Telangana NEET PG counselling 2023 Registration: మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 రిజిస్ట్రేషన్ (Telangana NEET PG counselling 2023 Registration):
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS), తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలోని MD, MS, MDS ప్రోగ్రామ్‌లలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 (Telangana NEET PG counselling 2023 Registration) కోసం అధికారిక వెబ్‌సైట్
pvttspgmed.tsche.in
లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవడానికి, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 16. ఆ తేదీలోపు అభ్యర్థులు తమను తాము రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.6,300లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బయట రాష్ట్రం లేదా భారతదేశం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు రాష్ట్రం వెలుపల పొందిన డిగ్రీలకు రూ. 5,000, దేశం వెలుపల పొందిన డిగ్రీలకు రూ. 7,000 ధ్రువీకరణ ఫీజును చెల్లించాలి.
తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2023 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? (How to register for Telangana NEET PG counselling 2023?)
తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ కోసం ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ముందుగా అభ్యర్థులు pvttspgmed.tsche.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- మొబైల్, ఈ మెయిల్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి, మీరే నమోదు చేసుకోవచ్చు.
- ఇప్పుడు, చెల్లింపుపై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి
- దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫార్మ్‌ను సేవ్ చేసి ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు (Telangana NEET PG Counselling 2023: Documents Required)
తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన పత్రాలు గురించి ఇక్కడ తెలుసుకోండి.- రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- NEET PG 2023 అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్
- ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్
- ఆధార్ కార్డ్
- మొదటి నుంచి చివరి MBBS వరకు స్టడీ సర్టిఫికెట్‌లు.
- BC/SC/ST అభ్యర్థుల విషయంలో తాజా కేటగిరీ సర్టిఫికేట్
- ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్
- ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికెట్
- చెల్లుబాటు అయ్యే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (వర్తిస్తే)
- NRI సర్టిఫికెట్ (వర్తిస్తే)
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















