CUET PG 2026 రిజిస్ట్రేషన్ ఈరోజుతో ముగింపు, వెంటనే దరఖాస్తు చేయండి

manohar

Published On:

CUET PG 2026 రిజిస్ట్రేషన్ ఈరోజు ముగింపు. CUET PG 2026 ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11:50 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

CUET PG 2026 Registration Window Closes Today,CUET PG 2026 Registration Window Closes Today,

CUET PG 2026 ఈ రోజే రిజిస్ట్రేషన్ చివరి రోజు (CUET PG 2026 registration is today): CUET PG 2026 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు, జనవరి 23, 2026 రాత్రి 11:50 గంటలకు రిజిస్ట్రేషన్ విండోను ముగిస్తున్నది. ఇప్పటికే పొడిగించిన ఈ గడువు ముగియక ముందే ఆసక్తి ఉన్న మరియు అర్హత కలిగిన అభ్యర్థులు exams.nta.nic.in ను సందర్శించి తమ దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు జనవరి 25, 2026 రాత్రి 11:50 గంటల వరకు పరీక్షా ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ అందజేసిన తర్వాత NTA జనవరి 28 నుంచి జనవరి 30, 2026 రాత్రి 11:50 గంటల వరకు అప్లికేషన్లను సరిదిద్దుకునేందుకు విండో కూడా అందిస్తుంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, అభ్యర్థులు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన గడువులను తప్పక పాటించాలన్నదే NTA హెచ్చరిక లేదంటే అప్లికేషన్ పరిశీలించబడవని స్పష్టం చేసింది.

CUET PG 2026 దరఖాస్తు ఎలా చేయాలి? (How to apply for CUET PG 2026?)

CUET PG 2026 దరఖాస్తు ఈ రోజు రాత్రి 11:50 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఈ క్రింది విధముగా పూర్తి చేయాలి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి exams.nta.nic.in/cuet-pg వెళ్లండి
  • ఆ తరువాత హోమ్‌పేజీలో ఉన్న CUET PG 2026 Registration లింక్‌పై క్లిక్ చేయండి.
  • బేసిక్ వివరాలు నమోదు చేసి కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  • రిజిస్టర్ చేసిన మొబైల్/మెయిల్‌తో లాగిన్ అవ్వండి.
  • CUET PG 2026 అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి.
  • డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  • వివరాలు తనిఖీ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
  • చివరిగా ప్రింట్ అవుట్ తీసుకోండి.

CUET PG 2026 అప్లికేషన్ ఫీజు వివరాలు (CUET PG 2026 Application Fee Details)

CUET PG 2026 అభ్యర్థులు తమ వర్గానికి అనుగుణంగా రెండు టెస్ట్ పేపర్ల వరకు లేదా అదనపు పేపర్లకి ఈ క్రింద చూపిన ఫీజు చెల్లించాలి.

వర్గం

2 టెస్ట్ పేపర్ల వరకు ఫీజు

అదనపు టెస్ట్ పేపర్ ఫీజు (ఒక్కో పేపర్)

జనరల్

రూ.1,400

రూ.700

EWS / OBC-NCL

రూ.1,200

రూ.600

SC / ST / థర్డ్ జెండర్

రూ.1,100

రూ.600

PwD / PwBD

రూ.1,000

రూ.600

భారతదేశం బయట

రూ.7,000

రూ.3,500

CUET PG 2026 సంప్రదింపు వివరాలు (CUET PG 2026 Contact Details)

CUET PG 2026 దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు వస్తే, అభ్యర్థులు ఈ క్రింది హెల్‌ప్లైన్ నంబర్లు లేదా ఇమెయిల్ ద్వారా NTAని సంప్రదించవచ్చు:

  • 011 - 40759000
  • 011 - 69227700
  • helpdesk-cuetpg@nta.ac.in

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

/news/cuet-pg-2026-registration-last-date-apply-now-76753/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top