
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్ల ఫలితాలు 2023 (KVS 1st Class Result 2023):
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన మొదటి రౌండ్ లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. కేవీల్లో ఒకటో తరగతి (KVS 1st Class Result 2023) అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో చేపట్టారు. కేవీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు ఆ ఫలితాలను కేవీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఒకటో తరగతి ఆన్‌లైన్ అడ్మిషన్ల 2023-24 జాబితా గురువారం అంటే ఏప్రిల్ 20, 2023న అందుబాటులోకి వచ్చింది. ఆ జాబితాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పేర్లను పొందుపరచడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను ఆ జాబితాను సంబంధిత అధికారిక వెబ్‌సైట్
kvsonlineadmission.kvs.gov.in
లోకి వెళ్లి చూడవచ్చు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ దిగువున అందజేశాం.
KVS ఫలితాల 2023 డైరక్ట్ లింక్ |
---|
KVS ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ 17 ఏప్రిల్ 2023న ముగిసింది. సంబంధిత ఫలితాలను ఏప్రిల్ 20, 2023 రాత్రి 7 గంటలకు విడుదల చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి రాష్ట్రం, పాఠశాల పేరు నమోదు చేసి తమ పిల్లలకు అడ్మిషన్ దొరికిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
కేవీఎస్ లాటరీ రౌండ్ ఫలితాలు 2023 ముఖ్యమైన వివరాలు (KVS Lottery Round 1 Result Important Details)
కేంద్రీయ విద్యాలయాల్లో 2023 ఒకటో తరగతి అడ్మిషన్ల ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున చూడండివిద్యా సంస్థ పేరు | కేంద్రీయ విద్యాలయ సంఘటన్ |
---|---|
తరగతి | ఒకటో తరగతి |
అడ్మిషన్ సెషన్ | 2023-24 |
రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ | 17 ఏప్రిల్, 2023 |
ఫలితాల విడుదల | 20 ఏప్రిల్, 2023 |
అధికారిక వెబ్‌సైట్ | kvsonlineadmission.kvs.gov.in |
కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (How to check the KVS Class 1 Admission lottery result 2023?)
అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో KVS ఒకటో తరగతి అడ్మిషన్ ఫలితం 2023ని చెక్ చేయడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.inని సందర్శించాలి.
- హోంపేజీలోని 'Announcements' సెక్షన్‌లోకి వెళ్లి 'KVS Class 1 Admission Result 2023' లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రం, కేంద్రీయ విద్యాలయం పేరు ఇచ్చి 'Search'పై క్లిక్ చేయాలి.
- తర్వాత అడ్మిషన్లు పొందింన PDF జాబితాలు కనిపిస్తాయి.
- ఏ కేటగిరి ప్రకారం అప్లై చేసుకున్నారో దాని ప్రకారం లిస్ట్‌లు ఉంటాయి
- ఆ కేటగిరి లిస్ట్‌ని ఓపెన్ చేసి అందులో మీ పిల్లల పేర్లు ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు.
- ఆ లిస్ట్‌ని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



