Telangana LAWCET 2023 Result Date: ఈరోజే తెలంగాణ లాసెట్ 2023 ఫలితాలుతెలంగాణ లాసెట్ 2023 ఫలితాల విడుదల తేదీ (Telangana LAWCET 2023 Result Date): తెలంగాణ లాసెట్ 2023 ఫలితాలు (Telangana LAWCET 2023 Result Date) ఈరోజు విడుదల కానున్నాయి. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 15, 2023న టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ ఫలితాలు రిలీజ్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారు. అభ్యర్థుల వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in లో చెక్ చేసుకోవచ్చు. ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల లాసెట్ ఫలితాలు ర్యాంకు కార్డుల రూపంలో విడుదలవుతాయి.
తెలంగాణ లాసెట్ 2023 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to check Telangana Lawset 2023 Results?)
- ముందుగా అభ్యర్థులు lawcet.tsche.ac.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- హోంపేజీలో "Download Rank Card" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో "Hall Ticket Number" పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి
- తర్వాత గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు కనిపిస్తుంది.
- దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. అందుకే ఆ కాపీని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలంగాణ లాసెట్ 2023 ఫలితాల తేదీ (TS LAWCET 2023 Result Date)
తెలంగాణ లాసెట్ 2023 ఫలితాలకు సంబంధించిన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది.| TS LAWCET 2023 పరీక్ష | మే 25, 2023 |
|---|---|
| TS LAWCET 2023 ఆన్సర్ కీ రిలీజ్ డేట్ | మే 29, 2023 |
| TS LAWCET 2023 ఫలితాల విడుదల తేదీ | జూన్ 15, 2023 |
| TS LAWCET 2023 అధికారిక వెబ్‌సైట్ | lawcet.tsche.in |
తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25న జరిగింది. ఈ ప్రవేశ పరీక్షకు 43,692 మంది రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్షకు 36,218 మంది హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 25,747 మంది పోటీ పడ్డారు. లాసెట్ ఫలితాల కోసం వెబ్‌సైట్‌లో lawcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















