School Assembly News Headlines for 7 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండిజూలై 07 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 7 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
07 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 7 Juay 2023)
ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులకు సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణాకు జస్టిస్ అకోక్ అరదేను సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది.
- తిరుమలలో ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై బ్రేక్ దర్శన టికెట్లను ఎక్కువ ధరలకు అంటే రూ.36 వేలకు విక్రయించారు. దీంతో తితిదే ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు అందుపులోకి తీసుకున్నారు.
- గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు.
- బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డాను ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి కలిశారు. తనను ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసినట్టు ఆమె ట్వీట్ చేశారు.
తెలంగాణ వార్తలు (Telangana News)
- తెలంగాణ రాష్ట్రంలో 14,565 ఇంజనీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలు కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి.
- కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం ప్రజలను మోసం చేస్తుందని, రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లను జరుగుతున్నాయని విమర్శించారు.
- నిర్మల్ జిల్లాలోని మామాడ, సారంగాపూర్ మండల కేంద్రాల్లో లబ్దిదారులకు పోడు పట్టాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమురం భీం కలలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని అన్నారు.
జాతీయ వార్తలు (National News)
- మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో చెలరేగిన ఘర్షలను భద్రతా బలగాలు అదుపు చేశాయి.
- కేరళలో భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు ఎల్లో, ఆరేంజ్ హెచ్చరికలను జారీ చేసింది. గోవాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
- భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 1,452 క్రియాశీల కోవిడ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
- జమ్మూకశ్మీర్‌లో జాతీయ గీతాన్ని అవమానించినందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- మూత్ర విసర్జన ఘటనలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ స్పందించారు. బాధితుడి కాళ్లు కడిగి, క్షమాపణలు కోరారు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















