
నీట్ యూజీ 2023 ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ (NEET UG 2023 Exam City Intimation Slip):
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET సిటీ స్లిప్ 2023ని (NEET UG 2023 Exam City Intimation Slip) ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. సిటీ స్లిప్‌లు విడుదల చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువన అందించడం జరుగుతుంది. సాధారణంగా NEET UG 2023 పరీక్ష సిటీ స్లిప్ పరీక్షకు 15 నుంచి 20 రోజుల ముందు విడుదల చేయబడుతుంది. తద్వారా విద్యార్థులు తదనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 అభ్యర్థులు యాక్సెస్ చేయడానికి వారి డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ని నమోదు చేయాలి. అధికారులు పరీక్షకు 5, 6 రోజుల ముందు నీట్ అడ్మిట్ కార్డ్ 2023ని విడుదల చేస్తారు.
NEET సిటీ అలాట్‌మెంట్ 2023 ద్వారా విద్యార్థులు తమకు పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన నగరం పేరును తెలుసుకుంటారు. నీట్ 2023 పరీక్ష మే 7న OMR ఫార్మాట్‌లో నిర్వహించబడుతోంది. NEET సిటీ అలాట్‌మెంట్ 2023 స్లిప్‌లో అభ్యర్థికి కేటాయించిన నగరం మాత్రమే ఉంటుంది. పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు అడ్మిట్ కార్డ్‌లో హైలైట్ చేయబడతాయి.
NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 డైరెక్ట్ లింక్ ( NEET City Intimation Slip 2023 Direct Link (To Be Added Soon)
అధికారులు లింక్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత NEET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. పరీక్ష నగర కేటాయింపును చెక్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు ID, పుట్టిన తేదీ వివరాలను దగ్గర ఉంచుకోవాలి.నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 డైరక్ట్ లింక్ |
---|
NEET సిటీ కేటాయింపు 2023 విడుదల తేదీ, సమయం (NEET City Allotment 2023 Release Date and Time)
ఈ దిగువన అభ్యర్థి NEET నగర కేటాయింపు 2023 విడుదల తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు.
ఈవెంట్ | డేట్ |
---|---|
నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 విడుదల తేదీ | త్వరలో |
అడ్మిట్ కార్డు విడుదల | పరీక్షకు ఐదు రోజుల ముందు |
ఎగ్జామ్ డేట్ | మే 07, 2023 |
నీట్ సిటీ అలాట్‌మెంట్ 2023 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download NEET City Allotment 2023)
NEET సిటీ అలాట్‌మెంట్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది విధానాన్ని ఫాలో అవ్వాలి.1 | neet.nta.nic.in నీట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. లేదా సిటీ ఇంటిమేషన్ స్లిప్ కోసం ఈ పేజీలో ఇచ్చిన డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి |
---|---|
2 | అధికారిక వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత, హోమ్‌పేజీలో ‘Candidate Activity' సెక్షన్‌లోకి వెళ్లాలి. |
3 | తర్వాత డౌన్‌లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్‌పై క్లిక్ చేయాలి |
4 | NEET దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి |
5 | పరీక్ష నగరం పేరు ఉన్న స్క్రీన్‌పై సిటీ స్లిప్ కనిపిస్తుంది |
NEET అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 ప్రింటవుట్ తీసుకోవడం తప్పనిసరి కాదు, ఎందుకంటే ఇది కేవలం పరీక్ష నగర కేటాయింపును తెలుసుకోవడానికి సూచనగా ఉపయోగించబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



