
స్వాతంత్ర దినోత్సవం 2023 చరిత్ర (Independence Day history in Telugu): ఆగస్ట్ 15వ తేదీన భారత దేశమ మాత్రమే కాకుండా మరో ఆరు దేశాలు కూడా స్వాతంత్రం పొందాయి. వేర్వేరు సంవత్సరాల్లో అయినప్పటికీ వాటికి స్వేచ్ఛ లభించింది ఆగస్ట్ 15వ తేదీరోజునే. ఆ దేశాలు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, బహ్రెయిన్, కాంగో, లిచెన్‌స్టెయిన్, భారతదేశం. ఇప్పటికే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు అయ్యాయి. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు 200 ఏళ్ల పాటు పాలించారు. వారి నుంచి మనకు స్వాతంత్రం అంత తేలికగా రాలేదు. ఎంతో మంది వీరుల పోరాటాలు, త్యాగాలతోనే అది సాధ్యం అయింది.
భారత దేశ స్వాతంత్ర పోరాటం గురించి చాలా చెప్పుకోవాలి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా దేశం నిలిచిన మన దేశం విముక్తి పొందటానికి దారితీసిన ముఖ్యమైన సంఘటనల గురించి ఇక్కడ అందజేశాం.
ఆగస్ట్ 15, 1947: చారిత్రక వాస్తవాలు (August 15, 1947: Historical facts)
భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం 1857లో ప్రారంభమైంది. ఆ చారిత్రక ఘట్టం 1857 తిరుగుబాటుగా పేర్కొనబడింది. అయితే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ఈ తిరుగుబాటును బ్రిటిష్ వాళ్లు అణచివేశారు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు స్వరాజ్యం కోసం భారతదేశ ప్రజలు ఏకమయ్యారు. అందరిలోొ స్వరాజ్యం కాంక్ష పెరిగింది. ఆ సమయంలోనే బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమం, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇతర సామూహిక నిరసనలు ముమ్మరంగా సాగాయి. 1942లో 'క్విట్ ఇండియా' స్వాతంత్య్ర ఉద్యమం సద్దుమణిగిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ వచ్చే వరకు ప్రముఖ ఉద్యమం జరగలేదు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన 40,000 మంది సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు కవాతు చేశారు. ఈ వార్త దావాణంలా వ్యాపించింది. బ్రిటీష్ వాళ్ల వెన్నులో ఒణుకు పుట్టించింది. దీంతో బ్రిటిష్ సైన్యం, నావికాదళంలో పనిచేస్తున్న 25 లక్షల మంది భారతీయుల్లో చైతన్యం పెరిగింది. తిరుగుబాటు ప్రారంభమైంది. బ్రిటీష్ దళాలలో పనిచేస్తున్న భారతీయులు స్వాతంత్రం కోసం చేసిన ఈ తిరుగుబాటును 1946 నాటి నౌకాదళ తిరుగుబాటు అని పిలుస్తారు. లక్షలాది మంది సామాన్య ప్రజలు తమ మాతృభూమికి స్వాతంత్రం కోరుతూ వీధుల్లోకి వచ్చారు. ఆ ప్రజా పోరాటాలు, ఉద్యమాలతో బ్రిటిష్ పాలకులు సతమతం అయ్యారు. ఎలాగైనా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించారు. కానీ ఫలించలేదు.
అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటీష్ పాలకులపై తీవ్ర ప్రభావం పడింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల కూటమి విజయం సాధించినప్పటికీ మిత్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ కొంత బలహీనపడింది. మర ోవైపు మన దేశంలోని స్వతంత్ర పోరాటం మరింత ఉధృతమైంది. ఈ దిశలో బ్రిటీష్ వారు దేశాన్ని విడిచి వెళ్లక తప్పలేదు. ఈక్రమంలో బ్రిటిష్ వారు క్యాబినెట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. మన దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
ఫిబ్రవరి 20, 1947న అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ జూన్ 1948 నాటికి బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచిపెడతారని ప్రకటించారు. భారత స్వాతంత్ర బిల్లు జూలై 4, 1947న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టబడింది. ఆ బిల్లులు 15 రోజులలో ఆమోదించబడింది. విభజన విషాద సంఘటన తర్వాత భారతదేశం చివరకు ఆగస్టు 15, 1947న స్వాతం్రతం పొందింది.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆరోజున ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్‌పై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.
ఇది కూడా చదవండి |
స్వాతంత్ర పోరాటంలో చదువు పాత్ర |
---|
ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు |
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖోని చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్కి సంబంధించినది పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ . మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



