కర్నూలులో డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు, ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

manohar

Updated On: November 18, 2025 02:10 PM

క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలుకు చెందిన డిగ్రీ కాలేజీలలో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నవంబర్ 17 నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నవంబర్ 22 నుండి 24 వరకు అసలు సర్టిఫికెట్లతో కళాశాలలను సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చు.

Spot admissions into degree courses in Kurnool government collegesSpot admissions into degree courses in Kurnool government colleges

డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం (Degree spot admissions begin): క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలుకు అనుబంధంగా ఉన్న కేవార్‌ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్స్‌లో మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తులు నవెంబరు 20 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలకు నవెంబరు 22 నుంచి 24 వరకు హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో చాలామంది విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

అకడమిక్ సంవత్సరం ఇప్పటికే ప్రారంభదశలో ఉండటంతో ఇంకా సీట్లు వచ్చే అవకాశాలు అరుదుగా ఉంటాయని రిజిస్టర్ జీ . శ్రీనివాస్ గుర్తుచేశారు. అందుకే విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు ఈ అవకాశం తప్పక వినియోగించుకునేలా సూచించారు. సైన్స్, ఆర్ట్స్ మరియు కామర్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నందున ఇది అన్ని రకాల విద్యార్థులకు మంచి అవకాశం అని యూనివర్సిటీ అధికారులు చెప్పారు.

క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలులో డిగ్రీ కాలేజీల స్పాట్ అడ్మిషన్లు ,ఖాళీ సీట్లు పూర్తి వివరాలు (Complete details of spot admissions and vacant seats in degree colleges at Cluster University Kurnool)

స్పాట్ అడ్మిషన్ల ద్వారా కేవార్‌ ఉమెన్స్ కాలేజ్ మరియు మెన్స్ డిగ్రీ కాలేజ్‌లో లభ్యమయ్యే ఖాళీ సీట్లు ఇలా ఉన్నాయి.

KVR గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఖాళీ సీట్లు (KVR Government Women's College Vacant Seats)

ఈ మహిళా కళాశాలలో విభాగాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు వివరాలు క్రింద ఉన్నాయి.

విభాగం పేరు

ఖాళీ సీట్లు

బయోటెక్నాలజీ

7

బయోకెమిస్ట్రీ

24

బోటనీ

4

ఆర్గానిక్ కెమిస్ట్రీ

4

హోమ్ సైన్సెస్

9

కంప్యూటర్ సైన్స్

46

గణితం

17

ఫిజిక్స్

28

జూవాలజీ

23

బీకాం జనరల్

7

హిస్టరీ

26

ఎకనామిక్స్

15

పాలిటికల్ సైన్స్

46

స్పెషల్ ఇంగ్లీష్

50

స్పెషల్ తెలుగు

13

స్పెషల్ ఉర్దు

31

మొత్తం

350

గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్స్ ఖాళీ సీట్లు (Government Degree College for Men Vacant Seats)

పురుషుల డిగ్రీ కళాశాలలో విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి

విభాగం పేరు

ఖాళీ సీట్లు

హిస్టరీ

6

ఎకనామిక్స్

23

పాలిటికల్ సైన్స్

34

స్పెషల్ ఇంగ్లీష్

20

బీకాం కంప్యూటర్స్

18

బీకాం అకౌంటింగ్

23

కంప్యూటర్ సైన్స్

21

గణితం

10

స్టాటిస్టిక్స్

6

ఫిజిక్స్

23

కెమిస్ట్రీ

24

బోటనీ

22

జూవాలజీ

26

ఆర్గానిక్ ఫార్మింగ్

17

మొత్తం

273

స్పాట్ అడ్మిషన్లకు ముఖ్య సూచనలు (Important instructions for spot admissions)

కళాశాలలో అడ్మిషన్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

  • విద్యార్థులు నవంబర్ 22 నుండి 24 మధ్య సంబంధిత కళాశాలకు వ్యక్తిగంగా హాజరవాలి.
  • అసలు సర్టిఫికెట్లు (TC, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికెట్ మొదలైనవి) తప్పనిసరిగా తీసుకురావాలి.
  • దరఖాస్తు నవంబర్ 20లోపు సమర్పించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిషన్ అవకాశం ఉంటుంది.
  • సీట్ లభ్యత ఆధారంగా అడ్మిషన్లు “ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్” విధానంలో నిర్వహిస్తారు.
  • అడ్మిషన్ సమయంలో కళాశాల నిర్దేశించిన ఫీజులు చెల్లించాలి.
  • రిజర్వేషన్ నియమాలు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
  • ఏదైనా పత్రాలు తప్పుడు లేదా లోపించినట్లయితే అడ్మిషన్ నిరాకరించబడవచ్చు.
  • సంబంధిత విభాగంలోని సీట్లు పూర్తయ్యిన వెంటనే అడ్మిషన్లు మూసివేయబడతాయి.

స్పాట్ అడ్మిషన్లు మీరు కోరుకున్న కోర్సులో చేరుకునే మంచి అవకాశం. ఖాళీ సీట్లు పరిమితంగా ఉన్నాయనుకునే, అర్హులైన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించి సమయానికి అడ్మిషన్ పూర్తి చేసుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/kurnool-degree-colleges-spot-admissions-vacant-seats-2025-74208/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy