EMRS Recruitment 2023: 4062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పోస్టులు, పూర్తి వివరాలు ఇవే
EMRS రిక్రూట్‌మెంట్ 2023 (EMRS Recruitment 2023):
నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ దేశంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో (EMRS) టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి (EMRS Recruitment 2023) దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 4062 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో ప్రిన్సిపాల్, పీజీటీ టీచర్లు, అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి. ఆ అర్హతలు అనుగుణంగా అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం.
| EMRS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ |
|---|
EMRS రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (EMRS Recruitment 2023 Details)
EMRS రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.
| కండక్టింగ్ బాడీ | ట్రైబల్ స్టూడెంట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ |
|---|---|
| పోస్టు పేరు | టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు |
| మొత్తం ఖాళీలు | 4062 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 31 జూలై 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | https://recruitment.nta.nic.in |
EMRS రిక్రూట్‌మెంట్ ఖాళీల వివరాలు (EMRS Recruitment 2023 Vacancy)
EMRS రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఖాళీలు మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
|---|---|
| EMRS ప్రిన్సిపాల్ | 303 |
| EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ | 2266 |
| EMRS అకౌంటెంట్ | 361 |
| EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 759 |
| EMRS ల్యాబ్ అటెండెంట్ | 373 |
| మొత్తం ఖాళీలు | 4062 |
EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (EMRS Recruitment 2023 Eligibility)
EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు అన్ని పోస్ట్‌లకు వివరంగా ఈ దిగువున ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు తప్పనిసరిగా EMRS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలను పరిశీలించి దానికనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.- ప్రిన్సిపాల్ పోస్టులు బీఈడీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 50 ఏళ్లు మించకూడదు.
- పీజీటీ పోస్టులకు బీఈడీతో పాటు పీజీ పాసై ఉండాలి. వయస్సు 40 ఏళ్లు మించకూడదు.
- అకౌంటెంట్ పోస్టులు డిగ్రీ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
- జేఎన్ఏ పోస్టులకు సీనియర్ సెకండరీ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు పదో తరగతి లేదా ఇంటర్ పాసై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రిన్సిపాల్ పో స్టులు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1500, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.1000లు చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌లో కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















