LIVE

TG SET 2025 ఫలితాలు విడుదల తేదీ లైవ్ అప్‌డేట్ల కోసం ఇక్కడ చూడండి

Rudra Veni

Updated On: January 13, 2026 04:00 PM

TG SET ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఫలితాలకు సంబంధించిన తేదీలను ఇక్కడ అంచనా అందించాం. ఫలితాల అప్‌డేట్లను ఇక్కడ చూడండి. 
 
TG SET 2025 ఫలితాలు విడుదల తేదీ లైవ్ అప్‌డేట్ల కోసం ఇక్కడ చూడండిTG SET 2025 ఫలితాలు విడుదల తేదీ లైవ్ అప్‌డేట్ల కోసం ఇక్కడ చూడండి

TG SET ఫలితాలు విడుదల తేదీ 2025 (TG SET Results Release Date 2025) : TG SET 2025 (తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)కి హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 22, 23, 24, 2025 తేదీల్లో జరిగింది. సాధారణం ఫలితాలు పరీక్ష జరిగిన 35 నుంచి 45 రోజుల తర్వాత వెల్లడవుతాయి. దీని ప్రకారం చూస్తే జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 10, 2026 తేదీల మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గత ట్రెండ్‌లను అనుసరించి ఈ తేదీల మధ్యకాలంలో ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.రాష్ట్రంలో యూనిర్సిటీలు, కాలేజీల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులను పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ముక్యమైన పరీక్ష. డిసెంబర్‌లో జరిగిన TG TET ఆన్సర్ కీ జనవరి 8వ తేదీన అందుబాటులోకి వచ్చింది. TG SET ఫలితాలు (TG SET Results Release Date 2025) విడుదలైన తర్వాత సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో telanganaset.org అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ SETని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, దరఖాస్తు ఐడీ, పుట్టిన తేదీలను నమోదు చేయడం ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపై అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు వారి మార్కులు, అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబుతుంది.

TG SET ఫలితాలు 2026ను ఎలా చెక్ చేయాలి? (How to Check Your TG SET Result 2026)

TG SET 2026 ఫలితాలు (TG SET Results Release Date 2025) విడుదలైన తర్వాత అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చూసుకునే విధానం ఈ దిగువున వివరంగా అందించాం.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.telanganaset.orgకి వెళ్లాలి.

  • హోంపేజీలో తాజా అప్‌డేట్ల విభాగం కోసం చూడాలి. అనంతరం TS SET ఫలితం లింక్‌పై క్లిక్ చేయాలి.

  • మీ హాల్ టికెట్ నెంబర్, దరఖాస్తు ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

  • మీ ఫలితాలు, స్కోర్ కార్డులను చూడాలి. డౌన్‌లోడ్ చేసుకోవాలి.

TG SET స్కోర్ కార్డులో ఉండే వివరాలు ఏమిటి?

TG SET స్కోర్ కార్డులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • స్కోర్ కార్డులో అభ్యర్థుల పేరు, చిరునామా, రోల్ నెంబర్‌

  • పొందిన మార్కులు, మొత్తం స్కోర్

  • అర్హత స్టేటస్

LIVE

TG SET ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్లు

  • 04 00 PM IST - 13 Jan'26

    TG SET 2025 మార్కులను ఎలా లెక్కించాలి?

    • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ నుండి TS SET 2025 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    • స్టెప్ 2: మీ సమాధానాలను సమాధాన కీతో సరి పోల్చాలి.

    • స్టెప్ 3: ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఇవ్వండి.

    • స్టెప్ 4: నెగటివ్ మార్కింగ్ లేదు, కాబట్టి మార్కులను తగ్గించాల్సిన అవసరం లేదు.

    • స్టెప్ 5: మీ అంచనా వేసిన మొత్తం స్కోర్‌ను పొందడానికి మీ మార్కులను జోడించండి.

  • 03 15 PM IST - 13 Jan'26

    TS SET స్కోర్‌కార్డ్ 2025 ఎందుకు ముఖ్యమైనది?

    TS SET 2025 స్కోర్‌కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతకు రుజువుగా పనిచేస్తుంది. ఇది మీ మార్కులు, ర్యాంకును ప్రస్తావిస్తుంది. అర్హత తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇది అవసరం అవుతుంది.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/tg-set-result-release-date-2025-live-updates/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy