెబ్‌సైట్ బంద్

Rudra Veni

Updated On: August 11, 2023 02:05 PM

APPSC అధికారిక వెబ్‌సైట్  (APPSC Website) రెండు రోజుల పాటు అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్ట్ 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని  APPSC ఒక ప్రటకనలో తెలియజేసింది. 
APPSC Website: అభ్యర్థులకు అలర్ట్,  ఆ రెండు రోజులు APPSC వెబ్‌సైట్ బంద్APPSC Website: అభ్యర్థులకు అలర్ట్, ఆ రెండు రోజులు APPSC వెబ్‌సైట్ బంద్

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (APPSC Website): ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్  (APPSC Website) రెండు రోజుల పాటు పని చేయదు.  వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం APPSC వెబ్‌సైట్‌ను రెండో రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు APPSC కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  ఆగస్ట్ 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్ట్ 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని వెల్లడించారు. ఈ మేరకు ఆయా తేదీల్లో నియామక రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని  APPSC ప్రకటనలో సూచించింది.

రెండు రోజుల పాటు వెబ్‌సైట్  (APPSC Website)  పనిచేయదనే నోటిఫికేషన్  వెబ్‌సైట్ హోంపేజీలో స్కోల్ అవుతుంది. అభ్యర్థులు ముందుగా గమనించి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో

AP ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీస్ నోటిఫికేషన్ నెం.11/2022లో నమూనా టేకర్ పోస్ట్ కోసం హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్‌ ఓవర్సీస్ పోస్ట్ కోసం హాల్ టికెట్లు, వివిధ ఇంజనీరింగ్ సేవల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ కోసం హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఆగస్ట్ 9వ తేదీ నుంచి ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కొన్ని నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. అవసరమైన అభ్యర్థులు ఆగస్ట్ 18వ తేదీలోపు వాటిని డౌన్‌లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవడం మంచిది.

APPSC వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?  (How to Download Hall Tickets from the APPSC Website?)


APPSC వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో? ఇక్కడ తెలుసుకోండి.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక సైట్ psc.ap.gov.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో  "Download Hall Ticket" అనే విభాగంపై క్లిక్ చేయాలి.
  • వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అందులో అభ్యర్థి తమ ఆధారాలను నమోదు చేయాలి.  అంటే వినియోగదారు ID, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీకు కావాల్సిన హాల్ టికెట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దానిని డౌన్‌లోడ్ చేసుకుని,  ప్రింట్ అవుట్‌లను తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-website-will-not-be-accessible-for-two-days-44085/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy