Navodaya Exam Results 2023 Out: నవోదయ ఆరో తరగతి ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2023 (Navodaya Exam Results 2023 Out):
నవోదయ ఆరో తరగతి ప్రవేశాల ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు 2023 (Navodaya Exam Results 2023 Out) జూన్ 21, 2023న విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. నవోదయ విద్యాలయ సమితి ఫలితాలను వెబ్‌సైట్
www.navodya.gov.in
లో విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వివరాలతో లాగిన్ అయి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున డైరక్ట్ లింక్ అందించడం జరిగింది. దాానిపై క్లిక్ చేసి తమ ఫలితాలను చూడొచ్చు.
| నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు-డౌన్‌లోడ్ లింక్ |
|---|
నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2023 వివరాలు (Navodaya Vidyalaya 6th Class Entrance Test 2023 Details)
నవోదయ విద్యాలయ ఆరో గరతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
| అథారిటీ పేరు | నవోదయ విద్యాలయ సమితి |
|---|---|
| పరీక్ష పేరు | జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ |
| తరగతి | ఆరో తరగతి |
| JNVST ఆరో తరగతి ఎగ్జామ్ డేట్ | 29 ఏప్రిల్ 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | navodaya.gov.in |
JNVST 6వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check JNVST 6th Class Result 2023)
అభ్యర్థుల ఆరో తరగతి ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ముందుగా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- JNVST Class 6 Result 2023 Download Linkని ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రోల్ నెంబర్, పుట్టిన తేదీని షేర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- తర్వాత స్క్రీన్‌పై ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఎంపిక జాబితా 2023 PDFని కనిపిస్తుంది.
- ఆ పీడీఎఫ్ ఫైల్‌ని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
నవోదయ ఆరో తరగతి ఫలితాల కార్డుపై ఉండే వివరాలు (Details on Navodaya Result 2023 6th Class)
నవోదయ ఆరో తరగతి ఫలితాల కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- బ్లాక్ కోడ్
- సెంటర్ కోడ్
- పేరు
- రోల్ నెంబర్
- కేటగిరి
- జెండర్
- ప్రాంతం
- పుట్టిన తేదీ
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















