School Assembly News Headlines for 1 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి
జూలై 01, 2023 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
జూలై 01, 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో బాలు పేలుడు జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
- ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనన్నారు.
- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఓ మహిళా పోలీసు నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రసన్న అనే మహిళా పోలీసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోడు పట్టాలన్నింటిని మహిళల పేరు మీదే అందించినట్టు కేసీఆర్ చెప్పారు.
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ అన్నారు.
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ శుక్రవారం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ని సీబీఐ అధికారులు దాఖలు చేశారు.
- పీఎం నరేంద్ర మోదీ తాను సేవకుణ్ణి తప్ప ఓనరుని కాదంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తామే చేస్తున్నామని చెబుతారని ఎద్దేవ చేశారు.
జాతీయ వార్తలు (National News)
- ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హాజరై యూనివర్సిటీకి చెందిన మూడు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో ప్రయాణించారు. సాధారణ ప్రజలతో మాట్లాడారు.
- మణిపూర్‌లో పర్యటిస్తోన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కలసి మాట్లాడిన రాహుల్ గాంధీ వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందన్నారు.
- మణిపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. ప్రచారం కోసమే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నారని అన్నారు.
- మహారాష్ట్రలోని పూణేలో కాంగ్రెస్ నేత రామకృష్ణ మోరెపై విడుదల చేసి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రసంశలు కురిపించారు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















