School Assembly News Headlines for 30 June 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండిజూన్ 30 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 30 June 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
30 జూన్ 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 30 June 2023)
ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు (Andhra Pradesh News)
- విశాఖపట్నంల మరో రియాల్టర్ కుటుంబం కిడ్నాప్‌కు గురయ్యారు. కొంతమంది దుండగులు రియల్టర్ శ్రీనివాస్‌తో పాటుగా అతడి భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
- వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అబద్ధమని అన్నారు.
- ఏపీలోని చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీస్ స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు రిజిస్టర్ అయింది. అందులో టీడీపీ అధినేత చంద్రనాయుడు కూడా ఉన్నారు. ఎస్ఐ తీరుకు వ్యతిరేకంగా రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మహాదేవి, ఆమె భర్త జయశంకర్‌లు నిరసన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వార్తలు (Telangana News)
- తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమ గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
- రాష్ట్రంలోని నానక్‌గూడలో క్రెడాయ్ ఆఫీస్‌ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు.
- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రి హరీశ్ రావు చేసి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. రబ్బర్‌స్టాప్ గవర్నర్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు నచ్చుతారని బండి సంజయ్ అన్నారు.
- హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ దుర్ఘటనలో అక్కడే డ్యూటీ చేస్తోన్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య చనిపోయారు.
జాతీయ వార్తలు (National News)
- ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. గురువారం ఆయన ఘర్షణలకు చెలరేగిన చురాచాంద్‌పూర్ జిల్లాకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మార్గమధ్యలోనే ఆయన కాన్వాయ్‌ను ఆపేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 3న కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుందని అధికారులు గురువారం తెలిపారు. సెప్టెంబరులో జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 3న సమావేశం జరిగే అవకాశం ఉంది.
- బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో కీలకమైన ఆధారాలను సేకరించినట్టు ఆయన చెప్పారు.
- ఢిల్లీ ప్రజలు ఉచితాలకు అలవాటుపడ్డారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.
తెలుగులో ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















