TS LAWCET 1st Phase Seat Allotment 2023: మొదటి రౌండ్ TS LAWCET సీట్ల కేటాయింపు తర్వాత ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ?
తెలంగాణ లాసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ (TS LAWCET 1st Phase Seat Allotment 2023):
తెలంగాణ లాసెట్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్ సీట్లను గురువారం అంటే నవంబర్ 30వ తేదీన కేటాయించడం జరిగింది. ఫేజ్ 1 కోసం తమ సీట్ల కేటాయింపు ఫలితాలను (TS LAWCET 1st Phase Seat Allotment 2023 ) చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) TS LAWCET 2023 సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో lawcetadm.tsche.ac.in రిలీజ్ చేసింది. సంబంధిత లింక్‌ను యాక్టివేట్ చేసింది. ఎల్ఎల్‌బీలో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు సీట్ల కేటాయింపు ఆర్డర్‌లో వారి పేర్లు ఉన్నాయో? లేదో? తెలుసుకోవచ్చు. సీటు కేటాయింపు జాబితాను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 ఉన్నాయి. ఈ సీట్ల కోసం 12,835 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో 5,912 మందికి సీట్లు దక్కాయి. ఇంకా 982 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల కోసం ఫేజ్ 2 సీట్ల కేటాయింపు జాబితా విడుదలవుతుంది. ఈ సీట్లు కోసం దరఖాస్తుదారులు ఎదురుచూడవచ్చు.
తెలంగాణ లాసెట్ 2024 సీట్ల కేటాయింపు వివరాలు (TS Lawset 2024 Allotment of LACET 2024 Seats)
తెలంగాణ లాసెట్ 2024 సీట్ల భర్తీ, ఇంకా ఖాళీగా ఉన్న వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| కోర్సు | మొత్తం సీట్లు | ఇప్పటికే భర్తీ అయినవి |
|---|---|---|
| ఎల్‌ఎల్ఎం (ఐదేళ్లు) | 4,064 | 3,589 |
| ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు) | 1,903 | 1,579 |
| ఎల్ఎల్ఎం | 927 | 744 |
| మొత్తం | 6,894 | 5,912 |
మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తైన తర్వాత TS LAWCET రెండో దశ సీట్ల కేటాయింపును అధికారులు నిర్వహిస్తారు. అయితే ఈ దిగువున తెలిపిన అర్హతలున్న అభ్యర్థులు TS LAWCET సీటు కేటాయింపు 2023 రెండో రౌండ్‌కు అర్హులు.
- మొదటి రౌండ్‌లో సీట్లు కేటాయించిన అభ్యర్థులు, కానీ అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీని మార్చుకోవాలనుకున్నవారు.
- మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించలేకపోయిన అభ్యర్థులు.
- మొదటి దశ కౌన్సెలింగ్‌కు పిలిచిన పొల్గనని అభ్యర్థులు
- సీట్లు కేటాయించిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయలేకపోయిన వారు.
- మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు రద్దు చేసుకున్న అభ్యర్థులు.
ఇప్పటికే మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్ 6వ తేదీలోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















