
కడప అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2023 (Kadapa Anganwadi Jobs 2023): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల (Kadapa Anganwadi Jobs 2023) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 56 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం మహిళల మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. ఈ పోస్టులకు అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు మే 03వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.
కడపలో అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య (Total Number of Anganwadi Posts in Kadapa)
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో మొత్తం 56 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఖాళీల వివరాలు ఈ దిగువ టేబుల్లో అందజేశాం.పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
---|---|
అంగన్ వాడీ వర్కర్ | 12 |
అంగన్ వాడీ హెల్పర్ | 40 |
మినీ అంగన్ వాడీ వర్కర్ | 4 |
కడపలోని అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Eligibility Details to Kadapa Anganwadi Jobs)
కడపలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
- కచ్చితంగా వివాహితై ఉండాలి
- పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు kadapa.ap.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలను దరఖాస్తు ఫార్మ్‌లో పూరించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలని జత చేసి దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి అప్లికేషన్‌లు అందజేయాలి. లేదా పోస్టులో పంపించాలి.
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



