
జూలై 05 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 5 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
05 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 5 July 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో సోము వీర్రాజు కొనసాగారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన తప్పుకున్నారు.
- చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఆమూల్ ఆధ్వర్యంలో ఈ పనులు సాగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్తూరు డెయిరీకి జీవం పోస్తున్నామని జగన్ అన్నారు.
తెలంగాణ న్యూస్ (Telangana News)
- జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియమించారు. అదేవిధంగా తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందదర్ బాధ్యతలు చేపట్టారు.
- తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లకు బదిలీ అయింది. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియమించింది.
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మేలు చేసేందుకే అఖిలేస్ యాదవ్‌ను కేసీఆర్ హైదరాబాద్ రప్పించుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్‌గా పనిచేస్తోందన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వార్తలు (National, Inter National News)
- జూలై 4న ఏర్పాటు చేసిన వర్చువల్ SCO సమ్మిట్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాడాలని, ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని ఇతర దేశాలను కోరారు.
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అజిత్ పవార్ జూలై 4న ముంబైలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
- ఒడిశా రైలు ప్రమాదంలో CRS దర్యాప్తులో పెద్ద లోపాలు కనుగొనబడ్డాయి.
- భారత వాతావరణ శాఖ ఇచ్చిన భారీ వర్షాల హెచ్చరిక కారణంగా దక్షిణ, కన్నడలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది.
- ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా తాలిబాన్లు విధించిన నిబంధనల ప్రకారం దేశంలో ఏ బ్యూటీ సెలూన్‌లను మహిళలు నిర్వహించకూడదు.
- ఖలిస్తానీ రాడికల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు.ఇప్పటి వరకు జరిగిన హింసను అమెరికా ఖండించింది.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



