Telangana Inter Supplementary Results 2023 : త్వరలో తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023
(Telangana Inter Supplementary Results 2023)
:
లంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter Supplementary Results 2023) త్వరలో విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి జూన్ 20, 2023 వరకు జరిగాయి. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు అవకాశంగా TSBIE సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది.వారిస్కోర్‌ను పెంచుకోవడానికి, వారి విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.
ఇంటర్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ 28, 29వ తేదీల్లో విడుదల అవ్వనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో tsbie.cgg.gov.in అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు తమ రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్‌ను ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్కుల లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2023లో విద్యార్థుల పేరు, సబ్జెక్ట్ వారీగా పొందిన మార్కులు, పొందిన మొత్తం మార్కులు, శాతం, అర్హత స్థితి వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2023 వివరాలు (Telangana Inter Supplementary Exam 2023 Details)
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2023 వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.| సంస్థ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) |
|---|---|
| పరీక్ష పేరు | తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ 2023 |
| పరీక్షలు | తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు |
| విద్యా సంవత్సరం | 2022-23 |
| పరీక్షా తేదీలు | జూన్ 10 నుంచి 20, 2023 |
| ఫలితాల విడుదల తేదీ | జూన్ 28, 29 (అంచనా) |
| రిలీజ్ మోడ్ | ఆన్‌లైన్ |
| ఫలితాలు చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు | విద్యార్థి రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ |
ఫలితాలు చెక్ చేసుకోవడానికి వెబ్‌సైట్లు (List of Websites to check the Result)
ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ దిగువున వెబ్‌సైట్లను చూడొచ్చు.tsbie.cgg.gov.in
www.results.cgg.gov.in
manabadi.co.in
indiaresults.com
results.eenadu.net
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS Inter Supply Result 2023?
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE), తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది.- ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TSBIE అధికారిక వెబ్‌సైట్‌కి tsbie.cgg.gov.in ని సందర్శించాలి
- తర్వాత హోంపేజీలో ఫలితాల విభాగానికి వెళ్లాలి.
- IPASE మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు 2023 కోసం లింక్‌ని కనుగొని, దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సంవత్సరం, కేటగిరి పరీక్ష రకాన్ని ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
- "Get Result" లేదా "Get Memo" బటన్‌పై క్లిక్ చేయాలి. మీ TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా TS ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- భవిష్యత్ ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















