School Assembly News Headlines for 6 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి

Rudra Veni

Updated On: July 05, 2023 06:37 PM

జూలై 06 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
School Assembly News Headlines for 6 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండిSchool Assembly News Headlines for 6 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి

జూలై 06 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

06 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 6 July 2023)

ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)

  • ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.  ఈ సందర్భంగా అక్కడ ఇళ్ల నిర్మాణాలకు సుప్రీకోర్టు అనుమతి ఇచ్చిందా? అని హైకోర్టు ప్రశ్నించింది.
  • మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను బాధితుడుగా చూడాలంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
  • విజయవాడలోని హోటల్ ఐలాపురం దగ్గర ఆందోళన జరిగింది. సోషల్ మీడియా - మహిళలపై దాడి అనే అంశంపై  జరుగుతున్న సెమినార్‌కు టీడీపీ, జనసేప పార్టీ మహిళా నేతలను పోలీసులు అనుమతించలేదు.

తెలంగాణ వార్తలు (Telangana News)

  • తెలంగాణ హైకోర్టులో  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై విచారణ జరిగింది. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
  • తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా తనను నియమించడంపై ఆ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తన నిర్వర్తించిన బాధ్యతలను పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

జాతీయ వార్తలు (National News

  • గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించిన మధ్యప్రదేశ్ వ్యక్తిపై బుల్డోజర్ చర్య తీసుకోవాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు.
  • ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
  • భారతదేశంలో కొత్తగా కోవిడ్ 56 కేసులు గుర్తించబడ్డాయి.
  • మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. అల్లరి మూకలు ఆయుధాలు లూటీ చేయడానికి ప్రయత్నించడంతో మరోసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
  • ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో తుపాకీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాలకు చెందిన లాయర్లు గొడవపడ్డారు. ఆ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-assembly-news-headlines-july-6-2023-42738/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy