SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 విడుదల

manohar

Updated On: June 03, 2025 11:47 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025,క్లర్క్ (జూనియర్ అసోసియేట్) మైన్స్ ఫలితాలు జూన్ 1, 2025న విడుదల చేసింది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ ఫలితాలను SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం(SBI Clerk Mains Results 2025 Released)ఇక్కడ చూడండి.

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 విడుదలSBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 విడుదల

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2025 విడుదల (SBI Clerk Mains Results 2025 Released): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టుల కోసం నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు 2025 విడుదలయ్యాయి. ఈ ఫలితాన్ని SBI అధికారిక వెబ్‌సైట్‌ (sbi.co.in)లో పరిశీలించవచ్చు.ఈ పరీక్ష ద్వారా దాదాపు 13,732 ఖాళీలకు ఎంపిక(SBI Clerk Mains Results 2025 Released)జరుగుతుంది.విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ద్వారా లాగిన్ అయి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఫలితాలు వచ్చిన తర్వాత, భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT) ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతాయి.ఈ దశలన్నీ పూర్తయ్యాకే తుది నియామకం జరుగుతుంది.

SBI క్లర్క్ మెయిన్స్ 2025 ఫలితాన్ని ఎలా చెక్ చేయాలి?(How to check SBI Clerk Mains 2025 result?)

  • ముందుగా అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in ను సందర్శించండి.
  • ఆ తరువాత హోమ్‌పేజీలో "Careers" సెక్షన్‌పై క్లిక్ చేయండి.
  • . "Current Openings" లోకి వెళ్లి, "Recruitment of Junior Associates (Customer Support & Sales)" లింక్‌ను ఎంచుకోండి.
  • "SBI Clerk Mains Result 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
  • . మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ,పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.
  • అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన PDF ను కూడా డౌన్‌లోడ్ చేయవచ్చు.

SBI క్లర్క్ మెయిన్స్ 2025 స్కోర్‌కార్డ్‌లో ఉండే వివరాలు(Details to be found in SBI Clerk Mains 2025 Scorecard)

  • అభ్యర్థి పేరు ,రోల్ నంబర్
  • ప్రతి విభాగంలో పొందిన మార్కులు
  • మొత్తం మార్కులు ,కటాఫ్ స్కోర్లు
  • అర్హత స్థితి (Qualifying Status)

SBI క్లర్క్ మెయిన్స్ 2025 తదుపరి దశలు (SBI Clerk Mains 2025 Next Steps)

భాషా ప్రావీణ్యత పరీక్ష (LPT): అర్హత పొందిన అభ్యర్థులు స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్షకు హాజరుకావాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే,ఈ పరీక్షలో పొందిన మార్కులు తుది మెరిట్ లిస్టులో పరిగణించబడవు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: LPT తర్వాత, అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.

తుది నియామకం: అన్ని దశలు పూర్తి చేసిన అభ్యర్థులు తుది నియామకానికి అర్హులు అవుతారు.

SBI క్లర్క్ మైన్స్ ఫలితాలు 2025 ఇప్పటికే విడుదలయ్యాయి. అర్హులైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను వెబ్‌సైట్‌ ద్వారా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. తదుపరి దశల కోసం నిరంతరం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికల కోసం ఇది ఒక కీలకమైన మెట్టు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sbi-clerk-mains-results-2025-released-66920/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy