School Assembly News Headlines for 28 June 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ టాప్ స్టోరీలు ఇక్కడ చూడండిజూన్ 28 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 28 June 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.
28 జూన్ 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 28 June 2023)
ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి (Andhra Pradesh News)
- ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రాజధానేతర ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. ఢిల్లీలోని జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అనుమతులు లబించాయి. దీంతో అమరావతిలో 47 వేళ్ల ఇళ్లను నిర్మించనున్నారు.
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఉపవాస దీక్షలో ఉండడంతో నీరసంతో పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం.
- నంద్యాల జిల్లాలోని కొత్త పల్లి మండలంలో పెద్దపులి తిరుగుతుందనే వార్తలు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బలపాతిప్ప గ్రామంలో ఓ ఆవును పెద్దపులి చంపిందని స్థానికులు తెలియజేశారు.
- మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోట ధరలు రూ.100ల నుంచి రూ.300ల వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి (Telangana News)
- మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపూర్ జిల్లా సర్కోలీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు.
- మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు.
- కామారెడ్డి జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ప్రమాదం జరిగింది. రోడుపై టోల్‌గేట్‌ను ఓ కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో పలువురు టోల్‌గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి
- హైదరాబాద్‌లో భారీ దొంగతనం జరిగింది.ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ చోరీ వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి (National News)
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుంచి ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. రెండు రైళ్లను ప్రత్యేక్షంగా, మరో మూడు రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు
- మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్‌ద్వార్ దుబే కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్లు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
- ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)కు బ్రేక్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















