జూలై 19 స్కూల్ అసెంబ్లీ కోసం ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలను (School Assembly News Headlines for 19 July 2023) ఇక్కడ ఇచ్చాం. తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
School Assembly News Headlines for 19 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండిస్కూల్ అసెంబ్లీ వార్తల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలను (School Assembly News Headlines for 19 July 2023) ఇక్కడ అందజేశాం.
19 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 19 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
- మార్గదర్శి చందాదారులకు ఏపీ హైకోర్టులో ఊరట కలిగింది. చిట్ గ్రూపుల నిలిపివేతకు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
- సుప్రీంకోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గంగిరెడ్డి పిటిషన్‌ను, అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌కు జత చేస్తూ సెప్టెంబర్ రెండో వారానికి విచారణ వాయిదా వేసింది.
- ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆవాల శ్రావణి అనే విద్యార్థిని సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ రావడంతో చెరువులో పడి విద్యార్థిని ప్రాణాలు విడిచింది.
తెలంగాణ వార్తలు (Telangana News)
- జీవీహెచ్‌ఎంసీలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
- బీఆర్ఎస్ కీలక నాయకుడు మహేశ్వరం మాజీ శాసన సభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
జాతీయ వార్తలు (National News)
- పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐఏఎఫ్ మహిళా అధికారిణిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి కత్తితో దాడి చేయడంతో IAF అధికారిణి తీవ్రంగా గాయపడ్డారు.
- బెంగళూరులో మంగళవారం ప్రతిపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పోరాటం ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య కాదని, ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమికి’ బీజేపీ, ఐఎన్‌డీఏ మధ్యే పోరు అని రాహుల్ గాంధీ అన్నారు.
- మొదటి పోస్టింగ్‌లోనే పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ 'రెడ్ హ్యాండెడ్'గా పట్టుబడ్డ జార్ఖండ్ ప్రభుత్వ అధికారి. విచారణ జరుగుతోంది
- ఢిల్లీలో వరదలు కొనసాగుతున్నాయి. దీంతో యమునా నది పొంగి పొర్లుతుంది. నది నీటి మట్టం ఆగ్రాలోని తాజ్ మహల్ గోడలకు చేరుకుంది.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















