TS DSC Exam: తెలంగాణ డీఎస్సీ వాయిదా, మళ్లీ అప్పుడే ఎగ్జామ్స్?
తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా 2023 (TS DSC Exam):
తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష పోస్ట్‌పోన్ అయింది. నవంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ డీఎస్సీ పరీక్షను వాయిదా (TS DSC Exam) వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. మళ్లీ ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే దాని గురించి త్వరలో తెలియజేస్తామని అందులో పేర్కోవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30వ తేదీల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. వాయిదా పడడంతో ఆ తేదీల్లో ఇప్పుడు పరీక్షలు జరగవు.
అయితే మళ్లీ ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.
విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో భాగంగా రాష్ట్రంలో 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులున్నాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారమే జరగాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎప్పటి నుంచో కోరుతుండగా తాజాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ఎన్నికల కారణంగా నియామక పరీక్ష, ప్రక్రియ వాయిదా పడ్డాయి. కాగా రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 30వ తేదీనే పోలింగ్ ప్రక్రియ ఉంది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో రాస్ట్ర ఉపాధ్యాయులు కీలకమైన పనుల్లో నిమగ్నమవుతుంటారు.
తెలంగాణ డీఎస్సీనే కాదు.. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష (TS Group-2 Exam) కూడా వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నప్పుడు టీఎస్సీఎస్సీ ప్రకటించడం జరిగింది. పాత షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్ష నవంబరు 2, 3 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించడం కష్టమని TSPSC వెల్లడించింది. TSPSC ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















