TS DSC Notification 2023: నిరుద్యోగులకు అలర్ట్, రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2023 (TS DSC Notification 2023): తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ (TS DSC Notification 2023) త్వరలో విడుదలకానుంది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఆరు వేలకుపైగా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం రెండు రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.
టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు (TS DSC Notification 2023 Overview)
అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2023కు సంబంధించిన వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేశాం.| జాబ్ టైప్ | ప్రభుత్వ ఉద్యోగం |
|---|---|
| జాబ్ కేటగిరి | టీచర్ ఉద్యోగాలు |
| రిక్రూట్‌మెంట్ పేరు | TS DSC రిక్రూట్‌మెంట్ 2023 |
| రిక్రూట్‌మెంట్ అథారిటీ పేరు | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
| ఖాళీల సంఖ్య | 6500లకుపైగా |
| నోటిఫికేషన్ రిలీజ్ సమయం | రెండు రోజుల్లో |
| అప్లికేషన్ మొదలయ్యే తేదీ | త్వరలో |
| అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
| అధికారిక వెబ్‌సైట్ | https://tspsc.gov.in |
తెలంగాణ డీఎస్సీ అర్హతలు (TS DSC Eligibility)
టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలు తెలుసుకుని ఉండాలి. అర్హత లేంటో ఇక్కడ తెలుసుకోండి.- డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి భారతీయులై ఉండాలి.
- తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
- వయస్సు 18 సంవత్సరాలు నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొంది యూనివర్సిటీ నుంచి బీఈడీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు డీఈడీ కోర్సుతో ఇంటర్ పాసై ఉండాలి. అలాగే ఏదైనా ప్రత్యేకమమైన సబ్జెక్టులో బీఈడీ డిగ్రీ చేసి ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో 6,500 ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు స్కూల్ విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌తోపాటు, పూర్తి వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైతే ఎంతోమంది నిరుద్యోగుల కల నెరవేరనుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















