NTPC Recruitment 2023: NTPCలో 495 ఉద్యోగాలు, నెలకు లక్షా 40 వేల జీతం, పూర్తి వివరాలివే
NTPC రిక్రూట్‌మెంట్ 2023 (NTPC Recruitment 2023):
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ GATE 2023 స్కోర్ ద్వారా ఇంజనీరింగ్‌లోని వివిధ శాఖలలో 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) ఖాళీల కోసం ప్రకటించింది. గేట్ 2023 ద్వారా NTPC రిక్రూట్‌మెంట్ (NTPC Recruitment 2023) కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 20 అక్టోబర్ 2023 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఆర్టికల్ దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం NTPC రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు, ప్రముఖ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ మొదలైన వివిధ ఇంజనీరింగ్ రంగాలలో డిగ్రీలు ఉన్న అభ్యర్థులు NTPC లిమిటెడ్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెంట్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
| NTPC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం - ఇక్కడ క్లిక్ చేయండి |
|---|
NTPC రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (NTPC Recruitment 2023 Details )
NTPC రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన వివరాలు ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| పోస్టుల పేరు | పోస్టుల సంఖ్య |
|---|---|
| ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (ఎలక్ట్రికల్) | 120 |
| ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (మెకానికల్) | 200 |
| ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) | 80 |
| ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (సివిల్) | 30 |
| ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు (మైనింగ్) | 65 |
| మొత్తం | 495 |
సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2023 అర్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కనీసం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 20.10.2023 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను అకడమిక్ మార్కులు, గేట్-2023 స్కోరు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టుల్లో చేరిన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందించడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















