JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 మార్కులు మంచి స్కోరేనా?JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 మార్కులకు అంచనా పర్సంటైల్ (Predicted Percentile for 110 Marks in JEE Main 2026 Session 1) : మీరు JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 మార్కులు పొందితే సాధారణంగా మంచి స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ మార్కులతో మీ పర్సంటైల్ 91 నుంచి 96 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మీ పర్సంటైల్ కానీ, ర్యాంకు కానీ పేపర్ క్లిష్టత స్థాయి, నార్మలైజేషన్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం పేపర్ మధ్యస్థంగా ఉంటే 110 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థి సుమారు 98,250 లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్‌తో సుమారు 93 శాతం కంటే ఎక్కువ పర్సంటైల్‌ని పొందే ఛాన్స్ ఉంది. ఒక వేళ పేపర్ కఠినంగా ఉంటే ఈ ర్యాంకు స్థితి కూడా మారుతుంది. అంటే 55.500ల కంటే ఎక్కువ ర్యాంకు, 96.3 కంటే ఎక్కువ పర్సంటైల్‌ని పొందే అవకాశం ఉంది. ఈ స్కోర్‌తో ఏ ఐఐటీల్లో ప్రవేశ అవకాశాలుంటాయనే విషయాన్ని ఇక్కడ వివరంగా అందించాం.
JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 మార్కులకు అంచనా పర్సంటైల్ - CollegeDekho (Expected Percentile Prediction for 110 Marks in JEE Main 2026 Session 1by CollegeDekho)
మీ షిఫ్ట్ సులభంగా, మోడరేట్‌గా లేదా కష్టంగా అనిపించినా JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 స్కోరు మంచి స్కోర్‌గానే పరిగణింపబడుతుంది. అయితే ఈ స్కోర్‌కి పర్సంటైల్, ర్యాకులు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ దిగువున మీకోసం పరీక్ష క్లిష్టత స్థాయిని బట్టి ప్రసంటైల్, ర్యాంకులను అంచనాగా అందించాం.
పేపర్ కష్టంగా ఉంటే 110 మార్కులకి పర్సంటైల్ 96.3 కంటే ఎక్కువ పొందే ఛాన్స్ ఉంది. అలాగే. ర్యాంకు 55,500 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
పేపర్ సులభంగా ఉంటే 110 మార్కులకి 91.55 కంటే ఎక్కువ పర్సంటైల్, ర్యాంకు 126,500 కంటే ఎక్కువ ర్యాంకు వచ్చే ఛాన్స్ ఉంది.
పేపర్ మోడరేట్‌గా ఉంటే 110 మార్కులకి 98,250 కంటే ఎక్కువ ర్యాంకు, 93.45 కంటే ఎక్కువ పర్సంటైల్ పొందే అవకాశం ఉంది.
ప్రవేశ అవకాశాలు
110 మార్కులతో 55 వేల నుంచి లక్షా 26 వేల మధ్యలో ర్యాంకులు వచ్చే అభ్యర్థులకు దిగువ లేదా మధ్య స్థాయి NITలు , కొత్త IIITలు, అనేక GFTIల్లో ప్రవేశాల పొందే అవకాశం ఉంది. మీరు ఈ ఇనిస్టిట్యూట్‌లలో సివిల్, మెకానికల్, కెమికల్, ప్రొడక్షన్, మెటలర్జీ లేదా బయోటెక్నాలజీ వంటి బ్రాంచ్‌ల్లో సీట్లు వచ్చే ఛాన్స్ కూడా గణనీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని మంచి మంచి ఐఐటీల్లో సీట్లు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 మార్కులకు సబ్జెక్ట్ నిపుణుడిచే పర్సంటైల్, ర్యాంక్ అంచనా (Percentile and Rank Prediction for 110 Marks in JEE Main 2026 Session 1 by Subject Expert)
JEE మెయిన్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు గైడెన్స్ అందించి, మంచి గైడెన్స్‌ని అందించే సబ్జెక్ట్ నిపుణుడు Sakunth Kumar ప్రకారం, JEE మెయిన్ సెషన్ 1, 2026లో మొత్తం 110 చెప్పుకోదగ్గర స్కోర్ కాకపోయినా మంచి స్కోర్‌గానే చూడవచ్చన్నారు. ఈ స్కోర్ కానీ అంచనా పర్సంటైల్, ర్యాంకులతో కానీ విద్యార్థులు మంచి విద్యా సంస్థల్లో తమకు నచ్చిన కోర్సుల్లో సీటు పొందవచ్చని అన్నారు.
జేఈఈ మెయిన్‌లో 110 మార్కులకి వచ్చే పర్సంటైల్, అంచనా ర్యాంకులు, సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం JEE మెయిన్ 2026 సెషన్ 1లో 110 స్కోరు మంచి రిజల్ట్‌గానే చూడవచ్చు. అలాగే ఈ స్కోర్, పర్సంటైల్, ర్యాంకులతో విద్యార్థులు చాలా సేఫ్‌గా సీటు కోసం ప్రయత్నించవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.














