
తెలంగాణ గురుకుల ఉద్యోగాల కోసం ఓటీఆర్ ప్రక్రియ (TS Gurukul Recruitment OTR 2023):
తెలంగాణలో గురుకులాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు (TS Gurukul Recruitment OTR 2023) ఓటీఆర్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఖాళీగా ఉన్న మొత్తం 9231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఓటీఆర్ ప్రాసెస్ మొదలైంది. అంటే కేటగిరి వారీగా ఏప్రిల్ 17, 2023వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులకే దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఓటీఆర్ నమోదు ఎలా చేసుకోవాలనే విషయం ఈ ఆర్టికల్లో అందజేశాం. అభ్యర్థులు ఇక్కడ నుంచి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను తెలుసుకోవచ్చు.
ఓటీఆర్ కోసం డైరక్ట్ లింక్ |
---|
తెలంగాణ గురుకుల 2023 ఉద్యోగాల పూర్తి వివరాలు (TS Gurukulam jobs 2023 Details)
తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 9 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.ఉద్యోగం | పోస్టుల సంఖ్య |
---|---|
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 1276 |
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ | 2008 |
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) | 4020 |
లైబ్రేరియన్ స్కూల్ | 434 |
పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ | 275 |
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ | 134 |
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
మ్యూజిక్ టీచర్స్ | 124 |
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ | 868 |
TS గురుకులం ఉద్యోగాల కోసం OTR రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? (How to OTR Registration for TS Gurukulam Jobs)
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఖాళీగా ఉన్న మొత్తం 9231 పోస్టులను భర్తీ చేయడానికి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఓటీఆర్ ప్రాసస్ ఇక్కడ ప్రారంభమైంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది.
- ముందుగా అభ్యర్థులు https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- హోంపేజీలో One Time Registration/ APPLY ONLINE అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇప్పటీకే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయినవాళ్లు ఓటీఆర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చ ఎంటర్ చేసిన లాగిన్ అవ్వాలి
- ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్లు New Registration అనే దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆ దరఖాస్తు ఫార్మ్‌లో అడిగిన విధంగా అభ్యర్థులు తమ వివరాలు పూరించాలి
- చివరిగా ఫోటో, సిగ్నేచర్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- దీంతో ఓటీఆర్ ఐడీ క్రియేట్ అవుతుంది.
- తర్వాత ఓటీఆర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
- అనంతరం అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.
అయితే TREIRB IDని పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు పూరించే సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అభ్యర్థులు చేసిన తప్పులకు కమిషన్ బాధ్యత వహించదు. చాలా జాగ్రత్తగా ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



