Post Office Recruitment 2023: పోస్టాఫీసులో 1899 ఉద్యోగాలు, పదో తరగతి, ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, ఆ అర్హత కూడా కచ్చితంగా ఉండాల్సిందే
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 (Post Office Recruitment 2023):
ఇండియా పోస్ట్, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పోస్టల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ (Post Office Recruitment 2023) డ్రైవ్‌లో భాగంగా 1899 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి అంటే నవంబర్ 10 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 09, 2023 లాస్ట్‌డేట్. దరఖాస్తు ఫీజు కూడా ఈలోపే చెల్లించాల్సి ఉంది. కరెక్షన్ విండో డిసెంబర్ 10న ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 14, 2023న క్లోజ్ అవుతుంది. అయితే ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడండి.
| పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ |
|---|
| పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ అప్లై లింక్ |
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు (India Post Office Recruitment 2023 Overview)
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| రిక్రూట్‌మెంట్ బాడీ | డిపార్ట్‌మెంట్ పోస్టులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా |
|---|---|
| పోస్టు పేరు | పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ |
| ఖాళీలు | 1899 |
| జాబ్ లోకేషన్ | ఆల్ ఇండియా |
| దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | నవంబర్ 10, 2023 |
| దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | డిసెంబర్ 09, 2023 |
| అప్లై మోడ్ | ఆన్‌లైన్ |
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలు (India Post Office Recruitment 2023 Vacancy Details)
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1899 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.| పోస్టల్ అసిస్టెంట్ | 598 |
|---|---|
| సార్టింగ్ అసిస్టెంట్ | 143 పోస్టులు |
| పోస్ట్‌మాన్ | 585 |
| మెయిల్ గార్డ్ | 3 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 570 పోస్టులు |
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు (India Post Office Recruitment 2023 - Eligibility)
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థులకు ఎటవంటి అర్హతలుండాలో ఈ దిగువున అందించడం జరిగింది.- అభ్యర్థులు పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.
- అభ్యర్థుల వయసు ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100లు డిసెంబర్ 09, 2023లోపు చెల్లించాలి.
పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్‌కు ఎలా అప్లై చేసుకోవాలి? (How to Apply for India Post Recruitment)
పోస్టాఫీస్ పోస్టులకు అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు "https://dopsportsrecruitment.cept.gov.in"ని సందర్శించాలి.
- హోంపేజీలో పైన Application Stage 1 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ వివరాలు అంటే పేరు, మొబైల్ నెంబర్, తల్లిదండ్రుల పేర్లు, కేటగిరి వంటి వివరాలు ఇచ్చి Submit చేయాలి.
- తర్వాత హోంపేజీలో పైన Application Stage 2 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- వెంటనే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ పూర్తి వివరాలు నమోదు చేయాలి.
- అనంతరం తగిన డాక్యుమెంట్లను, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















